'ఓం'కి ఇంత పవర్‌ ఉందా? గుక్కపెట్టి ఏడుస్తున్న బిడ్డ కాస్తా..

Published on Fri, 08/14/2026 - 16:07

పసిబిడ్డలు ఏడిస్తే సహజంగా ఏం చేస్తాం పాలు, లేదా డైపర్‌ వంటివి తనిఖీ చేస్తాం. ఒకవేళ అవి కాకపోతే భయపడ్డాడేమోనని దగ్గరకి తీసుకోవడం లేదా ఊయల్లో వేసి ఊపడం వంటివి చేస్తే ఆ పసివాడు ఏడుపు ఆపుతాడు. సహజంగా ఎవ్వరైనా ఇలానే చేస్తాం. కానీ ఈసారి నెట్టింట వైరల్‌ అవుత్తున్న వీడియోలో వ్యక్తి మాదిరి చేసి చూడండి. అంతేగాదు ఈ ఘటన మన ఆధ్యాత్మకి శక్తి గొప్పదనాన్ని చాటి చెప్పేలా ఉండటం విశేషం. 

ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన వీడియో క్లిప్‌లో ఒక తండ్రి ఏడుస్తున్న బిడ్డను పట్టుకుని ..నెమ్మదిగా ఓం శబ్దాన్ని ఆలపిస్తాడు. క్షణాల్లో బిడ్డ ఏదో మత్తువచ్చినట్లుగా శాంతించి నిద్రపోవడం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ చర్య పేరెంటింగ్‌ హ్యాక్‌గా మారింది. కఈ వీడియోకి మిలియన్లలో వ్యూస్‌ లైక్‌లు రావడమే గాక నెటిజన్ల మనసుని దోచుకుంది కూడా.

"ఓం" అనేది భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాలలో లోతుగా పాతుకుపోయిన ఒక పవిత్రమైన మంత్రం. దీనికి భారతీయ ఆధ్యాత్మికత,  యోగ సంప్రదాయాలలో "ఓం"కు సుదీర్ఘ చరిత్ర ఉంది, అక్కడ దీనిని మంత్రంగా, ధ్యానం చేసేటప్పుడు ఒక సాధనంగా ఉపయోగిస్తారు. అందువల్ల ఈ పద్ధతి భారతీయ తల్లిదండ్రులను అమితంగా ఆకర్షిస్తుంది. అయితే “ఓం” జపించడం వల్లనే శిశువు ఏడుపు ఆగిపోతుందనడానికి శాస్త్రీయ ఆధారాలు లేవు. 

కానీ లయబద్ధమైన శబ్దాలు, పునరావృతమయ్యే ఇంద్రియ అనుభూతి, కదలిక, సంరక్షకుని సాన్నిధ్యం వల్ల శాంతిని చేకూరుస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. అలాగే ఈ ఓం మంత్రపై పరిశోధనలు పెద్దలపైనే జరిగాయి. ఫ్రాంటియర్స్ ఇన్ సైకాలజీలో 2022లో ప్రచురించబడిన ఒక అధ్యయనంలో, ధ్యానంలో ఎటువంటి అనుభవం లేని 33 మంది పెద్దలపై పరిశోధకులు అధ్యయనం చేశారు. ఓం జపం చేయడం వల్ల, వాళ్లలో ప్రతికూల భావాలు తగ్గడమే గాక ఆలోచన విధానంలో కూడా మంచి మార్పు వచ్చింది.

పేరెంట్స్‌ ప్రయత్నించొచ్చా?
తల్లిదండ్రులు గుర్తుంచుకోవలసిన అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, శిశువులలో కడుపునొప్పి, మితిమీరిన ఏడుపు లేదా నిద్ర సమస్యలను 'ఓం' నయం చేస్తుందనడానికి ఎలాంటి వైద్యపరమైన ఆధారాలు లేవు. అలాగే, ఈ ధ్వని శిశువు నాడీ వ్యవస్థపై ఒక ప్రత్యేకమైన ప్రభావాన్ని చూపుతుంది అని చెప్పడానికి కూడా తగినంత ఆధారాలు కూడాలేవు.అయితే శిశువులు తమ సంరక్షకుల స్వరాలకు లయబద్ధమైన ఇంద్రియ అనుభవాలకు అత్యంత వేగంగా స్పందిస్తారు. 

