Breaking News

మీ మెదడుకు బాస్‌ మీరే అనుకుంటున్నారా? నిజాలు తెలిస్తే షాకే!

Published on Sat, 09/05/2026 - 08:06

మీరు మీ మెదడుకు బాస్‌ అనుకుంటున్నారా? ΄÷ర΄ాటే! మీరు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మీకు తెలియకుండానే మీ మెదడు బోలెడన్ని పనులు చేసేస్తుంటుంది. మీరు ‘‘నేను ఆలోచించి చేశాను’’ అనుకుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో అసలు ఆలోచించింది మీరు కానే కాదు మీ మెదడే!

మన కళ్ల ముందు కనిపించేది, మనం గుర్తుంచుకునేది, మనకు నచ్చేది, భయపడేది..ఇలా చాలా విషయాల్లో మెదడు తనదైన గేమ్‌ ఆడుతుంది. అందులో కొన్ని సరదాగా ఉంటే.. మరికొన్ని ‘‘అరే! ఇలానా?’’ అనిపిస్తాయి. ఇంకా మనకు తెలియకుండా మన మెదడు చేసే పనులేంటో చూసేద్దామా?

1. మల్టీటాస్కింగ్‌
మీరు ఫోన్‌ లో మెసేజ్‌ టైప్‌ చేస్తూనే టీవీ చూస్తూ, పక్కన ఎవరో మాట్లాడుతుంటే సమాధానం ఇస్తున్నారా? అది మీ గొప్పేం కాదు. ‘నా మల్టీటాస్కింగ్‌ సూపర్‌’ అని ఫీలవ్వకండి. చాలా సందర్భాల్లో  రెండు క్లిష్టమైన పనులను ఒకేసారి చేయడం మెదడుకి వెన్నతో పెట్టిన విద్య.

2. కనిపించని విషయాలను ఊహిస్తూ..
మన కళ్లకు ప్రపంచం మొత్తం స్పష్టంగా కనిపిస్తుందని అనుకుంటాం. నిజానికి మన దృష్టిలో చిన్న ప్రాంతం కూడా స్పష్టంగా కనిపించదు. దానిని మెదడు చుట్టుపక్కల సమాచారంతో అంచనా వేసి నింపేస్తుంది. దీనినే ఇమేజ్‌గ్రాస్పింగ్‌లో మెదడు చేసే ‘‘ఫిల్లింగ్‌–ఇన్‌’’గా భావిస్తారు.

3. జ్ఞాపకాలను నిర్మిస్తుంది!
‘‘ఆ రోజు జరిగిన ప్రతి విషయం నాకు అచ్చంగా గుర్తుంది’’ అని చెప్పేవాళ్లను కాస్త అనుమానంతో చూడొచ్చు. మన జ్ఞాపకాలు సాధారణంగా వీడియో రికార్డింగ్‌లా స్టోర్‌ అవ్వవు/. గుర్తు చేసుకునే సమయంలో మెదడు అందుబాటులో ఉన్న సమాచారంతో ఆ సంఘటనను మళ్లీ సృష్టిస్తుంది.

4. కాలింగ్‌..కాలింగ్‌
ఒక ΄ార్టీకి వెళ్లారు. చుట్టూ పెద్ద శబ్దం. అందరూ మాట్లాడుతున్నారు. ఒక్కసారిగా ఎవరో మీ పేరు పిలిచారు. వెంటనే మీ చెవులు అటువైపు తిరుగుతాయి. దీనిని సాధారణంగా‘ కాక్‌టెయిల్‌ ΄ార్టీ ఎఫెక్ట్‌’ అంటారు. 

5. బోర్‌ కొట్టినా...
మీరు ఏ పని చేయకుండా కూర్చున్నారు. బయటకు చూస్తున్నారు. కానీ మెదడు మాత్రం షిఫ్ట్‌ ముగించదు. మనం విశ్రాంతిగా ఉన్నప్పుడు కూడా మెదడులోని కొన్ని నెట్‌వర్క్‌లు చురుకుగా ఉంటాయి. 

