Breaking News

AI రేసులో భారత్.. పెట్టుబడుల్లో భారీ వృద్ధి!

Published on Sat, 09/12/2026 - 14:54

భారతదేశంలో ఏఐ వినియోగం రోజురోజుకు పెరుగుతున్న తరుణంలో.. పలు కంపెనీలు ఈ రంగంలో భారీ పెట్టుబడులు పెడుతున్నాయి. సర్వీస్‌నౌ విడుదల చేసిన ఎంటర్‌ప్రైజ్ ఏఐ మెచ్యూరిటీ ఇండెక్స్ 2026 ప్రకారం.. దేశీయ సంస్థల్లో AIపై పెట్టుబడులు ఒక్క సంవత్సరంలోనే 119 శాతం పెరిగాయని తెలుస్తోంది.

2027 నాటికి 21.3 శాతం!
ప్రస్తుతం ఇండియన్ కంపెనీలు తమ ఐటీ బడ్జెట్‌లో సగటున 16.6 శాతం ఏఐ కోసం ఖర్చు చేస్తున్నాయి. 2027 నాటికి ఇది 21.3 శాతానికి చేరుతుందని అంచనా. దీనివల్ల భారతదేశం ఏఐ రంగంలో ఎంత వేగంగా ముందుకు వెళ్తుందో అర్థమవుతుంది.

ఏఐపై పెట్టుబడులు పెరుగుతున్నప్పటికీ.. దానిని సురక్షితంగా నిర్వహించడానికి అవసరమైన గవర్నెన్స్ మాత్రం ఆ స్థాయిలో లేదు. భారతదేశంలోని కేవలం 22 శాతం సంస్థలకే ఏఐ టెస్టింగ్, ఆడిటింగ్, రిస్క్ అసెస్మెంట్ వంటి విధానాలు ఉన్నాయి. 54 శాతం సంస్థలు ఏఐ ఏజెంట్‌ను ఉపయోగిస్తున్నప్పటికీ, కేవలం 11 శాతం మాత్రమే అటానమస్ వర్క్‌ఫ్లోను అమలు చేస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం ఏఐ వల్ల వచ్చే సమస్యలపై సంస్థలకు ఉన్న ఆందోళనలు. కాబట్టి ఏఐను వేగంగా ఉపయోగించడం మాత్రమే కాకుండా, దాన్ని బాధ్యతాయుతంగా నియంత్రించడం కూడా చాలా అవసరం.

ఏఐ విజయవంతంగా పనిచేయాలంటే..
ఏఐ విజయవంతంగా పనిచేయాలంటే మంచి డేటా, సిస్టమ్స్ అవసరం. అయితే.. భారతీయ సంస్థల్లో ఇది ఇంకా ఒక పెద్ద సవాలుగానే ఉంది. 74 శాతం కంపెనీలు.. డేటా అక్యురసీ, యాక్సెస్, మేనేజ్మెంట్ వంటి వాటిన మెరుగుపరచాల్సిన అవసరం ఉందని చెబుతున్నాయి.

కాగా మరో 56 శాతం సంస్థలు లెగసీ సిస్టమ్స్ ఇంటిగ్రేషన్ ప్రధాన సమస్యగా గుర్తించాయి. కేవలం 18 శాతం కంపెనీలు మాత్రమే విడివిడిగా ఉన్న ఇంటిగ్రేటెడ్ ప్లాట్‌ఫామ్స్‌కు భర్తీ చేశాయి. వివిధ విభాగాల డేటా ఒకదానితో ఒకటి కనెక్ట్ కాకపోతే ఏఐకు పూర్తి సమాచారం అందదు. అందువల్ల ఏఐ అభివృద్ధితో పాటు డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను కూడా బలోపేతం చేయాలి.

