‘ఎన్టీఆర్‌ చికెన్‌’ కామెంట్స్‌పై ఎంఎస్‌ రాజు క్లారిటీ

Published on Tue, 08/11/2026 - 18:22

‘అగధ’ సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో స్వర్గీయ నందమూరి తారక రామారావుపై ప్రముఖ నిర్మాత, దర్శకుడు ఎం. ఎస్‌ రాజు చేసిన ‘చికెన్‌’ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. పలువురు నెటిజన్స్‌ ఎం.ఎస్‌ రాజుని విమర్శిస్తూ కామెంట్స్‌ చేశారు. తాజాగా ఈ ‘చికెన్‌’ వ్యాఖ్యలపై ఎం.ఎస్‌ రాజు వివరణ ఇచ్చాడు. ఎన్టీఆర్‌పై అంతులేని అభిమానంతోనే ఆ మాటలు అన్నానని.. అంతకు మించి తనకు ఎలాంటి దురుద్దేశం లేదని ఆయన చెప్పాడు.

ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ ఎం.ఎస్‌ రాజు ఏమన్నారంటే.. 
ఎం.ఎస్. రాజు దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘అగధ’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ ఇటీవల హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఎం.ఎస్‌ రాజు మాట్లాడుతూ.. ఈ సినిమా కోసం తాను ఎంతో కష్టపడ్డాడని చెప్పాడు. తను పడిన కష్టం గురించి చెబుతూ..‘ఏడాదిన్నర పాటు ఎన్టీ రామారావు గారిలాగే నేను కూడా ఉదయం 3 గంటలకే నిద్ర లేచాను. ఆయనలాగా చికెన్‌ తినలేదు కానీ.. నేనే పాలు కాచుకొని తాగుదాం అనుకుంటే నా భార్యలేచి కాఫీ పెట్టి ఇచ్చేది. అక్కడ నుంచి మొదలెడితే అర్థరాత్రి వరకు సినిమా గురించే ఏదో ఒక పని చేసేవాడిని’అని చెప్పాడు. అయితే ఎన్టీఆర్‌లాగా చికెన్‌ తినలేదని వ్యంగ్యంగా అనడాన్ని కొంతమంది నెటిజన్స్‌ తప్పుపట్టారు. ఎం.ఎస్‌ రాజుని ట్రోల్‌ చేస్తూ పెద్ద ఎత్తున పోస్టులు చేశారు.

అభిమానంతోనే అలా.. 
తాజాగా ఈ వ్యాఖ్యలపై ఎం.ఎస్‌ రాజు వివరణ ఇచ్చాడు. రామారావుగారిపై ఉన్న అభిమానంతోనే అలా అన్నానని చెప్పాడు. ‘నేను ఇంత వరకు ఏ సినిమాకి కూడా బ్రహ్మ ముహుర్తంలో లేచి పని చేయలేదు. కానీ ‘అగధ’ కోసం ఎన్టీ రామారావు గారిలా ఉదయం మూడు గంటలకే నిద్ర లేచేవాడ్ని. ఆయన్ను స్పూర్తిగా తీసుకుని పని చేశాను అని చెప్పే క్రమంలో అందరికీ తెలిసిన విషయాన్ని నేను సరదాగా చెప్పాను. ఆయన ఉదయాన్నే చికెన్ తింటారు అన్నది అందరికీ తెలిసిందే.  పొద్దున లేవగానే వ్యాయామం చేసేవాడు. ఆ తర్వాత స్నానం చేసుకొని పూజ చేసి.. తినడానికి వెళ్లేవాడు. పక్కనే మేము ఉంటే కూడా తినడానికి తీసుకెళ్లేవాడు. మాకు కూడా గారెలు, చికెన్ తెప్పించే వాళ్ళు. 

