తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి
Breaking News
బాహుబలికి ముందు ప్రభాస్ గురించి వాళ్లకి తెలియదు: ఆర్జీవీ షాకింగ్ ట్వీట్
Published on Thu, 09/03/2026 - 17:52
అల్లు అరవింద్- యశ్ వివాదంపై సంచలన డైరెక్టర్ ఆర్జీవీ స్పందించారు. గతంలో అల్లు అరవింద్ మాట్లాడిన మాటలను ఇప్పుడు వివాదం చేస్తున్నారని అన్నారు. ఎక్కడా కూడా యశ్‌ను ఆయన విమర్శించేదని తెలిపారు. కేజీఎఫ్ తర్వాత యశ్ రేంజ్ మారిపోయిందని మాత్రమే చెప్పారని గుర్తు చేశారు. అది కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక శుక్రవారంతో కెరీర్ మారిపోతుందనే అర్దంలొ అదే విషయాన్ని కేజీఎఫ్ హీరో యశ్ కూడా చెప్పారని అన్నారు. ఈ విషయంలో యశ్ మదర్ తెలియక మాట్లాడి ఉంటారని రాం గోపాల్ వర్మ తన ట్వీట్‌లో ప్రస్తావించారు. ఇలా గతంలో మాట్లాడిన పాత వీడియోలను పట్టుకుని మనం మాట్లాడడం సరైంది కాదన్నారు.
బాహుబలికి ముందు హిందీ ప్రేక్షకులకు ప్రభాస్ గురించి తెలియదు.. అలాగే కాంతారాకు ముందు రిషబ్ గురించి ఎవరికీ తెలియదు.. గాడ్ ఫాదర్‌కు ముందు బ్రాండో గురించి నాకు తెలియదు.. బహుశా 'ఎ స్ట్రీట్ కార్ నేమ్డ్ డిజైర్', 'ఆన్ ది వాటర్ ఫ్రంట్' వంటి సినిమాలతో అతను అంతకు ముందే స్టార్ అయ్యి ఉండవచ్చని అన్నారు.. అవి భారతదేశంలో కూడా విడుదలయ్యాయో లేదో నాకు తెలియదు.. ఎందుకంటే ఆ సినిమాలే వారిని పెద్ద స్టార్లుగా చేశాయని రాసుకొచ్చారు. అంతేగాని వారు స్టార్లు కాదు.. హాలీవుడ్ ఎప్పుడూ కాన్సెప్ట్ సినిమాలపైనే ఎక్కువగా ఖర్చు చేస్తుంది.. కానీ స్టార్లపై కాదు.. నోలన్ వంటి దర్శకులు కూడా నటులను వారి నటన ప్రతిభ కోసమే వాడుకుంటారు తప్ప వారి స్టార్‌డమ్‌పై ఆధారపడరు.. అది ఓపెన్‌హైమర్ సినిమా అయినా, ఒడిస్సీ అయినా, అందులో ఎవరున్నా అవి అంతే విజయం సాధిస్తాయని మనందరికీ తెలుసు కదా అన్నారు
ఇక విషయానికి వస్తే అల్లు అరవింద్ విషయానికి వస్తే.. అత్యంత సాధారణమైన, మంచి ఉద్దేశంతో కూడిన ఆలోచనను ఆయన అన్న మాటను వ్యక్తిగతంగా తీసుకోవడం అంటే కేవలం విపరీతమైన అహంకారం ఉన్నవారేనని ప్రస్తావించారు.. నిజానికి.. ఇలాంటి ప్రతిచర్యే వారు అలాంటివి ఎందుకు చేస్తున్నారో కూడా వివరిస్తుందని అన్నారు. కాగా.. 2023లో కోటబొమ్మాలి ఈవెంట్‌లో అల్లు అరవింద్ మాట్లాడిన విడియో క్లిప్‌పై యశ్ మదర్ కామెంట్స్ చేయడమే ఈ వివాదానికి కారణమైంది.
The controversy regarding #AlluAravind ‘s statement regarding #Yash is ridiculously laughable because what he clearly meant when he talked about big films with unknown actors and saying he dint know of Yash before KGF , even a dumbo should understand that it was in context of the…
— Ram Gopal Varma (@RGVzoomin) September 1, 2026
Tags : 1