Breaking News

చేతితో చిత్రించిన పటచిత్ర చీరలో నీతా అంబానీ అద్భుతమైన లుక్‌..!

Published on Mon, 08/17/2026 - 12:36

దేశంలోని గొప్ప కళా వారసత్వాన్ని చాటిచెప్పే చీరలో నీతా అంబానీ మెరిశారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకులను జరుకునేందుకు ఆమె ఒడిశా హస్తకళా వారసత్వ చీరను ఎంచుకున్నారు. నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (NMACC) వ్యవస్థాపకురాలు ఎప్పటికప్పుడూ భారతీయ వారసత్వ సంప్రదాయన్ని ప్రదర్శిస్తూ.. అందర్నీ విస్మయపరుస్తుండే ఆమె ఈసారి ఒడిశా వారసత్వంతో అందర్నీ మంత్ర ముగ్ధుల్ని చేశారామె. 

నీతా ధరించిన చీరను ప్రత్యేకంగా స్వదేశ్ సంస్థ రూపొందించింది. దీనిపై ప్రఖ్యాత పటచిత్ర కళాకారుడు ప్రశాంత మొహరానా కళాకృతి ఉంది. ఈ కళాకృతిని ఒడిశాలోని రఘురాజ్‌పూర్‌కు చెందిన నిపుణులైన నేత కార్మికులు నేసిన టస్సర్ సిల్క్‌పై చిత్రించడం విశేషం. ఈ చీర ఆ ప్రాంతం ప్రసిద్ధ వస్త్ర, చిత్రకళా సంప్రదాయలను ఒకచోట చేర్చింది. ఆ చీరపై జీవ వృక్షం డిజైన కూడా ఉంది. అది అశ్వత్ధం నుంచి ప్రేరణ పొందిన జీవ వృక్షం. అదే ఈ చీరకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ డిజైన్ సృష్టి, నిరంతరత. జీవరాశి అనుసంధానికి ప్రతీక. 

ఈ చెట్టు తోపాటు ఆకులు, పక్షులను కూడా విలక్షణమైన పటచిత్ర శైలిలో చిత్రీకరించారు. సింపుల్‌గా చెప్పాలంటే ఈ చీర ఒడిశా కళా వారసత్వానికి ఒక సజీవ కాన్వాస్‌గా మారింది. ఈ క్లిష్టమైన కళాకృతి ఎంతో హుందాగా ఉండే ఈ చీరకు గాఢమైన సాంస్కృతిక రూపాన్ని ఇస్తుంది. అదే సమయంలో టస్సర్ సిల్క్ ఒక ప్రకాశవంతమైన ఆధారాన్ని అందిస్తూ, చేతితో వేసిన పెయింటింగ్ వివరాలు ప్రస్ఫుటంగా కనిపించేలా చేస్తుంది. 

ఈ చీరకు ఎరుపు నలుపు రంగుల అంచు ఉన్న మ్యాచింగ్‌ బ్లౌజ్‌ని జత చేశారు. దీనివల్ల స్టైలింగ్ క్లాసిక్‌గా ఉంటూ, కళాకృతి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ శారీకి అనుగుణంగా సాంప్రదాయ స్టెప్స్‌ గొలుసు, స్టేట్‌మెంట్‌ చెవిపోగులు, గాజులు, ఉంగరాన్ని జత చేశారు. ఆమె కురులను ఉంగరాల జుట్టు మాదిరిగా వదులుగా వదిలేశారు. 

ఇక్కడ నీతా అంబానీ స్వాతంత్ర్య దినోత్సవ రూపం సాంప్రదాయ పండుగ దుస్తులకు అతీతంగా, భారతీయ హస్తకళా నైపుణ్యానికి అగ్రస్థానం కల్పిస్తున్నట్లుగా హెలెట్‌గా నిలిచింది. ఈ చీరతో నీతా పటచిత్ర కళాకారులు, టస్సర్‌ సిల్క్‌ని నేసే రషురాజ్‌పూర్‌ చేనేత కార్మికులును ఒక చోటచేర్చి ఒడిశా కళాకారుల వైభవాన్ని చాటి చెప్పారామె. 

 

(చదవండి: Independence Day 2026: ఎర్రకోటపై మోదీ ‘బంధనీ’ సఫా.. చుక్కల వెనుక వేల ఏళ్ల భారతీయ చరిత్ర!)


 

#

Tags : 1

Videos

పిఠాపురంలో TDPకి బిగ్ స్ట్రోక్..!

భారత్ ఎన్నికలపై ట్రంప్ ఫోకస్..! అమెరికాలో కొత్త రూల్స్ కు పిలుపు

రేవంత్ పై కోపమా అక్కా.. CM టూర్ లో మంత్రి మిస్సింగ్

ఫారిన్ మెడికల్ స్టూడెంట్స్ పై జూడాల సమ్మె ప్రభావం

ప్రియాంక కేసులో కీలక మలుపు నిందితులకు పోలీస్ కస్టడీ

BJPకి షాక్ ఇస్తూ.. విజయ్ ని మెచ్చుకున్న అన్నామలై..

అర్ధరాత్రి ఆపరేషన్..! పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు

దారి తప్పిన మమ్ముట్టి చివరికి ఏమైందంటే..?

మహిళతో TDP నేత సంచలన ఆడియో లీక్

రేవంత్ సర్కార్ నిర్ణయంపై ఆటో డ్రైవర్ల రియాక్షన్

Photos

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న క్రికెటర్ తిలక్ వర్మ (ఫొటోలు)

+5

18 ఏళ్లు పూర్తి చేసుకున్న కోహ్లి (ఫొటోలు)

+5

న్యూయార్క్‌ : 'ఇండియా డే పరేడ్ 2026'లో పూజా హెగ్డే సందడి (ఫొటోలు)

+5

కందుకూరులో వైభవంగా తేళ్ల పంచమి... పోటెత్తిన భక్తజనం (ఫొటోలు)

+5

హైదరాబాద్ : కన్నుల పండువగా ఇస్కాన్‌ దేవాలయ స్వర్ణోత్సవాలు (ఫొటోలు)

+5

ఫ్యామిలీతో ప్రియాంక చోప్రా సందడి (ఫొటోలు)

+5

చిరునవ్వులు చిందిస్తూ శ్రియా సోయగాలు (ఫొటోలు)

+5

వయ్యారాలు ఒలకబోస్తున్న రకుల్‌ (ఫొటోలు)

+5

‘ఇరుముడి’ మూవీ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

బండ్ల గణేశ్‌ కూతురు పెళ్లిలో టాలీవుడ్ తారల సందడి (ఫోటోలు)