ఆయన ఒక మంచి కోడిని ఎదురుగా పెట్టుకొని తినేవాళ్లు. నేను జరిగిందే చెప్తున్నాను. ఆయన మాట్లాడిన ప్రతి మాట వైరల్ అయ్యేది అప్పట్లో సోషల్ మీడియా ఉంటే. ఆయన గొప్ప వ్యక్తి. ఆయనలా ఉండాలి అని అనుకున్నాను. ఆయనలా ఉదయాన్నే లేచి పూజ చేసుకొని సినిమా చేశాను చికెన్ ఒక్కటే తినలేదు కాబట్టి ఆ మాట చెప్పాను అంతే. రామారావు గారి మీదున్న అంతులేని అభిమానంతోనే ఆ మాటలు నేను సరదాగా అన్నాను. మా నాన్న గారు, రామారావు గారికి మంచి అనుబంధం ఉంది. మా నాన్న గారికి రామారావు గారితో సినిమా చేసే ఛాన్స్ వచ్చినా చివరి నిమిషంలో ఎన్నికల వల్ల మిస్ అయింది. ఆయన నిబద్దత, క్రమశిక్షణను దగ్గర్నుండి చూశాను. ఎన్టీఆర్ గారి ఆత్మ మాత్రం నన్ను ట్రోల్ చేయదు. మిగతా ఎవరు ట్రోల్ చేసినా నాకు పర్లేదు’ అని ఎం.ఎస్‌ రాజు అన్నారు. 

‘అగధ’ విషయానికొస్తే.. శ్రీ ఆదివరాహ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అజయ్ కేఆర్ సమర్పణలో కాశీ విశాలాక్షి బలుసు నిర్మించిన ఈ చిత్రంలో కామాక్షి భాస్కర్ల, శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా విజయ్‌కుమార్, భాను చందర్ కీలక పాత్రలు పోషించారు. ఆగస్ట్‌ 14న ఈ చిత్రం విడుదల కానుంది. 

Videos

భారతి సిమెంట్స్ కేసులో కూటమి ప్రభుత్వానికి గట్టి షాకిచ్చిన హైకోర్టు

చిరు NEXT మూవీ టైటిల్ లీక్.. వద్దు వద్దు అంటున్న ఆపుకోలేక నోరు జారిన చిరంజీవి

ఆ సీఐ చుట్టూ కూటమి రాజకీయం..!

LB నగర్ పీఎస్ లో కానిస్టేబుల్ ఆత్మహత్య

కేకును కోస్తే అరెస్ట్ చేసి నడి రోడ్డుపై నడిపించారు.. మెడికల్ విద్యార్థిని ప్రియాంకను చంపేస్తే మాత్రం వారిని

నేడు MLA, MLCలతో వైఎస్ జగన్ కీలక సమావేశం

నా కాలు విరిగినా.. నా ప్రాణం పోతాదన్నా జగనన్న కోసం ఎలాంటి కష్టానైనా...

EVM ట్యాపరింగ్ జరిగిందో లేదో చంద్రబాబే చెప్పాలి..! ఉండవల్లి అరుణ్ కుమార్ షాకింగ్ కామెంట్స్

రాజమండ్రి పోలీసులు అందరూ ఎలాంటివారంటే..! డాక్టర్ ప్రియాంక ఘటనపై అడ్వకేట్ బాల కామెంట్స్

నా భర్తను అక్రమంగా అరెస్ట్ చేసి... సీదిరి అప్పలరాజు భార్య సంచలన వ్యాఖ్యలు

Photos

+5

హైదరాబాద్‌లో మొదలైన వినాయక చవితి 2026 సందడి (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ మూవీ టీజర్ రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

‘విశ్వనాథ్ & సన్స్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌...(ఫొటోలు)

+5

‘కొరియన్ కనకరాజు’ సక్సెస్ సెలబ్రేషన్స్‌...ముఖ్య అతిథిగా చిరంజీవి (ఫొటోలు)

+5

హాఫ్ శారీలో చిన్న పిల్లలా హీరోయిన్ నభా నటేశ (ఫొటోలు)

+5

ఫైరింగ్ కియారా.. అందం ఏ మాత్రం తగ్గలే (ఫొటోలు)

+5

ఐశ్వర్య రాజేశ్ ఇంతలా మారిపోయిందేంటి? (ఫొటోలు)

+5

యంగ్ హీరోతో నయన్ లవ్ పోజులు (ఫొటోలు)

+5

‘అగధ’ మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్ (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం క్యూట్ ఫ్యామిలీ.. వెకేషన్ (ఫొటోలు)