ప్రభుత్వం చర్యలు
ఏఐ విషయంలో భారత ప్రభుత్వం కూడా కొన్ని ముఖ్యమైన చర్యలు చేపడుతోంది. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటక్షన్ యాక్ట్, డీపీడీపీ రూల్స్, ఏఐ గవర్నెన్స్ గైడ్‌లైన్స్, ఇండియాఏఐ మిషన్, ఇండియాఏఐ సేఫ్టీ ఇన్‌స్టిట్యూట్ వంటి కార్యక్రమాలు ఏఐ ఇన్నోవేషన్‌తో పాటు ప్రైవసీ, సేఫ్టీ, అకౌంటబిలిటీ వంటి వాటికి ప్రాధాన్యత ఇస్తోంది.

ఇదే విధంగా సంస్థలు కూడా తమ ఇంటర్నల్ గవర్నెన్స్ సిస్టంను బలపరచాలి. ముఖ్యంగా ఏఐ ఏజెంట్లకు ఎంతవరకు డేటా, సిస్టమ్స్ యాక్సెస్ ఇవ్వాలి, ఎక్కడ హ్యూమన్ సూపర్ విజన్ అవసరం అనే విషయాలను స్పష్టంగా నిర్ణయించాలి. ఏఐపై ప్రజలకు, సంస్థలకు నమ్మకం ఏర్పడాలంటే ఈ గవర్నెన్స్ చాలా కీలకం. మొత్తం మీద.. భారతదేశం ఏఐలో పెట్టుబడులు పెట్టడంలో వేగంగా ముందుకు సాగుతోంది, కానీ గవర్నెన్స్ విషయంలో ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉందని తెలుస్తోంది.

ఇదీ చదవండి: బంగారంలో పెట్టుబడి.. రూ.1 లక్షకు రూ.3.64 లక్షలు!

Videos

10 వేలతో 9 లక్షల లాభం.. HDFC Flexi Cap Fund రికార్డ్ రిటర్న్స్

జగన్ లేకపోతే నేను లేను.. అందరి ముందు కన్నీళ్లు పెట్టుకున్న బద్దుకొండ అప్పలనాయుడు

2లక్షలు వసూలు చేసిన హిజ్రాలపై కేసు

చేసిందంతా ఆ ఇద్దరే! జూడో అసోసియేషన్ లీలలు

ముంచుకొస్తున్న 76 కిలోమీటర్ల ఉపద్రవం.. నాసా కెమెరాకు చిక్కిన సాక్ష్యం

పుష్ప రేంజ్ లో ఛేజింగ్.. పరారైన స్మగ్లర్లు

స్పిరిట్ ని తొక్కండి చూద్దాం... క్రిటిక్స్ కు వంగా తమ్ముడు సవాల్

భక్తుల దర్శనానికి సిద్ధమైన ఖైరతాబాద్ గణేషుడు

వాళ్ళు నా దగ్గర డబ్బు తీసుకుని ఒక్కటే హామీ ఇచ్చారు.. బాధితుడు షాకింగ్ నిజాలు

కార్యకర్తల కోసం కదిలిన జగనన్న.. గోల్డ్, సిల్వర్ కార్డ్స్

Photos

+5

'మండాడి' సినిమా సక్సెస్ మీట్ (ఫోటోలు)

+5

విజయవాడను ముంచెత్తిన భారీ వర్షం...చెరువులను తలపిస్తున్న రోడ్లు (ఫొటోలు)

+5

వినాయక చవితి రోజు తప్పక సమర్పించాల్సిన 21 పత్రాలు.. (ఫొటోలు)

+5

బేబీ బంప్‌తో సమంత.. ఈ ఫోటోలు చూశారా?

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (సెప్టెంబర్ 13 -సెప్టెంబర్ 19)

+5

'ఎపిక్' షూటింగ్‌లో ఆనంద్-వైష్ణవి గ్యాంగ్ ఇలా (ఫొటోలు)

+5

వినాయకుడికి ఇష్టమైన 10 ప్రసాదాలు... మీరు ఓ లుక్ వేయండి (ఫొటోలు)

+5

సమంత స్టన్నింగ్‌ లుక్స్‌ అదుర్స్‌ (ఫొటోలు)

+5

ఖైరతాబాద్‌ మహాగణపతి ఆగమన కార్యక్రమం (ఫొటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’ సినిమా ప్రెస్ మీట్ (ఫొటోలు)