Breaking News

రవితేజ ఇంటి నుంచి కొత్త హీరో.. ట్రైలర్ రిలీజ్

Published on Tue, 09/01/2026 - 11:35

'ఇరుముడి' హిట్ కొట్టిన రవితేజ మంచి జోష్‌లో ఉన్నాడు. ఇప్పుడు ఇతడి ఇంటి నుంచి మరో హీరో రాబోతున్నాడు. రవితేజ తమ్ముడు రఘ కొడుకు మాధవ్ ప్రధాన పాత్ర చేసిన 'మారెమ్మ' విడుదలకు సిద్ధమైంది. వచ్చే శుక్రవారం(సెప్టెంబరు 10) ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ వదిలారు. ఇది ఆకట్టుకునేలా ఉంది.

(ఇదీ చదవండి: 'పుష్ప'లో చీర కట్టుకోవడం.. నేను చేసిన పెద్ద 'ఆల్ఫా' పని: అల్లు అర్జున్)

గతంలో 'లవ్ యూ ఇడియట్' అనే మూవీలో మాధవ్ హీరోగా పరిచయమయ్యాడు. కానీ ఇదొచ్చిందా లేదా అనే సంగతి జనాలకు పెద్దగా తెలీదు. తర్వాత విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే 'మారెమ్మ' ఒప్పుకొన్నాడు. ఏడాది క్రితం దీని గురించి ప్రకటన వచ్చింది. కొన్నిరోజుల క్రితం మూవీ రిలీజ్ డేట్ ప్రకటించారు. ఇప్పుడు ట్రైలర్ విడుదల చేశారు.

మారెమ్మ అనే గ్రామ దేవత, ఈ దేవి కోసం పెంచే ఓ దున్నపోతు. దాన్ని కాపాలా కాసే ఓ కాపరి. ఊరిలో జరిగే కొన్ని అరిష్టాలు. ఇలా ట్రైలర్ సాగింది. తెలంగాణలోని ఓ పల్లె నేపథ్యంగా మూవీ ఉండనుంది. ఇందులో మాధవ్ సరసన దీపా బాలు హీరోయిన్‌గా చేసింది. మంచాల నాగరాజు దర్శకుడు. ఈ సినిమాతోనైనా మాధవ్ హీరోగా సక్సెస్ అందుకుంటాడేమో చూడాలి?

(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'ఇరుముడి' వచ్చేది అప్పుడేనా?)

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)

+5

పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు)

+5

యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు)

+5

‘ఐ యామ్‌ గేమ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా నాగ్‌ అశ్విన్‌ (ఫొటోలు)