Breaking News

సహ్యాద్రి గుండెల్లో ఛత్రపతి అడుగులు

Published on Mon, 09/07/2026 - 18:06

సహ్యాద్రి కొండల మధ్య ప్రయాణిస్తుంటే కొన్ని ప్రదేశాల్లో చరిత్రలో మనం భాగం అయినట్టు అనిపిస్తుంది. అక్కడికి చేరుకున్న ప్రతీసారి చరిత్రలోని ఒక పేజీ మన ముందు నిలిచినట్టు అనిపిస్తుంది. మహారాష్ట్రలో ఈ ఐదు కోటలు ఒక విభిన్నమైన అనుభూతిని అందిస్తాయి.

ఒక చారిత్రాత్మక యాత్ర
మహారాష్ట్ర అంటే ముంబై, పుణె వంటి నగరాలు మాత్రమే కాదుం సహ్యాద్రి పర్వత శ్రేణులు కూడా గుర్తొస్తాయి. ఎన్నో శతాబ్దాల చరిత్రను మోస్తున్న కోటలు ఈ నేల కీర్తిని నిలువెత్తునా చాటుతున్నాయి. వాటిలో ఛత్రపతి శివాజీ మహారాజ్‌ జీవితంతో బలమైన అనుబంధం ఉన్న రాయగఢ్, శివనేరి, ప్రతాపగఢ్, సింహగఢ్, తోరణ కోటలు ఒక సజీవ సాక్ష్యంలా కనిపిస్తాయి.

ఈ ప్రయాణంలో ప్రతి కోట ఒక భిన్నమైన అనుభూతిని ఇస్తుంది. ఒకచోట బాల్యం, మరోచోట పట్టాభిషేకం, ఇంకోచోట యుద్ధగాథ... ఇలా సహ్యాద్రి ప్రకతి మధ్య ఛత్రపతి శివాజీ చరిత్ర మెల్లగా మన కళ్ల ముందు ఆవిష్కతమవుతుంది.

శివనేరి

ఛత్రపతి శివాజీ జీవితాన్ని తెలుసుకునేందుకు చాలా మంది ఆయన కాలంలో నిర్మించిన కోటలను సందర్శిస్తారు. ఈ యాత్ర శివనేరితో మొదలు పెట్టడానికి ఇష్టపడుతుంటారు.

ఇక్కడ ఛత్రపతి శివాజీ మహారాజ్‌ జన్మించిన ప్రదేశంలో ఉన్నాం అనే ఫీలింగ్‌ చాలా స్పెషల్‌ అనిపిస్తుంది.

కొండల మధ్య ఉన్న కోట ప్రాంగణంలో నడుస్తుంటే, బాల్యం నుంచే మొదలైన ఒక మహా చరిత్ర గుర్తుకొస్తుంది.

కోట గోడల మధ్య కనిపించే ప్రాచీన నిర్మాణాలు, కొండపై నుంచి దూరదూరం వరకు కనిపించే సీనరీస్‌ ఇవన్నీ కలిసి శివనేరికి ఒక ప్రత్యేక ఎక్స్‌పీరియెన్స్‌ మిగిలిపోయేలా చేస్తాయి.

తోరణ... తొలి అడుగు 
సహ్యాద్రిలో మరో ముఖ్యమైన పేరు తోరణ. శివాజీ మహారాజ్‌ స్వాధీనం చేసుకున్న తొలి కోటగా ఇది ప్రసిద్ధి చెందింది. ఈ కోటను ‘ప్రచండగఢ్‌’ అని కూడా పిలుస్తారు. ఇక్కడ కొండలపై వీచే గాలి, దూరంగా కనిపించే పచ్చని కొండలు, కోట అవశేషాలు కలిసి ఒక స్లో ట్రావెల్‌ ఎక్స్‌పీరియెన్స్‌ను ఇస్తాయి. ఒకవైపు ప్రకతి, మరోవైపు చరిత్ర... రెండూ కలిసిన అందమైన ప్రదేశమే తోరణ.

ప్రతాపగఢ్‌...
ప్రతాపగఢ్‌ పేరు వినగానే 1659లో అఫ్జల్‌ ఖాన్‌తో జరిగిన యుద్ధం గుర్తుకొస్తుంది. కోట దగ్గరకు చేరుకున్న తర్వాత చరిత్ర అనేది పుస్తకంలో చదివే విషయంగా మాత్రమే కాకుండా, ఈ కొండల మధ్య జరిగిన సంఘటనలా అనిపిస్తుంది. కోట చుట్టూ విస్తరించిన సహ్యాద్రి కొండల వరుసలు, మధ్యలో కనిపించే పచ్చని లోయలు, ప్రాచీన నిర్మాణాలు కలిసి నాటి గంభీరమైన పరిస్థితిని మరోసారి గుర్తు చేస్తాయి. ఇక్కడ కొంతసేపు నిశ్శబ్దంగా నిలబడటం కూడా ఒక అనుభవమే.

