Breaking News

గులాబీలు పండిస్తూ.. నెలకు రూ. 2.5 లక్షలు..!

Published on Sun, 09/13/2026 - 16:28

ఒక్కోసారి ఎప్పుడు సాగుచేసే పంటను సాగు చేసినా..ఊహించని విధంగా విపరీతమైన నష్టాలు చవిచూస్తుంటాం. అధిక దిగుబడి వల్ల గిట్టుబాటు ధర లేకోవడమో లేక ఇతర కారణాల వల్లే విపరీతమైన నష్టాలను చవిచూస్తుంటాం. అలాంటప్పడు సరైన నిర్ణయం తీసుకుని..కాస్త తెలివిగా వ్యవహరిస్తే..కనక వర్షం కురిసేలా లాభాలు కూడా పొందొచ్చు. అదే చేసి చూపించాడు ఈ యువ రైతు. 

అతడే మహారాష్ట్రకు చెందిన అర్జున్‌ సబాలే. అతడి కుటుంబం బంతి, చామంతి పువ్వులను సాగు చేసి, వాటి అమ్మకం కోసం ముంబై తీసుకువెళ్లేవారు. అయితే ధరలు పడిపోవడం, పోటీ పెరడగం వంటి కారణాలతో నష్టాలు రావడం మొదలైంది. తమ కుటంబ పొలం లాభదాయకంగా మార్చడానికి ఏం చేయాలో తోచేది కాదు. ఏం చేద్దాం అని సబాలే ఆలోచిస్తున్న తరుణంలో సురక్షిత వ్యవసాయం వైపుకి అడుగులు వేశాడు. సుమారు పావు ఏకరం భూమిలో ఈసారి గులాబీలు పెంచి చూడాలని అనుకున్నాడు. 

ఏదో చిన్న ప్రయోగంగా మొదలైన పూల పెంపకం కాస్తా ఏడాది పొడవునా ఆదాయన్ని అందించే పూల వ్యాపారంగా అభివృద్ది చెందింది. బీఏస్సీ అగ్రీకల్చర్‌ చదువుతున్నప్పుడే..వివిధ పంటలను అధ్యయనం చేయడానికి పొలాలను సందర్శించడం ప్రారంభించాడు. అక్కడ పాలీహౌస్‌ సాగును చూసి రక్షిత పూల సాగువైపుకి అడుగుపెట్టాడు. ఆ సమయంలోనే గులాబీల సాగుని క్షుణ్ణంగా గమనించాడు సబాలే. అలా బెంగుళూరుకి చెందిన ఒక రైతు నుంచి గులాబీ కాండాలను ఒక్కొక్కటి రూ. 12ల చొప్పున కావల్సినన్ని మొక్కలు కొని పావు ఎకరం భూమిలో నాటాడు. 

అందుకోసం సుమారు రూ. 8000లు వరకు పెట్టుబడి పెట్టాడు. జస్ట్‌ పదివేల చదరుపు అడుగుల భూమిలో గులాబీలు ప్రారంభించి, క్రమంగా విస్తరించాడు. ఆ తోటలో సుమారు 500 గులాబీలు పైనే పూసేవి, వాటిని ఒక్కోక్కటి కనీసం రూ. 5లకు చొప్పున అమ్మిన రోజుకు దాదాపు రూ. 25000/- దాక సంపాదించేవాడు. ఈ రాబడితో అతడు తోటను విస్తరించడమే గాక జెర్బెరా వంటి డెకరేటెడ్‌ పూల మొక్కలను కూడా పెంచడం ప్రారంభించాడు. అలా పావు ఎకరం నుంచి  ఎకరం భూమిలో ఒక్కో రకం 16,000 మొక్కలతో గులాబీలు, జెర్బెరాలను పండించడం ప్రారంభించాడు. 

