APలో ఉన్నది ఎల్ నినో కాదు.. ఎల్లో నినో ఎఫెక్ట్.. YS జగన్ కౌంటర్
Breaking News
రాజకీయ ఫ్యాషన్‌కి కేరాఫ్‌గా మోదీ..! చివరికి అది కాస్తా..
Published on Thu, 09/17/2026 - 11:03
ఒక రాజకీయ నాయకుడి ప్రసంగాలకు మించి అతని వార్డోరోబ్ ఉండటం అత్యంత అరుదు. కానీ ప్రనరేంద్ర మోదీ ఆ విషయంలో విజయం సాధించారు. కార్యక్రమానికి అనుగుణమైన వేషధారణ, అది కూడా నిలకడతో తనదైన శైలితో కనిపించే తీరు..అందర్నీ ఆకట్టుకుంటుంది. చెప్పాలంటే అది మోదీ మార్క్‌గా స్థిరపడిపోయింది. పండుగలాంటి కార్యక్రమానికి వేడుక వాతావరణం ఉట్టిపడేలా ఆయన ఆహార్యం ఉంటుంది.
దశాబ్దాల నాటి ఫ్యాషన్‌ని ట్రెండీగా మార్చి..తన పేరుతో గుర్తింపు తెచ్చుకునేలా ఫ్యాఫన్ ప్రపంచంలో చెరగని ముద్ర వేశారు. ఇన్నాళ్లు రాజకీయ వేషధారణలో చిన్నారులు తీర్చిదిద్దడానికి నెహ్రు జాకెట్లు ఉపయోగించేవారు. అంతెందుకు పెద్దవాళ్లు సైతం ఆ స్టైల్‌నే అనుకరించేవారు. అలాంటిది ఇవాళ మార్కెట్లో ఎటు చూసినా.. మోదీ స్టైల్‌తో కూడిన జాకెట్లే దర్శనమిస్తున్నాయి. పైగా మోదీ జాకెట్ పేరుతో బ్రాండ్‌గా ప్రసిద్దిగాంచడం విశేషం. ఇవాళ ప్రధాని మోదీ 76వ పుట్టిన రోజు పురస్కరించుకుని ఆయన ధరించే జాకెట్ విశేషాలు, ఆ స్టైల్ ఎలా బ్రాండ్‌గా మారింది తదితరాలు గురించి సవివరంగా తెలుసుకుందామా..!.
మోదీ దశాబ్దాల నాటి స్లీవ్‌లెస్ జాకెట్‌ని తనదైన శైలిలో ట్రెండీ ఫ్యాషన్‌వేర్‌గా మార్చేశారు. ఆఖరికి దాని పేరు కూడా ఆయన పేరుతో మేళవించే డిజైన్‌గా మారిపోయింది. మెన్స్ వేర్ షాపుల్లో హుందాగా స్టైలిష్‌గా కనిపించాలని ఓ 50-60 మధ్య వయస్కులు అడగగానే మోదీ జాకెట్లు ఇవ్వమంటరా అని ఠక్కున అడుగుతుండటం విశేషం. పార్లెమెంట్ నుంచి ప్రపంచ సదస్సుల వరకు దాదాపు ప్రతి ప్రధాన బహిరంగ కార్యక్రమంలో మోదీ దీన్ని ధరించారు. దాంతో రిటైలర్లు అంతా ఆ సాధారణ జాకెట్‌ని మోదీ జాకెట్ పేరుతో విక్రయించడం మొదలుపెట్టారు
పెళ్లిళ్లు, పండుగలు, మరేదైన ప్రత్యేక కార్యక్రమంలో పురుషుల కలెక్షన్లో ఇది తప్పనిసరి అనేలా ప్రత్యేకతను దక్కించుకుంది. నిజానికి నెహ్రూ మృదువైన బ్లేజ్, గ్రే రంగులు ఇష్టపడితే..మోదీ జాకెట్లను కాషాయం, మెరూన్, రాయల్ బ్లూ, మస్టర్డ్ జ్యువెల్ టోన్స్ వంటి ప్రస్ఫుటమైన రంగులను ఎంచుకుంటారు. మోదీ కుర్తాకు జతగా ఈ జాకెట్లను ధరించడం విశేషం. ఈ లుక్ ఆధునికంగా కనిపించేలా చేయడమే గాక గ్రాండ్‌గా కనిపించేలా చేస్తుంది.
వాటిలో బాగా ఫేమస్ అయ్యినవి..
ప్రచార సమయంలో తరుచుగా ధరించే ప్రకాశవంతమైన వెస్ట్‌కోట్‌తో కూడిన సగం చేతుల కుర్తా ప్రారంభంలోనే ట్రేడ్‌మార్క్‌గా మారింది. ఆ తర్వాత మ్యాండరిన్ కాలర్‌తో చక్కగా కుట్టిన బంద్‌గాలా సూట్లు వచ్చాయి. వీటిని మోదీ బ్రిక్స్ సమావేశం వంటి శిఖరాగ్ర సమావేశాలలోనూ, అమెరికా పర్యాటనల సందర్భంగా ధరించి తన రూపానికి అంతర్జాతీయ రేంజ్ లుక్‌ని అందించేలా తీర్చిదిద్దుకుంటారు.
అంతేగాదు ఒక ఇంటర్వ్యూలో రీసైకిల్ చేసిన ప్లాస్టిక్ సీసాలతో తయారు చేసిన జాకెట్ స్టైలింగ్ సుస్థిరతపై ఒక ప్రకటనగా మార్చింది. ఆ తర్వాత 2018లో దక్షిణ కొరియా అప్పటి అధ్యక్షుడు మూనే జే ఇన్‌కు ఇచ్చి ఒక ప్రత్యేకమైన బహుమతి చర్చనీయాంశంగా మారింది. అందులో ఆయన ప్రత్యేకంగా కుట్టించిన జాక్లెట్లు ఉన్నాయి. వాటిని ‘మోదీ వెస్ట్’లుగా పిలుస్తూ బహిరంగంగా మోదీకి ధన్యవాదాలు తెలిపారు.
ఇక్కడ మోదీ జాకెట్లను అందరు ఇష్టపడతారు, ఎందుకంటే భారతీయ హస్తకళ, ఖాదీకి మూలం అవి. కెమెరాలో స్పష్టంగా కనిపిస్తుంది, అలాగే పలు విధాలుగా ఉపయోగించుకోవచ్చు. అంతేగాదు నిలకడ అనేది ధరించే దుస్తుల్లో కూడా పాటిస్తే..అదే మనకు గర్తింపు తెచ్చిపెడుతుందనే విషయాన్ని హెలెట్ చేస్తోంది మోదీ ఫ్యాషన్ శైలి. ఆయన ఏమీ ఆ శైలిని ఆవిష్కరించకపోయినా..ఆ పురాత భారతీయ శైలి మోదీ కారణంగా వెలుగులోకి రావడమే గాక యావత్తు ప్రపంచం భారత సంప్రదాయ ఫ్యాషన్‌కి ఆకర్షితులయ్యేలా చేసేందుకు దారితీయడం విశేషం.
ఇదీ చదవండి: Japan: గాఢంగా నిద్రపోతే... 3.76 లక్షలు!
Tags : 1