సందర్శనీయ ప్రదేశాలు
ఈ ఐదు కోటల్లో ఒక్కో కోటకు ఒక్కో కథ ఉంటుంది. శివనెరిలో బాల్యం, తోరణలో తొలి విజయం, ప్రతాపగఢ్‌లో మహా యుద్ధం, సింహగఢ్‌లో తానాజీ మలుసరేల వీరగాథ, రాయగఢ్‌లో మరాఠా సామ్రాజ్య రాజధాని జ్ఞాపకాలు కనిపిస్తాయి.

1674లో రాయగఢ్‌లోనే శివాజీ మహారాజ్‌ పట్టాభిషేకం జరిగింది. దీంతో ఈ కోట మరాఠా చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.

సింహగఢ్‌ను గతంలో కొంధాణా అని పిలిచేవారు. 1670లో జరిగిన యుద్ధం, తానాజీ మలుసరే వీరత్వం ఈ కోట చరిత్రలో ఒక ప్రత్యేక ఘటనలుగా మిగిలిపోయాయి.

ఎక్కడ ఉండాలి

పుణె, మహాడ్, సతారా, జున్నర్‌ వంటి ప్రాంతాల్లో స్టే చేస్తూ ట్రావెల్‌ను స్లోగా ఎంజాయ్‌ చేయవచ్చు. 
నగరాల్లోని హోటళ్ల నుంచి సాధారణ వసతి గహాల వరకు వివిధ రకాల వసతి సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి.

కోట ప్రాంతాలకు సమీపంలో ఉండే చిన్న చిన్న క్యాంపుల్లో రాత్రి వేళ సహ్యాద్రి నిశ్శబ్దాన్ని ఆస్వాదించడం ఈ ట్రిప్‌లో మరో హైలైట్‌.

ఏం తినాలి ?
మహారాష్ట్ర రుచులనను ఆస్వాదించడం కూడా యాత్రలో భాగంగా భావించాలి. మరీ ముఖ్యంగా పుణె, సతారా ్ర΄ాంతాల్లో ΄ోహా, మిసల్‌ పావ్, భాక్రీ, పిఠ్లా వంటి స్థానిక రుచులు ఆస్వాదించవచ్చు. మనం చుడ్వా అని పిలచుకునే చివ్దా, వడాపావ్, బ్రెడ్‌ పకోడా వంటిమి మీకు ప్రతీ చోట లభిస్తాయి. అలాగే కోట ప్రాంతాల్లో లభించే నార్మల్‌ మరాఠీ థాలి ట్రై చేయవచ్చు.

ఆసక్తికరమైన విషయాలు
శివనేరి ఛత్రపతి శివాజీ మహారాజ్‌ జన్మస్థలంగా ప్రసిద్ధి చెందింది.

తోరణను ప్రచండగఢ్‌ అనే పేరుతో కూడా పిలుస్తారు.

1659లో అఫ్జల్‌ ఖాన్‌తో జరిగిన యుద్ధంతో ప్రతాపగఢ్‌ చరిత్రలో నిలిచిపోయింది.

సింహగఢ్‌ పాత పేరు కొంధాణా. తానాజీ మలుసరే వీరగాథను నేటికీ చాలా మంది 
గుర్తు చేస్తుంటారు.

1674లో రాయగఢ్‌లో శివాజీ మహారాజ్‌ పట్టాభిషేకం జరిగింది.

ఏం చూడాలి
శివనేరి కోట ప్రాంగణంలో చరిత్రను గుర్తుచేసుకుంటూ వాక్‌ చేయడం, తోరణలో సహ్యాద్రి అందాలను చూడటం, ప్రతాపగఢ్‌లో యుద్ధగాథలను తెలుసుకోవడం,  సింహగఢ్‌లో తానాజీ మలుసరే వీరగాథను గుర్తుచేసుకోవడం, రాయగఢ్‌లో పట్టాభిషేకం జరిగినప్రాంతం వైబ్‌ను ఫీల్‌ అవ్వడం.. ఈ ఐదు అనుభవాలు కలిసి ట్రిప్‌ను ఒక కంప్లీట్‌ మెమోరీగా మార్చేస్తాయి.

