మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్
Breaking News
మీనాక్షి దేవతను తలపించేలా నికితా పోర్వాల్ అద్భుత నృత్యం..!
Published on Thu, 09/03/2026 - 11:35
ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2024 విజేత అయిన నికితా పోర్వాల్ వియత్నాంలో జరుగుతున్న మిస్ వరల్డ్ 2026లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉజ్జయినీకి చెందిన ఈ నటి డాన్సెస్ ఆఫ్ ది వరల్డ్' రౌండ్‌లో భాగంగా వేదికపై అద్భుతమైన నృత్య ప్రదర్శన ఇచ్చారామె. గతరాత్రికి సంబంధించిన క్లిప్‌ను పంచుకుంటూ మిస్ ఇండియా ఆర్గనైజేషన్ ఇలా రాసుకొచ్చింది.
73వ మిస్ వరల్డ్ వేడుకల్లో భాగంగా నిర్వహించి డాన్సెస్ ఆఫ్ ది వరల్డ్ రౌండ్‌లో భాగంగా నికితా పోర్వాల్ తన అద్భుతమైన నృత్యంతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుందామె అని రాసుకొచ్చింది మిస్ ఇండియా ఆర్గనైజేషన్. అంతేగాదు నెటిజన్లు సైతం..నికితా కనిపించింది కొన్ని సెకన్లపాటు మాత్రమే అయినా..చూస్తుండిపోవాలనిపించింది.
అత్యద్భుతంగా ఉంది అని ప్రశంసల వర్షం కురిపిస్తూ పోస్టులు పెట్టారు. మరికొందరూ నువ్వు దేశానికి గర్వకారణంగా నిలిచావు. ప్రతి కన్నూ నీపైనే ఉంది, ప్రతి కెమెరా నిన్ను ప్రేమిస్తుంది, యావత్తు భారతదేశం నీతో ఉంది. నువ్వు వేదికపై అద్భుతమైన దేవతలా ఒదిగిపోయావు అని అభివర్ణిస్తూ పోస్టులు పెట్టారు.
దేవి స్ఫూర్తిని ఆవిష్కరించారామె..
మిస్ వరల్డ్ 2026లో 'డ్యాన్సెస్ ఆఫ్ ది వరల్డ్' రౌండ్ కోసం, నికితా పోర్వాల్ తోరాని బ్రాండ్ రూపొందించిన ప్రత్యేకమైన దుస్తులను ఎంచుకున్నారు. రంగులు,కళ, దేవి స్ఫూర్తిని తెలియజేసే భారతీయ వేడుకను ప్రతిబింబించారు. ఆమె దుస్తులు రంగుల దేవత మీనాక్షి స్ఫూర్తితో రూపొందించిన దుస్తులను నికితా ఎంపిక చేసుకున్నారు. ఈ దుస్తుల్లో ఆమె లుక్ అత్యంత ముగ్ధమనోహరంగా ఉంది.
విభిన్నమైన ఆ రంగుల కలయిక, క్లిష్టమైన ఎంబ్రాయిడరీ, చేతితో వేసిన పేయింటింగ్‌లు ఉన్నాయి. ఇది ధోతి శైలి సిల్హౌట్. ఈ దుస్తలుకు అనుగుణంగా తలపై ధరించి దుప్పటా, చెవిపోగులు, అమామా జ్యువెలరీ రూపొందించిన శరీరాభరణాలు తదితరాలన్ని రాజసం ఉట్టిపడే లుక్‌ని అందించాయి. సంప్రదాయినిక ఆధ్యునిక వ్యాఖ్యానంలా దేవతను తలపించేలా ఉంది ఆమె ఆహార్యం. ఈ దుస్తుల్లో ప్రతి అంశ ఒక కథను చెబుతుందని, అది తనకెంతో నచ్చిందని అంటోంది నికితా.
రంగు, అలంకరణ, కదలిక, కళాత్మకత, ఇవన్నీ శక్తిమంతమైన దేవతా రూప ఆవిష్కరణకు దారితీసిందని అన్నారామె. ప్రతి ఒక్కటి తన రూపానికి సుందరమైన జీవం పోశాయిని చెబుతోంది. కాగా సెప్టెంబర్ 5న ఘనంగా మిస్ వరల్డ్ ఫినాలే జరగనుంది. ఎవరు కిరీటం దక్కించుకుంటారన్న దానిపైనే సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.
(చదవండి: Miss World 2026: సర్వాంగ సుందరీ మాత్రమేకాదు..అద్భుతమైన నటి..! మిస్ ఇండియా సైతం..)
Tags : 1