అలా సబాలే తన వ్యవసాయ క్షేత్రంలో ప్రతిరోజూ సుమారు వెయ్యి గులాబీలు, రెండు వేల జెర్బారాలు పూస్తున్నాయి.  ఒక్కో గులాబీకి రూ. 5లు, ఒక్కో జెర్బెరా కాడకు రూ. 4 లు చొప్పున రోజుకు రూ. 5వేల నుంచి రూ. 8 వేల దాక ఆదాయం వస్తోంది. అంటే నెల వచ్చేటప్పటికీ రూ. 3.5 లక్షల టర్నోవర్‌ని ఆర్జిస్తున్నాడు. అంటే నికర లాభం రూ. 2.5 లక్షలు ఉంటుంది. సబాలే గులాబీలు, జెర్బెరాలను సహజసిద్ధమైన వెంటిలేషన్‌ ఉన్న పాలీహౌస్‌లో పెంచుతాడు. గాలి ప్రసరణ కోసం పవర్డ్‌ కూలింగ్‌  ఫ్యాన్‌లకు బదులుగా రూఫ్‌ వెంట్లు, సైడ్‌ కర్టెన్లను ఉపయోగిస్తారు. 

ఆయన పావు ఎకరంలో ప్రారంభించినప్పుడు వీటన్నింటిని ఏర్పాటు చేయడానికి దాదాపు రూ. 3 లక్షలు దాక ఖర్చయింది. అయితే ఈ మొక్కలు ఐదు నుంచి ఏడేండ్ల వరకు దిగుబడి ఇస్తూనే ఉంటాయి కాబట్టి పెట్టుబడిని చాలా ఏళ్లు పాటు విస్తరించుకోవచ్చు అని అంటున్నాడు సబాలే. అలాగే తన పువ్వులను నేరుగా స్టాల్స్‌, హోల్‌సెల్‌ మార్కెట్లకు అమ్ముతుంటాడు. అయితే డిమాండ్‌ని బట్టి పువ్వులను బెంగళూరు, వడోదర, అహ్మదాబాద్‌, హైదరాబాద్‌, ముంబైలకు సరఫరా చేస్తుంటానని చెబుతున్నాడు సబాలే.

ఇదీ చదవండి: అది మన డీఎన్‌ఏలోనే ఉంది ..! మాధవన్‌ కుమారుడు వేదాంత్‌

 

Videos

ఎన్నికలకు ముందు ఒకరోజు జగన్ దగ్గరకి నేను పేర్ని నాని వెళ్లి... ఈ వీడియో చూస్తే చాలు

పండుగ రోజు గుడ్ న్యూస్ క్రీడాకారులకు జగన్ అభినందనలు

దుబాయ్ కి జంప్.? బయటపడ్డ NANDUS WORLD సీక్రెట్ స్కెచ్..!

ఫ్రీ హోల్డ్ భూముల పేరుతో కూటమి రైతుల జీవితాలతో చెలగాటం

కావాలని మహిళా బైకర్ ను ఢీ కొట్టిన కారు వైరల్ అవుతున్న వీడియో

యూపీలోని ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం

అర్థరాత్రి పోలీస్ స్టేషన్ లోనే తన్నుకున్న TDP తమ్ముళ్లు

3లక్షల అమెరికన్ డైమండ్స్ తో గణపతి.. చూస్తే కళ్లు చెదిరిపోవాల్సిందే

రఘు మాస్టర్ ని కలిశా నన్నే అన్ని చూసుకోమన్నారు

గంభీర్ సంచలన నిర్ణయం.. అభిషేక్ ఔట్ టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే

Photos

+5

హైదరాబాద్ : అబ్బా భలే ఉన్నాడే... గణేశుడు (ఫొటోలు)

+5

'ధురంధర్' భామ ఆయేషా బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

ఆషికా.. బార్బీ డాల్‌కి ఏం తక్కువ కాదు! (ఫొటోలు)

+5

అందంతో టాప్ లేపిన మృణాల్ ఠాకుర్ (ఫొటోలు)

+5

ఫ్యాన్స్‌ ఫైట్‌ చేస్తుంటే.. స్టార్స్‌ ఏం చేస్తున్నారో చూడండి! (ఫొటోలు)

+5

ఘనంగా ‘సైమా అవార్డ్స్ 2026’ సినీ స్టార్స్ సందడి (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌ మహా గణపతి తొలిపూజకు వేళాయే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌లో వినాయక చవితి సందడి (ఫోటోలు)

+5

'మండాడి' సినిమా సక్సెస్ మీట్ (ఫోటోలు)

+5

విజయవాడను ముంచెత్తిన భారీ వర్షం...చెరువులను తలపిస్తున్న రోడ్లు (ఫొటోలు)