కెప్టెన్‌ ఆన్‌ డ్యూటీ...

Published on Wed, 09/02/2026 - 03:42

కనుచూపుమేర భీకర దృశ్యాలు... బాధితుల ఆర్తనాదాలు... బురద ప్రవాహంలో కొట్టుకుపోతున్న గ్రామాలు... భయంకరంగా విరిగి పడుతున్న కొండచరియలు... ఎటు చూసినా కల్లోలమే! ఇటువంటి అత్యంత ప్రతికూల పరిస్థితుల్లోనూ తనప్రాణాలను సైతం పణంగా పెట్టి సహాయక చర్యలు చేపట్టారు నేపాల్‌ తొలి మహిళా హెలికాప్టర్‌ కెప్టెన్‌ ప్రియా అధికారి. కేవలం ఆరు రోజుల వ్యవధిలోనే 100 రెస్క్యూ మిషన్లు పూర్తి చేసి, వందలాది మంది బాధితులను సురక్షితప్రాంతాలకు చేర్చి ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారు. ఈ రెస్క్యూ మిషన్‌లో తన అనుభవాల గురించి ఆమె మాటల్లోనే...

2015లో నేపాల్‌లో వచ్చిన భూకంపం కంటే భయంకరమైనది ఈ విపత్తు. నేను గగనతలం నుంచి చూసిన దృశ్యాలు వర్ణనాతీతం. ఎక్కడ చూసినా చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలు కలవరపరిచాయి. జలవిద్యుత్‌ప్రాజెక్టులు, ఇళ్లు, రోడ్లు.. ఒక్కటేమిటి సమస్తం కొట్టుకు పోయాయి. 2015లో వచ్చిన భారీ భూకంపం కంటే కూడా ఈ వరదల తీవ్రత చాలా ఎక్కువ. ముఖ్యంగా ఈ విపత్తులో రసువా జిల్లాలోని తిమురే అనే గ్రామం పూర్తిగా దెబ్బతింది. అక్కడి నుంచి బాధితులను సురక్షితప్రాంతాలకు తరలించడం మాకు అతిపెద్ద సవాలుగా మారింది.

ఆపని ఇంజిన్లు
ఈ రెస్క్యూలో రాత్రింబవళ్లు సుమారుగా 20 హెలికాప్టర్లు పనిచేస్తున్నాయి. ఒకే ల్యాండింగ్‌ పాయింట్‌కు ఒకేసారి అనేక హెలికాప్టర్లు రావడం వల్ల ఆపరేషన్   నిర్వహణ మాకు అత్యంత కష్టంగా మారింది. అలా ఇబ్బంది వచ్చినపుడు మేము వైర్‌లెస్‌ సాధనాల ద్వారా సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాము. మరోవైపు నేలపై మోకాలు లోతున ఉన్న చిక్కటి బురద కారణంగా హెలికాప్టర్‌లను నిలపడం మాకు కష్టంగా మారింది. దాంతో ఇంజిన్లను ఆపకుండానే క్షణాల వ్యవధిలో బాధితులను ఎక్కించుకుని సురక్షితప్రాంతాలకు చేర్చాము. ఆర్మీ ఆగస్టా హెలికాప్టర్లతో కలిపి తిమురే గ్రామం నుంచే మొదటి రెండు రోజుల్లో 200 మందికి పైగా బాధితులను రక్షించాం. ఇప్పటికీ అక్కడ చాలామంది ఆచూకీ తెలియడం లేదు. 

అలసట మాయం
నాకు సుదీర్ఘ కాలంగా పర్వతప్రాంతాలలో విమానాలు నడిపిన అనుభవం ఉంది. అయినప్పటికీ ఈ భీకర విపత్తు తీవ్రత నాకు సవాల్‌గా నిలిచింది. వరుసగా విమానాలు నడపడం వల్ల మేమంతా తీవ్ర అలసటకు గురయ్యాము, కానీ నేలపై ఆశగా చేతులు ఊపుతున్న బాధితులను చూసినప్పుడు ఆ అలసట అంతా మాయమయ్యేది. వారిని రక్షించడమే మానసికంగా నాకెంతో బలం చేకూర్చింది. వరదల్లో చిక్కుకుని, కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరినీ తనవారిగా భావించి రక్షించిన ప్రియా అధికారి సాహసంపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది.                  

ఎయిర్‌ హోస్టెస్‌ టు ఎవరెస్ట్‌ పైలట్‌
40 ఏళ్ల ప్రియా అధికారి ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం. ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌లో పట్టా పొందిన ఆమె, మొదట్లో ఎయిర్‌ హోస్టెస్‌గా తన కెరీర్‌ప్రారంభించారు. కానీ విమాన యానంపై కలిగిన ఆసక్తితో ఫిలిప్పీన్  ్స వెళ్లి పైలట్‌ శిక్షణలో చేరారు. 2017 నాటికి ఆమె పూర్తిస్థాయి కెప్టెన్  గా మారారు. ఆ తరువాత హిమాలయాలలోని ఎతై ్తనప్రాంతాలలో సెర్చ్‌ అండ్‌ రెస్క్యూ మిషన్లలో శిక్షణ పొందారు. ఎవరెస్ట్‌ పర్వతంపై దాదాపు 6,200 మీటర్ల ఎత్తు వరకు వెళ్లి గాయపడిన పర్వతారోహకులను రక్షించిన ఘనత ఆమె సొంతం.

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

హైదరాబాద్ లో ఆకాశ వంతెన (స్కైవాక్)...ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

పులివెందుల : భాకరాపురం క్యాంప్‌ కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ ప్రజాదర్బార్‌ (ఫొటోలు)

+5

‘మిర్జాపూర్‌ : ది మూవీ’ తెలుగు ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)