Breaking News

'పుష్ప'లో చీర కట్టుకోవడం.. నేను చేసిన పెద్ద 'ఆల్ఫా' పని

Published on Tue, 09/01/2026 - 09:03

'పుష్ప' రెండు సినిమాలతో పాన్ ఇండియా స్టార్‌డమ్ సొంతం చేసుకున్న అల్లు అర్జున్.. మిగతా తెలుగు హీరోలకు అందనంత ఎత్తులోకి వెళ్లిపోయాడు. ప్రస్తుతం 'రాకా' అనే భారీ బడ్జెట్ మూవీతో పాటు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలోనూ నటిస్తున్నాడు. ఇకపోతే రీసెంట్‌గా ఫోర్బ్స్ మ్యాగజైన్ కవర్ పేజీపై బన్నీ ఫొటో పడింది. ఈ క్రమంలోనే సదరు మ్యాగజైన్‌కి ఇంటర్వ్యూ ఇచ్చిన ‍అల్లు అర్జున్.. 'పుష్ప' గురించి, ప్రస్తుతం వస్తున్న మూవీస్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

(ఇదీ చదవండి: అల్లు అర్జున్‌లా మిగతా హీరోలు ఎందుకు చేయలేకపోతున్నారు?)

ఫోర్బ్స్ ఇంటర్వ్యూలోని తాను మాట్లాడిన కొన్ని విషయాల్ని ఇన్ స్టాలో ఫొటోల రూపంలో బన్నీ షేర్ చేశాడు. వీటిలో ఎక్కువ ఆకర్షిస్తున్నది అయితే 'పుష్ప'లో లేడీ గెటప్ ధరించడం గురించి ఇతడి చెప్పిన మాటలు. 'నా జీవితంలో నేను చేసిన అత్యంత ఆల్ఫా(మగతనం/పవర్‌ఫుల్) పని.. 'పుష్ప'లో మహిళలా చీరకట్టుకుని నటించడమే' అని అన్నాడు.

'ఒత్తిడి అనేది అరుదుగా దొరికే ఒక గొప్ప వరం. దేశంలో కొద్దిమందికి మాత్రమే అలాంటి అవకాశం లభిస్తుంది. నా దృష్టిలో ఒత్తిడి అనేది అదృష్టం. ఇప్పుడు యావరేజ్ కంటెంట్‌ని ప్రేక్షకులు పట్టించుకోవట్లేదు. ఒక గొప్ప సినిమాని ప్రేక్షకుల ముందుకు తెస్తే, మిగిలిన బాక్సాఫీస్ లెక్కలన్నీ అదే చూసుకుంటుంది. 'పుష్ప' సాధించిన విజయం.. భారతీయ సినిమా స్థాయిని ప్రపంచ వేదికపై మరో మెట్టు పైకి తీసుకెళ్లేలా నన్ను రోజూ ప్రేరేపిస్తోంది' అని కూడా బన్నీ చెప్పాడు.

(ఇదీ చదవండి: ఇప్పుడు వైజాగ్ రోడ్డుపై నడవలేకపోతున్నా: అల్లు అర్జున్)

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)

+5

పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు)

+5

యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు)

+5

‘ఐ యామ్‌ గేమ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా నాగ్‌ అశ్విన్‌ (ఫొటోలు)