Breaking News

టాక్సిక్ డిజాస్టర్.. ఇంగ్లీష్ వర్షన్‌లో భారీ కట్స్..!

Published on Thu, 09/03/2026 - 15:37

యశ్‌ హీరోగా వచ్చిన లేటేస్ట్ మూవీ టాక్సిక్. ఇటీవలే థియేటర్లలో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. తొలిరోజే నెగెటివ్ టాక్ అందుకున్న ఈ సినిమా.. వసూళ్లపరంగా ఘోరంగా విఫలమైంది. భారీ బడ్జెట్ చిత్రంపై పెట్టుకున్న అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది. ఈ మూవీకి గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహించారు.

ఇండియాలో డిజాస్టర్‌గా నిలిచిన ఈ మూవీ.. హాలీవుడ్‌లో రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ చిత్రం ఇంగ్లీష్ వర్షన్ సెప్టెంబర్ 4న విడుదల కానుంది. ఈ వర్షన్ రన్‌టైమ్‌లో 2 గంటల 57 నిమిషాలు ఉండనుందని.. ఒరిజనల్‌ వర్షన్ కంటే 17 నిమిషాలు తక్కువ ఉంటుందని చిత్ర నిర్మాతలు ప్రకటించారు. ఈ ఆంగ్ల వర్షన్ విదేశాల్లో ఆగస్టు 26న విడుదలైంది. ఈ మూవీ ఇంగ్లీష్ వర్షన్ ఇండియాలో సెప్టెంబర్ 4న థియేటర్లలో విడుదల కానుంది.

అయితే ఈ మూవీలోని ఏ సీన్స్ తొలగించారన్న విషయంపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ విషయంలో నిర్మాతలు ఎలాంటి క్లారిఫికేషన్ ఇవ్వలేదు. తబాహి, మధోశ్ లాంటి పాటలు తొలగించి ఉంటారని కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి. అయితే ఈ పాటలను తొలగించారనే వార్తలపై ఎటువంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. థియేటర్లో చూస్తేనే కానీ ఏయే సీన్స్ తొలగించారో ఓ క్లారిటీ రానుంది. కాగా.. ఈ చిత్రంలో నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ కీలక పాత్రల్లో నటించారు. 

 

Videos

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

వీడిన ఉత్కంఠ...! సీఎం రేవంత్ సంచలన నిర్ణయం

కాంగ్రెస్ పార్టీ వీడనున్న కొండా దంపతులు...?

AP: ఇద్దరి IPS ల సస్పెన్షన్ ఎత్తివేత

కొండా సురేఖపై వేటు..

గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమంలో కేతిరెడ్డి

రాజీనామానా..? బర్తరఫ్ నా..? క్లైమాక్స్ కు కొండా సురేఖ ఎపిసోడ్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)