అందువల్ల, ఈ "ఓం", శిశువులకు జోలపాట లేదా గుసగుసలు లేదా  "ష్ష్ష్" వంటి ఊహించదగిన శ్రవణ సంకేతంగా పనిచేయవచ్చునని చెబుతున్నారు. ఆరోగ్యకరమైన శిశువు ఏడుపు ఆపడానికి ఇలాంటి "ఓం" టెక్నిక్‌ని అనుసరించడంలో సమస్యల లేదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. కానీ దీన్ని ఓ అద్భుత పరిష్కారంగా మాత్రం చూడొద్దని హెచ్చరిస్తున్నారు.

గమనిక: ఇది కేవలం మత విశ్వాసాలకు సంబంధించిన అంశం. అలాగే కొన్ని శబ్దాలు సహజంగా ప్రభావం చూపిస్తాయని అవగాహన కల్పించేందుకు మాత్రమే. మరిన్ని వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించి అనుసరించడం మంచిది. 

(చదవండి: ఎవరీ యాల్డా మోయిరీ..? ఏకంగా 15 ఏళ్లు..)
 

Videos

రాజమండ్రి ప్రియాంక ఘటనపై విద్యార్థులు భారీ ర్యాలీ

సంగారెడ్డిలో లక్ష మందితో భారీ బహిరంగ సభ

ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో సంచలన నిజాలు బయట పెట్టిన లాయర్

నల్గొండ జిల్లాలో రూపారెడ్డి హత్య కేసులో వీడని మిస్టరీ

గోవాడ షుగర్ ఫ్యాక్టరీ అమ్మకానికి కుట్ర.. చంద్రబాబును ఏకిపారేసిన అమర్నాథ్

నన్ను, హైదరాబాద్ రమ్మని చెప్పి , రాహుల్ సిప్లిగంజ్ బాధితురాలి సంచలన వీడియో...

మిల్లుల్లో మాయం అవుతున్న ప్రభుత్వ ధాన్యం

కూటమికి మొట్టికాయలు సీదిరి అప్పలరాజుకు బెయిల్

విజయ నగరంలో దారుణం ప్రియురాలిని చంపి..

Viral Video: దంపతులపై కుక్క‌ దాడి... భార్యాభర్తలకు తీవ్ర గాయాలు వైరల్ వీడియో

Photos

+5

అఖిల్‌ రాజ్‌, నాగదుర్గ జంటగా ‘శనార్తి’ సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

వెకేషన్‌లో హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ చిల్.. (ఫోటోలు)

+5

'అమీర్ లోగ్' హీరోయిన్ వేద జలంధర్ బ్యూటీ ఫుల్ (ఫొటోలు)

+5

మిర్చి కంటే ఘాటుగా 'టాక్సిక్' కియారా గ్లామర్ (ఫొటోలు)

+5

హీరో శర్వానంద్ 'జార్జ్ క్రిష్' మూవీ ప్రారంభం (ఫొటోలు)

+5

'ఇరుముడి' సినిమా ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

‘అమీర్ లోగ్’ సినిమా ట్రైలర్ ఆవిష్కరణ (ఫొటోలు)

+5

'ప్యార్ ప్రేమ కళ్యాణం'మూవీ ప్రెస్‌మీట్ (ఫొటోలు)

+5

కర్నూలులో వైఎస్‌ జగన్‌కు జననీరాజనం.. కదం తొక్కిన కార్యకర్తలు (ఫొటోలు)

+5

'అగధ' మూవీ కామాక్షి భాస్కర్ల స్పెషల్‌ (ఫొటోలు)