Breaking News

23 ఏళ్లకే ఉద్యోగం వదిలేశాడు.. కొండల్లో తిరుగుతూ కోట్ల సంపాదన!

Published on Mon, 08/31/2026 - 17:30

పాతికేళ్ల వయసులో జాబ్ చేస్తూ బాగా సంపాదించాలని అందరూ అనుకుంటారు. కానీ 23 ఏళ్ల వయసులో బ్యాంకింగ్ ఉద్యోగాన్ని వదిలి తనకు ఇష్టమైన కొండలు, అడవులు, ట్రెక్కింగ్‌ వైపు అడుగులు వేసాడు విజయ్ ప్రతాప్ సింగ్. అదే అతన్ని సక్సెస్ వైపు తీసుకెళ్లింది, కోట్ల రూపాయల ఆదాయం గడించేలా చేసింది.

ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌కు చెందిన విజయ్ చదువుల కోసం డెహ్రాడూన్‌కు వెళ్లిన తర్వాత ప్రకృతికి చాలా దగ్గరయ్యాడు. ఖాళీ సమయం దొరికినప్పుడల్లా అడవులు, కొండల్లో తిరిగేవాడు. అదే ఆసక్తి తర్వాత సొంత వ్యాపారం పెట్టాలనే ఆలోచనకు దారితీసింది.

ట్రెక్కింగ్‌తో సొంత కంపెనీ
విజయ్ అడ్వెంచర్ ట్రావెల్ కంపెనీని ప్రారంభించాడు. ట్రెక్కింగ్ ట్రిప్స్‌, అవుట్‌డోర్ కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా కంపెనీని క్రమంగా అభివృద్ధి చేశాడు. ఉద్యోగం వదిలే ముందే కంపెనీని ఎలా నడపాలనే దానిపై ప్లాన్ చేసుకున్నాడు. స్నేహితుల సహాయంతో వెబ్‌సైట్‌, సోషల్ మీడియా పేజీలు ఏర్పాటు చేసి ట్రెక్కింగ్ బుకింగ్స్‌ ప్రారంభించాడు. 2016లో 12 మంది విద్యార్థులను చోప్టా-తుంగ్‌నాథ్ ట్రెక్‌కు తీసుకెళ్లడంతో అతని ట్రెక్ లీడర్ ప్రయాణం మొదలైంది.

శిక్షణతో బలమైన టీమ్
ట్రెక్కింగ్‌పై ఆసక్తి ఒక్కటే మాత్రమే సరిపోదని విజయ్‌ అర్థం చేసుకున్నాడు. కొండల్లో భద్రత చాలా ముఖ్యమని భావించి నెహ్రూ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. తర్వాత శిక్షణ పొందిన ట్రెక్ లీడర్లతో 10 మంది సభ్యుల టీమ్‌ను ఏర్పాటు చేశాడు. వీరిలో కొందరికి మౌంటెనీరింగ్‌, సెర్చ్ అండ్ రెస్క్యూ, ఫస్ట్ ఎయిడ్‌లో శిక్షణ ఉంది. ట్రెక్కింగ్‌కు వచ్చే వారి ఆరోగ్య పరిస్థితిని కూడా ముందుగానే పరిశీలిస్తారు.

రూ.10 కోట్ల వరకు ఆదాయం
గత ఎనిమిదేళ్లలో తన అడ్వెంచర్ ట్రావెల్ కంపెనీ ద్వారా లడఖ్‌, హిమాచల్ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, సిక్కిం, నేపాల్ వంటి ప్రాంతాలకు ట్రెక్కింగ్ ట్రిప్స్ నిర్వహించారు. ఈ కంపెనీ ఇప్పటివరకు సుమారు రూ.10 కోట్ల ఆదాయం పొందినట్లు సమాచారం. అయితే.. ఎక్కువ ట్రెక్కులు నిర్వహించడం కంటే.. ప్రతి గ్రూప్‌కు మంచి అనుభవం ఇవ్వడానికే విజయ్‌ ప్రాధాన్యం ఇస్తున్నాడు. అందుకే ఏడాదికి 10 నుంచి 20 ట్రెక్కులు మాత్రమే నిర్వహిస్తున్నారు. భవిష్యత్తులో ఎవరికీ పెద్దగా తెలియని కొత్త ట్రెక్కింగ్ మార్గాలను గుర్తించి, వాటిని అభివృద్ధి చేయాలనేది తన లక్ష్యమని విజయ్‌ పేర్కొన్నారు.

ఇదీ చదవండి: ఖాతాదారులకు అలర్ట్.. ఈ తేదీల్లో బ్యాంకులు బంద్!

Videos

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

గుంటూరు గోపి లాకప్ డెత్..? రాఖీ పండుగ రోజు తీసుకెళ్లి కొట్టి చంపారు..

జీ న్యూస్ అధినేత సుభాష్ చంద్రకు NCLT షాక్

ఆ రిపోర్ట్ తో TDP నేతలకు టెన్షన్

TS: రోగులతో కిటకిటలాడుతున్న దవాఖానాలు

Photos

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)

+5

పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు)

+5

యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు)

+5

‘ఐ యామ్‌ గేమ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా నాగ్‌ అశ్విన్‌ (ఫొటోలు)

+5

కొత్త సినిమా ‘వేట’ ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

‘కూర్మావతార్‌’ సినిమా టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)