నామినేషన్ వేసి అవసరమైతే జైలుకు వెళ్తామయ్య.. రిపోర్టర్ కి పేర్ని నాని అదిరిపోయే రిప్లై
Breaking News
శోభిత కొత్త సినిమా.. కోడలిపై నాగార్జున ప్రశంసలు
Published on Sun, 09/20/2026 - 15:00
అక్కినేని కోడలు శోభిత ధూళిపాల నటిస్తోన్న లేటేస్ట్ మూవీ వెట్టువం. ఈ సినిమాకు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ పా రంజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామాగా రూపొందిస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ నుంచి వరల్డ్ ఆఫ్ వెట్టువం పేరుతో ఓ వీడియో రిలీజ్ చేశారు. ఇందులో ప్రాచీన యుద్ధ కళలను చూపించారు. ఈ సీన్స్ కోసం నటీనటులు యుద్ధ కళలు నేర్చుకున్నారని వెల్లడించారు. దాదాపు ఐదు నిమిషాల పాటు ఉన్న ఈ వీడియో సినిమాపై ఆసక్తిని పెంచేసింది.
ఈ మూవీ శోభిత రోల్ మరింత ఇంట్రెస్టింట్‌గా ఉండనుందని ఈ వీడియోలో చూస్తే అర్థమవుతోంది. ఇది వీక్షించిన హీరో నాగార్జున.. కోడలిపై ప్రశంసలు కురిపించారు. శోభిత పడుతున్న కష్టాన్ని ప్రశంసించారు. ఈ మూవీ కోసం ఆత్మరక్షణ కళలను నేర్చుకున్న శోభితన ఉద్దేశించి ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. ఈ సినిమా కోసం శోభిత చాలా కష్టపడినట్లు కనిపిస్తోంది.. వెట్టువం వీడియో చాలా అద్భుతంగా ఉంది. ఈ సినిమాను చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా అని నాగ్ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. కాగా.. ఈ సినిమాలో శోభిత రాధి అనే పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీకి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.
Tags : 1