ఎలా వెళ్లాలి

హైదరాబాద్‌ నుంచి సహ్యాద్రి ్ర΄ాంతానికి వెళ్లాలి అనుకుంటే ముందు పుణే చేరుకుంటే బెటర్‌. దీని కోసం రైలు లేదా ఫ్లైట్‌లో మీకు వీలైన దాన్ని ఎంచుకోవచ్చు. నిజానికి ఈ జర్నీని చాలా మంది రైల్లోనే ఎంజాయ్‌ చేస్తారు. 

పుణె చుట్టుపక్కల ఉన్న కోటలను ముందుగా చూసి, ఆ తర్వాత రాయగఢ్, ప్రతాపగఢ్, శివనేరి, తోరణ వైపు బయల్దేరవచ్చు.

నగర ప్రాంతాలను దాటి సహ్యాద్రి కొండల మధ్యకు ప్రవేశించే కొద్దీ సిటీ స్ట్రెస్‌ జోన్‌ నుంచి బయటికి వచ్చిన అనుభూతి కలుగుతుంది. విజయవాడ నుంచి వచ్చే వారు హైదరాబాద్‌ మీదుగా ప్రయాణాన్ని కొనసాగించవచ్చు.

యాత్ర, బడ్జెట్‌ వివరాలు
హైదరాబాద్‌ నుంచి ఐదు రోజుల ఈ చారిత్రక యాత్ర బడ్జెట్‌ అనేది ప్రయాణికుల లైఫ్‌స్టైల్‌ను బట్టి మారుతుంది. యావరేజ్‌గా కనీసం రూ.15,000–20,000 వరకు ప్రతీ వ్యక్తికి ఖర్చు అవుతుంది. ఇక ప్రీమియం ట్రావెల్‌ ఎక్స్‌పీరియెన్స్‌ కోసం రూ.35 వేల నుంచి రూ.50 వేల వరకు ఖర్చు చేయాలి. అయితే ఈ ఖర్చులు మీరు ఎలా ట్రావెల్‌ చేస్తారు, ఎక్కడ ఉంటారు, ఏం తింటారు, యాక్టివిటీస్‌ను బట్టి మారుతాయి.

ఇక హోటల్‌ లేదా లాడ్జి ఖర్చు విషయానికి వస్తే స్టే కోసం పర్‌ నైట్‌ వచ్చేసి రూ.1,000 నుంచి రూ.2,500 వరకు బడ్జెట్‌ అవ్వొచ్చు. ఫుడ్‌ కోసం రోజుకు సుమారు రూ.500–1,000 వరకు కేటాయించవచ్చు. ఇలాంటి ట్రిప్‌లో తక్కువ ధరకు దొరికే రూమ్స్‌ కన్నా అన్ని సదుపాయాలు, సెక్యూరిటీ ఉన్న హోటల్స్‌నే ఎంచుకోవడం ఉత్తమం.

గమనిక: ఇక్కడ ఇచ్చిన ట్రావెల్, బడ్జెట్‌ వివరాలు మీ అవగాహన కోసం మాత్రమే. దయచేసి ప్రయాణానికి ముందు లేటెస్ట్‌ వివరాలను సొంతంగా రీసెర్చ్‌ చేసుకుని ప్లాన్‌ చేసుకోండి.  

ఎం జి కిశోర్‌ ప్రయాణికుడు

(చదవండి: మేనకోడలు చిరుకోరికను తీర్చడం కోసం ఆ మామ ఏం చేశాడంటే..!)

Videos

కేటీఆర్, హరీష్ రావు అరెస్ట్..!

విజయవాడ పోలీస్ స్టేషన్ లో యూట్యూబర్ నందన

కేసీఆర్ ఫాంహౌస్ వద్ద 144 సెక్షన

మహికాతో బ్రేక్ అప్? అమీషా పటేల్ తో హార్దిక్ డేటింగ్!

సంజుని దారుణంగా అవమానించిన శ్రీశాంత్ ఏకంగా స్టేజ్ పైనే..

AP స్పోర్ట్స్ కోటా స్కామ్ లో కూన రవి

అసెంబ్లీలో PS రాజుకు గుండెపోటు.. CPR చేసిన మంత్రి శ్రీహరి

ఎందుకంత ఆవేశం.. నీ తల్లిననలేదు.. హరీష్ రావు పై స్పీకర్ ఆగ్రహం ..

Super Elnino: వెడ్డెక్కుతున్న పసిఫిక్ మహాసముద్రం...భారత్ కు ముప్పేనా?

FIRST WEEKలో నామినేట్ అయ్యింది వీళ్లే?

Photos

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)