6. భయపెడుతుంది!
రాత్రి ఒంటరిగా గదిలో కూర్చున్నారు. చిన్న శబ్దం వచ్చింది. వెంటనే గుండె వేగం పెరుగుతుంది. ‘‘ఎవరు?’’ అని చూస్తే.. కిటికీకి తగిలిన కొమ్మ! మెదడు ప్రమాదాన్ని గుర్తించే విషయంలో జాగ్రత్తగా ఉండటానికి ప్రయత్నిస్తుంది. 

7. ముందే అర్థం చేసుకుంటుంది!
మన కళ్లకు వచ్చే సమాచారాన్ని మెదడు కేవలం రిసీవ్‌ చేయదు. గత అనుభవాలు, సందర్భం, అంచనాలను కూడా ఉపయోగించి మనం ఏం చూస్తున్నామో అర్థం చేసుకుంటుంది. ఒకే చిత్రం లేదా ఒకే వాక్యాన్ని ఇద్దరు వ్యక్తులు కొంచెం భిన్నంగా అర్థం చేసుకునే అవకాశం ఎక్కువ.

8. అలవాట్లకు ఆటోపైలట్‌
రోజూ ఒకే మార్గంలో ఆఫీసుకు వెళ్లే వ్యక్తికి మధ్యలో ఎన్నో విషయాలు గుర్తుండక΄ోవచ్చు. ఎందుకంటే పదేపదే చేసే పనుల్లో కొన్నింటిని మెదడు అలవాటుగా మార్చుకుంటుంది. దాంతో ప్రతి చిన్న చర్యను మొదటి రోజు లాగా జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉండదు.

9.  ఫోర్‌కాస్ట్‌
‘‘రేపు ఇలా చేస్తే ఎలా ఉంటుంది?’’ అని ఊహించేటప్పుడు మెదడు ఖాళీ తెరపై సినిమా తీయదు. గత అనుభవాలు, జ్ఞాపకాలు, తెలిసిన సమాచారాన్ని ఉపయోగించి ఊహించడంలో సహాయపడుతుంది.

10. మీకంటే ముందే నిర్ణయం
ఒక విషయం గురించి మనం ‘‘నేను ఆలోచించి నిర్ణయం తీసుకున్నాను’’ అనుకుంటాం. కానీ నిర్ణయ ప్రక్రియలో మనకు పూర్తిగా స్పష్టంగా తెలియనివి అనేకం పనిచేస్తుంటాయి. మన మెదడు మనకు కనిపించకుండా పనిచేసే ఒక భారీ నియంత్రణ కేంద్రం. మనం చూస్తున్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం నుంచి జ్ఞాపకాలు, దృష్టి, భయం, అలవాట్లు, నిర్ణయాల వరకు.. ప్రతిచోటా దాని ΄ాత్ర ఉంటుంది. మరి మెదడు ఇంత పని చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ‘అదొక అర్థం కాని ప్రశ్నలా ఉందే’ అని మళ్లీ మన మెదడే సర్దిచెప్పుకుంటుంది.
- శ్రావణ్‌ జయ

ఇవి కూడా చదవండి: మన దేహం విలువ కోట్లకంటే ఎక్కువ.. ఈ కథతో అర్థమవుతుంది!

Videos

DSCలో బయటపడ్డ దొంగ సర్టిఫికెట్లు.. జైలా? రాజీనామానా?

గోదావరిలోకి దూకిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు

అగ్ని పరీక్షలో గెలిచి హౌస్ లోకి వెళ్లేది ఎవరంటే?

CBI ఎంక్వైరీ వేయండి... నీకు మంత్రిగా ఉండే అర్హత లేదు రాజీనామా చేయ్

సాక్షి అకౌంట్ల బ్లాక్ పై సీనియర్ జర్నలిస్టులు సీరియస్

ప్రభుత్వమే ఇబ్బంది పెడితే ఎవరికి చెప్పుకోవాలి సాఫ్ట్ వేర్ ఉద్యోగుల గగ్గోలు

తమ్ముడి సర్టిఫికెట్లు పెట్టిన అన్నకు టీచర్ ఉద్యోగం.. నిజం ఒప్పుకున్న పెద అప్పల్రాజు

బయటపడ్డ లోకేష్ DSC అక్రమాల పుట్ట బాబు వెన్నులో వణుకు...

వైభవ్ పై BCCI ప్రత్యేక నిఘా

ఎవరు మంత్రి కావాలి..? ఎవరి మాట వినాలి?

Photos

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!