మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!
Breaking News
జానీ మాస్టర్ సతీమణి సుమలతపై ఫిర్యాదు
Published on Fri, 09/04/2026 - 19:31
సుమలత ఆరోపణలపై రఘు మాస్టర్ కౌంటరిచ్చారు. సుమలత పోలీసులను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ రఘు మాస్టర్ ఫిర్యాదు చేశారు. తమ కార్యవర్గాన్ని ఫెడరేషన్ గుర్తించిందని రఘు మాస్టర్ స్పష్టం చేశారు. ఫెడరేషన్ గుర్తింపు లేఖతోనే బ్యాంకును ఆశ్రయించామని వెల్లడించారు. మేం ఇచ్చిన లేఖ ఆధారంగానే బ్యాంకు అనుమతించిందని రఘు మాస్టర్ తెలిపారు.
సుమలత ప్యానెల్‌ను ఫెడరేషన్ గుర్తించలేదని రఘు మాస్టర్ ఆరోపించారు. సుమలత వ్యవహారంతో డాన్సర్స్ అసోసియేషన్ పరువు పోతోందని వ్యాఖ్యానించారు. అసోసియేషన్‌లో వివాదాలను సుమలత మరింత పెంచుతున్నారని రఘు మాస్టర్ విమర్శించారు. త్వరలో డాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్ష బాధ్యతలు చేపడతానని రఘు మాస్టర్ ప్రకటించారు. కాగా.. అంతకుముందు రఘు మాస్టర్ ప్యానెల్‌పై సుమలత ఫిర్యాదు చేసింది. బ్యాంకుకు ఫోర్జరీ డాక్యుమెంట్లు ఇచ్చారంటూ సుమలత ఆరోపించింది.
Tags : 1