అగ్నివీర్‌గా స్టార్ నటుడి కుమార్తె.. ఎవరో తెలుసా?

Published on Tue, 08/11/2026 - 16:38

సినిమా ఇండస్ట్రీలోకి సినీ స్టార్స్‌ ఫ్యామిలీ నుంచి చాలామంది ఎంట్రీ ఇవ్వడం మనం చూస్తుంటాం. మన పిల్లలు కూడా తల్లిదండ్రులను ఫాలో అవుతుంటారు. ముఖ్యంగా సినిమాల్లోకి వచ్చేవారు దాదాపు సినీ నేపథ్యం ఉన్న కుటుంబాల నుంచే వస్తుంటారు. అది మన టాలీవుడ్‌లో కాస్తా ఎక్కువగానే ఉంటుంది.

కానీ అందుకు భిన్నంగా ఓ షాకింగ్ డెసిషన్ తీసుకుంది స్టార్ నటుడి కుమార్తె. ఆమె మరెవరో కాదు.. రేసుగుర్రంలో విలన్‌గా మెప్పించిన రవికిషన్ కూతురు. బాలీవుడ్ నటుడు రవి కిషన్ కుమార్తె ఇషితా శుక్లా ఇండస్ట్రీని కాదని విభిన్నమైన కెరీర్‌ ఎంచుకుంది. అగ్నివీర్‌గా రక్షణ దళంలో చేరారు. తండ్రిలా కాకుండా డిఫరెంట్‌ కెరీర్‌ను ఎంచుకుంది.

రవి కిషన్ కుమార్తె అయిన ఇషితా శుక్లాకు చిన్న వయసులోనే ‍ఆర్మీలో పని చేయాలన్న ఆసక్తి పెరిగింది.  బాలీవుడ్‌కు వెళ్లకుండా.. నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఎన్‌సీసీ)లో చేరారు. ఆ తర్వాత సైనిక శిక్షణ పొంది రక్షణ రంగంలో పనిచేసేందుకు సిద్ధమైంది. ఇషిత ఢిల్లీ డైరెక్టరేట్‌కు చెందిన 7 గర్ల్స్ బెటాలియన్‌లో పనిచేశారు. కర్తవ్య పథ్‌లో గణతంత్ర దినోత్సవ పరేడ్ కోసం కూడా శిక్షణ తీసుకున్నారు. కాగా.. ఇషిత శుక్లా 2023లో అగ్నివీర్‌గా చేరినట్లు తెలుస్తోంది. దీంతో దేశానికి సేవ చేయాలన్న ఇషిత నిర్ణయాన్ని అనుపమ్ ఖేర్‌తో సహా పలువురు ప్రముఖులు ప్రశంసించారు.
 

Videos

భారతి సిమెంట్స్ కేసులో కూటమి ప్రభుత్వానికి గట్టి షాకిచ్చిన హైకోర్టు

చిరు NEXT మూవీ టైటిల్ లీక్.. వద్దు వద్దు అంటున్న ఆపుకోలేక నోరు జారిన చిరంజీవి

ఆ సీఐ చుట్టూ కూటమి రాజకీయం..!

LB నగర్ పీఎస్ లో కానిస్టేబుల్ ఆత్మహత్య

కేకును కోస్తే అరెస్ట్ చేసి నడి రోడ్డుపై నడిపించారు.. మెడికల్ విద్యార్థిని ప్రియాంకను చంపేస్తే మాత్రం వారిని

నేడు MLA, MLCలతో వైఎస్ జగన్ కీలక సమావేశం

నా కాలు విరిగినా.. నా ప్రాణం పోతాదన్నా జగనన్న కోసం ఎలాంటి కష్టానైనా...

EVM ట్యాపరింగ్ జరిగిందో లేదో చంద్రబాబే చెప్పాలి..! ఉండవల్లి అరుణ్ కుమార్ షాకింగ్ కామెంట్స్

రాజమండ్రి పోలీసులు అందరూ ఎలాంటివారంటే..! డాక్టర్ ప్రియాంక ఘటనపై అడ్వకేట్ బాల కామెంట్స్

నా భర్తను అక్రమంగా అరెస్ట్ చేసి... సీదిరి అప్పలరాజు భార్య సంచలన వ్యాఖ్యలు

Photos

+5

హైదరాబాద్‌లో మొదలైన వినాయక చవితి 2026 సందడి (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ మూవీ టీజర్ రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

‘విశ్వనాథ్ & సన్స్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌...(ఫొటోలు)

+5

‘కొరియన్ కనకరాజు’ సక్సెస్ సెలబ్రేషన్స్‌...ముఖ్య అతిథిగా చిరంజీవి (ఫొటోలు)

+5

హాఫ్ శారీలో చిన్న పిల్లలా హీరోయిన్ నభా నటేశ (ఫొటోలు)

+5

ఫైరింగ్ కియారా.. అందం ఏ మాత్రం తగ్గలే (ఫొటోలు)

+5

ఐశ్వర్య రాజేశ్ ఇంతలా మారిపోయిందేంటి? (ఫొటోలు)

+5

యంగ్ హీరోతో నయన్ లవ్ పోజులు (ఫొటోలు)

+5

‘అగధ’ మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్ (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం క్యూట్ ఫ్యామిలీ.. వెకేషన్ (ఫొటోలు)