Breaking News

మైనస్‌ 50 డిగ్రీల చలిలో లక్షలాది మంది ఖైదీల కన్నీటి కథ

Published on Mon, 09/14/2026 - 11:18

మైనస్‌ 50 డిగ్రీల కన్నా తక్కువగా ఉండే అతి చల్లని వాతావరణంం చుట్టూ అంతులేని మంచు పర్వతాలు.. జనసంచారం చాలా తక్కువ. రష్యాలోని ఈశాన్య భాగంలో ఉన్న కోలిమా ప్రపంచంలోని అత్యంత కఠినమైన, ఏకాంత ప్రదేశాల్లో ఒకటి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈ ప్రాంతాన్ని ప్రపంచం గుర్తించేలా చేసింది అక్కడి చలి మాత్రమే కాదు.. దాని వెనుక ఉన్న విషాద చరిత్ర. 

సోవియట్‌ పాలకుడు జోసెఫ్‌ స్టాలిన్‌ పాలనలో కోలిమా ప్రాంతం ఒక పెద్ద లేబర్‌ క్యాంప్‌గా మారింది. గులాగ్‌ అనే వ్యవస్థలో భాగంగా వేలాది కిలోమీటర్ల దూరం నుంచి ఖైదీలను ఇక్కడికి తరలించేవారు. బంగారం, ఇతర ఖనిజాల తవ్వకాలు, రహదారుల నిర్మాణం వంటి అత్యంత కఠినమైన పనుల్లో వారిని ఉపయోగించేవారు.

తీవ్రమైన చలి, తగిన ఆహారం లేకపోవడం, వ్యాధులు, కఠినమైన వర్కింగ్‌ కండిషన్స్‌, ఇవన్నీ అక్కడి ఖైదీల జీవితాన్ని దారుణంగా మార్చేశాయి. అసలు కొలిమాకు ఎంతమందిని తరలించారు, అక్కడ ఎంత మంది మరణించారు అనే విషయంపై చరిత్రకారుల్లోనే స్పష్టత లేదు. అయితే బాధితుల సంఖ్య లక్షల్లోనే ఉంటుంది అని అంచనా వేస్తున్నారు. 

నేడు కోలిమాలో చిన్న చిన్న పట్టణాలు, గనులు, విస్తారమైన అడవులు కనిపిస్తాయి. అయితే శీతాకాలంలో తీవ్రమైన చలి, పరిమితమైన రవాణా సదుపాయం, కఠినమైన ప్రకృతి ఈ ప్రాంతాన్ని ఛాలెంజింగ్‌ లొకేషన్‌గా మార్చాయి. 

కోలిమా అనేది ఒక ట్రావెల్‌ డెస్టినేషన్‌ మాత్రమే కాదు ఒకప్పుడు వేలాది మంది ఖైదీలు అనుభవించిన బాధను గుర్తు చేసే ప్రదేశంగా చరిత్రలో నిలిచిపోతోంది. పూర్తిగా మంచుతో నిండి ఉన్న ఈ నేల సోవియట్‌ చరిత్రలోని ఒక చీకటి అధ్యాయానికి నేటికీ నిశ్శబ్ద సాక్షిగా నిలిచిపోయింది. 

ఇదీ చదవండి: ఎట్టకేలకు 105 ఏళ్ల తల్లిని కలిసిన 85 ఏళ్ల కుమార్తె

#

Tags : 1

Videos

ఎన్నికలకు ముందు ఒకరోజు జగన్ దగ్గరకి నేను పేర్ని నాని వెళ్లి... ఈ వీడియో చూస్తే చాలు

పండుగ రోజు గుడ్ న్యూస్ క్రీడాకారులకు జగన్ అభినందనలు

దుబాయ్ కి జంప్.? బయటపడ్డ NANDUS WORLD సీక్రెట్ స్కెచ్..!

ఫ్రీ హోల్డ్ భూముల పేరుతో కూటమి రైతుల జీవితాలతో చెలగాటం

కావాలని మహిళా బైకర్ ను ఢీ కొట్టిన కారు వైరల్ అవుతున్న వీడియో

యూపీలోని ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం

అర్థరాత్రి పోలీస్ స్టేషన్ లోనే తన్నుకున్న TDP తమ్ముళ్లు

3లక్షల అమెరికన్ డైమండ్స్ తో గణపతి.. చూస్తే కళ్లు చెదిరిపోవాల్సిందే

రఘు మాస్టర్ ని కలిశా నన్నే అన్ని చూసుకోమన్నారు

గంభీర్ సంచలన నిర్ణయం.. అభిషేక్ ఔట్ టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే

Photos

+5

హైదరాబాద్ : అబ్బా భలే ఉన్నాడే... గణేశుడు (ఫొటోలు)

+5

'ధురంధర్' భామ ఆయేషా బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

ఆషికా.. బార్బీ డాల్‌కి ఏం తక్కువ కాదు! (ఫొటోలు)

+5

అందంతో టాప్ లేపిన మృణాల్ ఠాకుర్ (ఫొటోలు)

+5

ఫ్యాన్స్‌ ఫైట్‌ చేస్తుంటే.. స్టార్స్‌ ఏం చేస్తున్నారో చూడండి! (ఫొటోలు)

+5

ఘనంగా ‘సైమా అవార్డ్స్ 2026’ సినీ స్టార్స్ సందడి (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌ మహా గణపతి తొలిపూజకు వేళాయే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌లో వినాయక చవితి సందడి (ఫోటోలు)

+5

'మండాడి' సినిమా సక్సెస్ మీట్ (ఫోటోలు)

+5

విజయవాడను ముంచెత్తిన భారీ వర్షం...చెరువులను తలపిస్తున్న రోడ్లు (ఫొటోలు)