Breaking News

సోలో ట్రావెల్‌ చేశారంటే.. మిమ్మల్ని మీరు తెలుసుకుంటారు!

Published on Mon, 08/17/2026 - 08:54

సోలో ట్రావెల్‌ అంటే లోన్లీనెస్‌ అని చాలా మంది అనుకుంటారు. కానీ నిజానికి ఒంటరిగా ప్రయాణిస్తున్నప్పుడు మనతో మనం ఎక్కువ టైమ్‌ స్పెండ్‌ చేస్తాము. ఎవరికోసం వెయిట్‌ చేయాల్సిన అవసరం ఉండదు. ఎక్కడికి వెళ్లాలి, ఎక్కడ ఆగాలి, ఏం తినాలి, ఎవరితో మాట్లాడాలి అనే నిర్ణయాలు అన్నీ మనమే తీసుకుంటాము.

నిర్ణయాలు తీసుకోవడం నేర్చుకుంటాము
సోలో ట్రిప్‌లో చిన్న చిన్న నిర్ణయాలు కూడా మనమే తీసుకోవాలి. ట్రైన్‌ మిస్‌ అయితే నెక్ట్స్‌ ఆప్షన్స్ ఏంటి? హోటల్‌ నచ్చకపోతే ఏం చేయాలి? రూట్‌ ఛేంజ్‌ అయితే ఎలాప్రొసీడ్‌ అవ్వాలి? ఇలాంటి సిచ్చువేషన్స్ మన కాన్ఫిడెన్స్ని పెంచుతాయి. జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు టెన్షన్‌ పడకుండా సిచ్చువేషన్స్ని హ్యాండిల్‌ చేయడం అలవాటు అవుతుంది.

కొత్తవారితో మాట్లాడే ధైర్యం వస్తుంది
ప్రయాణాల్లో కొత్తవారితో మాట్లాడటం సాధారణం అవుతుంది. లోకల్‌ షాప్‌ ఓనర్స్, ఆటో డ్రైవర్స్, తోటి ప్రయాణికులు లేదా ఒక చిన్న కేఫెలో కలిసిన వ్యక్తితో సంభాషణ ప్రారంభిస్తాము. ఇలా కొత్తవారితో కనెక్ట్‌ అవ్వడం వల్ల మన కంఫర్ట్‌ జోన్‌ మెల్లిగా పెరుగుతుంది.

మన గురించి మనకు తెలుస్తుంది
గ్రూప్‌ ట్రావెల్లో మన పర్సనాలిటీలో కొన్ని సైడ్స్‌ బయటికి రాకపోవచ్చు. కానీ సోలో ట్రావెల్‌లో మనమే మన ప్రపంచం. మనమే మనకు తోడు. సైలెన్స్ని ఎంజాయ్‌ చేయడం, అంతగా తెలియని ప్రాంతాల్లో అడ్జస్ట్‌ అవ్వడం, ఊహించని పరిస్థితులను హ్యాండిల్‌ చేయడం వల్ల మన బలాలు, బలహీనతలు రెండూ మనకు క్లియర్‌గా తెలుస్తాయి.

చిన్న చిన్న ఆనందాల విలువ తెలుస్తుంది.
ఒక హాట్‌ టీ, మార్నింగ్‌ స¯Œ రైజ్, కొత్త ప్రాంతంలో ప్రశాంతమైన స్ట్రీట్, లాంగ్‌ ట్రైన్‌ జర్నీంఇలాంటి సింపుల్‌ మూమెంట్స్‌ కూడా స్పెషల్‌గా అనిపిస్తాయి. ట్రావెల్‌ మన అటెన్షన్ని పెద్ద పెద్ద టాస్కుల నుంచి చిన్న చిన్న ఆనందాలవైపు మళ్లిస్తాయి.

కొత్త వ్యక్తిగా తిరిగి వస్తారు
సోలో ట్రిప్‌ కంప్లీట్‌ చేసి ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు సూట్‌కేస్‌లో కొన్ని కొత్త వస్తువులు, మైండ్‌లో కొత్త మెమోరీస్‌తో పాటు ఒక కొత్త వ్యక్తిత్వం, కొత్త ఐడియాలజీతో ఒక కొత్త వ్యక్తిగా తిరిగి వస్తారు. మనపై మనకు నమ్మకం పెరుగుతుంది. ప్రపంచం గురించి మాట్లాడటమే కాదు, మన గురించి కూడా తెలుసుకోవడానికి ట్రావెల్‌ ఒక బ్యూటిఫుల్‌ ఐడియాగా పనికొస్తుంది. మనల్ని మనకు కొత్తగా పరిచయం చేస్తుంది ఒంటరి ప్రయాణం. అందుకే జీవితంలో అప్పుడప్పుడూ సోలో ట్రిప్స్‌ చేస్తుండాలి.

Videos

Telangana SIR: 90 లక్షల మందికి నోటీసులు -CEO సుదర్శన్ రెడ్డి

పిఠాపురంలో TDPకి బిగ్ స్ట్రోక్..!

భారత్ ఎన్నికలపై ట్రంప్ ఫోకస్..! అమెరికాలో కొత్త రూల్స్ కు పిలుపు

రేవంత్ పై కోపమా అక్కా.. CM టూర్ లో మంత్రి మిస్సింగ్

ఫారిన్ మెడికల్ స్టూడెంట్స్ పై జూడాల సమ్మె ప్రభావం

ప్రియాంక కేసులో కీలక మలుపు నిందితులకు పోలీస్ కస్టడీ

BJPకి షాక్ ఇస్తూ.. విజయ్ ని మెచ్చుకున్న అన్నామలై..

అర్ధరాత్రి ఆపరేషన్..! పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు

దారి తప్పిన మమ్ముట్టి చివరికి ఏమైందంటే..?

మహిళతో TDP నేత సంచలన ఆడియో లీక్

Photos

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న క్రికెటర్ తిలక్ వర్మ (ఫొటోలు)

+5

18 ఏళ్లు పూర్తి చేసుకున్న కోహ్లి (ఫొటోలు)

+5

న్యూయార్క్‌ : 'ఇండియా డే పరేడ్ 2026'లో పూజా హెగ్డే సందడి (ఫొటోలు)

+5

కందుకూరులో వైభవంగా తేళ్ల పంచమి... పోటెత్తిన భక్తజనం (ఫొటోలు)

+5

హైదరాబాద్ : కన్నుల పండువగా ఇస్కాన్‌ దేవాలయ స్వర్ణోత్సవాలు (ఫొటోలు)

+5

ఫ్యామిలీతో ప్రియాంక చోప్రా సందడి (ఫొటోలు)

+5

చిరునవ్వులు చిందిస్తూ శ్రియా సోయగాలు (ఫొటోలు)

+5

వయ్యారాలు ఒలకబోస్తున్న రకుల్‌ (ఫొటోలు)

+5

‘ఇరుముడి’ మూవీ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

బండ్ల గణేశ్‌ కూతురు పెళ్లిలో టాలీవుడ్ తారల సందడి (ఫోటోలు)