Breaking News

పెళ్లయిన 5 నెలలకే 'సాహో' సింగర్ విడాకులు

Published on Tue, 09/01/2026 - 10:23

సినిమా ఇండస్ట్రీలో డేటింగ్, పెళ్లి, విడాకులు అనే మాటలు తరచుగా వినిపిస్తూనే ఉంటాయి. అందుకు తగ్గట్లే సెలబ్రిటీలు ఒకటికి మించి వివాహాలు చేసుకుని వార్తల్లో నిలుస్తుంటారు. అదే టైంలో సడన్‌గా విడిపోయి షాకులిస్తుంటారు. ఇప్పుడు అలానే ప్రముఖ సింగర్, ర్యాపర్ బాద్‌షా.. పెళ్లయిన ఐదు నెలలకే రెండో భార్యకు కూడా విడాకులు ఇచ్చేశాడు. ఈ మేరకు అధికారికంగా ఈ విషయాన్ని ఇద్దరూ ప్రకటించారు.

(ఇదీ చదవండి: ఆమెకు ప్రశాంతత ఇవ్వలేదు..విడాకులకు కారణం నేనే: 'జైలర్' విలన్)

ఆదిత్య ప్రతీక్ సింగ్ సిసోడియా అలియాస్ బాద్‌షా స్వతహాగా పంజాబీ. హిందీ, పంజాబీ భాషల్లో ఎక్కువగా పాటలు పాడుతుంటాడు. సొంత ఆల్బమ్ సాంగ్స్‌తో పాటు సినిమాల్లోనూ పాటలు పాడుతుంటాడు. ప్రభాస్ 'సాహో'లో బ్యాడ్ బాయ్, అజిత్ 'వేదాళం'లో అలుమా డోలుమా గీతాల్ని ఆలపించి దక్షిణాది ప్రేక్షకులకు ఇతడు సుపరిచతమే.

అసలు విషయానికొస్తే గతంలో జాస్మిన్ మాసి అనే మహిళని 2012లో పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు ఓ కూతురు కూడా ఉంది. కానీ 2020లో ఈమె నుంచి విడిపోయాడు. తర్వాత సింగిల్‌గానే ఉన్నాడు. ఈ ఏడాది మార్చిలో పంజాబీ నటి ఇషా రిఖీని పెళ్లి చేసుకున్నాడు. ఈ తంతు రహస్యంగా జరిగింది. కానీ వివాహం విషయాన్ని జూన్‌లో ఇషా ధ్రువీకరించింది. మరి ఏమైందో ఏమో గత నెలరోజులుగా వీరిద్దరూ విడిపోనున్నారనే రూమర్స్ వినిపించాయి. వాటిని నిజం చేస్తూ బాద్‌షా-ఇషా సంయుక్తంగా ఇప్పుడు విడాకులు ప్రకటించారు. సోమవారం రాత్రి ఇన్‌స్టా ఖాతాల్లో స్టోరీలు పోస్ట్ చేశారు.

'నేను, ఇషా రిఖీ పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్నాం. ఇకపై మా జీవితాలు వేర్వేరు మార్గాల్లో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాం. ఇది పరస్పర గౌరవంతో తీసుకున్నదే. ఈ టైంలో మా ప్రైవసీని గౌరవించాలని అందరినీ కోరుతున్నాం. మా బంధం గురించి ఇకపై ఎలాంటి రూమర్స్ వ్యాప్తి చేయొద్దని మనస్పూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇదే మా ప్రకటన' అని బాద్‌షా పేర్కొన్నాడు.

(ఇదీ చదవండి: మేం విడాకులు తీసుకున్నాం.. కానీ పాప విషయంలో:జీవీ ప్రకాశ్)

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)

+5

పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు)

+5

యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు)

+5

‘ఐ యామ్‌ గేమ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా నాగ్‌ అశ్విన్‌ (ఫొటోలు)