సాక్షి ఇన్వెస్టిగేషన్ లో సంచలన విషయాలు.. DSC అక్రమాలపై తిరుగులేని సాక్ష్యాలు
Breaking News
గడ్డం ఉంటే గమ్మత్తే! అస్సలు తగ్గేదేలే!!
Published on Sun, 09/06/2026 - 10:33
షేవింగ్ మర్చిపోవడం వల్ల పెరిగిన గడ్డం... ఇప్పుడు మెన్స్ ఫ్యాషన్‌లో ఫుల్‌టైమ్ హీరో! అందుకే, గడ్డాన్ని అడవిలా అడ్డదిడ్డంగా కాకుండా, అదిరిపోయేలా ఎలా పెంచాలి? ఎలాంటి ముఖానికి ఏ స్టయిల్ సెట్ అవుతుంది? ఎలా మ్యానేజ్ చేయాలి? వంటి విషయాలన్నీ సెప్టెంబర్ 7 ‘వరల్డ్ బియర్డ్ డే’ సందర్భంగా, కొన్ని సూపర్ బియర్డ్ ఫ్యాషన్ టిప్స్ మీకోసం!
ముఖానికి తగ్గ గడ్డం!
అభిమాన హీరోకి ఫుల్ బియర్డ్ బాగుందని మీరూ అలాగే పెంచేస్తే, మీ అద్దమే మిమ్మల్ని చూసి నవ్వే అవకాశం ఉంది. గుండ్రటి ముఖం ఉంటే కాస్త పొడవుగా కనిపించేలా గడ్డాన్ని షేప్ చేయండి. పొడవాటి ముఖం ఉంటే సైడ్స్‌లో కాస్త ఫుల్‌గా ఉంచవచ్చు. స్క్వేర్ ఫేస్‌కు షార్ట్ బాక్స్ బియర్డ్ లేదా స్టబుల్ బాగా సెట్ అవుతుంది.
మీసం కూడా గడ్డం టీమ్‌లోనే!
గడ్డాన్ని బాగా సెట్ చేసి... మీసాన్ని మాత్రం దేవుడి దయకు వదిలేయొద్దు! మీసం కూడా బియర్డ్ క్లాస్మేటే! షార్ట్ బియర్డ్‌కు నీట్ మీసం, ఫుల్ బియర్డ్‌కు కాస్త ఫుల్‌గా ఉండే మీసం బాగుంటుంది. గుర్తుంచుకోండి.. మీ మీసం నోట్లోకి వచ్చి టీ తాగేటప్పుడు టేస్ట్ చూస్తోందంటే, ట్రిమ్మింగ్ టైమ్ వచ్చిందన్న మాట!
చిన్నదే కానీ చురుకుదనం ఎక్కువ!
పూర్తి గడ్డం పెంచాలని లేదనుకుంటే, స్టబుల్ స్టయిల్ బెస్ట్. రెండు మూడు రోజుల గడ్డంలా కనిపించే ఈ లుక్ చాలా క్యాజువల్‌గా ఉంటుంది. అయితే దీనికీ కేర్ అవసరం! మెడ చుట్టూ, చెంపల దగ్గర అలా పెరగనిస్తే స్టయిలిష్ స్టబుల్ కాస్తా పాపం షేవింగ్‌కి డబ్బులు లేవు అనిపించుకోవచ్చు! అందుకే, ఎడ్జెస్ను ఎప్పుడూ నీట్‌గా ఉంచండి.
ఫుల్ బియర్డ్... ఫుల్ బాధ్యత!
గడ్డం పెంచడం అంటే, ముఖం మీద వెంట్రుకలకు ఫ్రీడమ్ ఇవ్వడం కాదు! దాన్ని మెయింటైన్ చేయడమే అసలు పరీక్ష! క్రమం తప్పకుండా ట్రిమ్ చేయండి. గడ్డం వెంట్రుకలు అటూ ఇటూ ఎగరకుండా దువ్వండి. అవసరమైతే బియర్డ్ ఆయిల్ లేదా బామ్ వాడి నీట్‌గా సెట్ చేసుకోండి.
కాంబో ముఖ్యం!
తల మీద ఒక సినిమా, గడ్డం మీద ఇంకో సినిమా వద్దు! హెయిర్‌కట్‌ను కూడా బియర్డ్ స్టయిల్‌కి తగ్గట్టుగా ఎంచుకోవడం మంచిది. షార్ట్ హెయిర్‌తో షార్ట్, మీడియం బియర్డ్, కొంచెం లాంగ్ హెయిర్‌తో ఫుల్ బియర్డ్ వంటి కాంబినేషన్లు బాగుంటాయి.
నెక్లైన్ మర్చిపోతే... గేమ్ ఓవర్!
చాలామంది గడ్డం ముందు భాగాన్ని మాత్రమే ట్రిమ్ చేసి, మెడ కింద పెరిగే వెంట్రుకలను అలాగే వదిలేస్తారు. అప్పుడు ఎంత మంచి బియర్డ్ స్టయిల్ అయినా నీట్‌గా కనిపించదు. కాబట్టి నెక్లైన్ ను క్రమం తప్పకుండా షేప్‌లో ఉంచండి.
కలర్స్ ప్లే!
గడ్డంలో కాస్త బ్రౌన్ , గ్రే లేదా సాల్ట్ అండ్ పెప్పర్ షేడ్స్ కనిపిస్తున్నాయా? వాటిని వెంటనే దాచేయాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా గ్రే బియర్డ్‌ను చక్కగా ట్రిమ్ చేసి, హెయిర్‌తో మ్యాచ్ చేస్తే చాలా క్లాసీ లుక్ వస్తుంది.
బట్టలకు బియర్డ్‌తో సంబంధం ఉంది!
బియర్డ్ ఉన్నవాళ్లు సింపుల్ టీషర్ట్, డెనిమ్, షర్ట్, కుర్తా... ఏదైనా క్యారీ చేయొచ్చు. నీట్‌గా ట్రిమ్ చేసిన బియర్డ్‌తో ఫార్మల్ షర్ట్ క్లాసీగా కనిపిస్తుంది. ఫుల్ బియర్డ్‌తో డెనిమ్ జాకెట్ లేదా కుర్తా కాస్త బోల్డ్ లుక్ ఇస్తుంది.
కడగండి... పెంచొద్దు!
ఇది చాలా ముఖ్యం! గడ్డం అంటే కేవలం పెంచుకోవడం కాదు, శుభ్రంగా ఉంచుకోవడం కూడా! తిన్నది, తాగింది, దుమ్ము అన్నీ గడ్డంలో డెస్ట్ బిన్ కలెక్షన్ లా అవ్వకముందే క్లీన్ చేసుకోండి!
ఇవి కూడా చదవండి: తలగడలోని డస్ట్‌మైట్స్‌తో అలర్జీలు!
Tags : 1