Breaking News

H-1B వీసాదారులకు అమెరికా బిగ్ షాక్!

Published on Sat, 08/08/2026 - 20:23

అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న విదేశీయులకు.. ప్రస్తుతం ఉన్న 60 రోజుల గ్రేస్ పీరియడ్‌ను తొలగించే ప్రతిపాదనను అక్కడి ప్రభుత్వం పరిశీలిస్తోంది. సాధారణంగా.. కొన్ని నాన్ ఇమిగ్రెంట్ వీసాలపై ఉన్న ఉద్యోగి తన ఉద్యోగాన్ని కోల్పోతే, వెంటనే అమెరికా నుంచి వెళ్లాల్సిన అవసరం లేదు. కొత్త ఉద్యోగం వెతుక్కోవడానికి 60 రోజుల వరకు సమయం ఉంటుంది. కానీ.. కొత్త ప్రతిపాదన అమల్లోకి వస్తే ఉద్యోగం పోయిన వెంటనే యూఎస్ విడిచి వెళ్లాల్సి వస్తుంది.

60 రోజుల గ్రేస్ పీరియడ్‌ను తొలగించే ప్రతిపాదనను.. అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ తీసుకొచ్చింది. ప్రస్తుతం ఇది ఫెడరల్ ఆఫీస్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ బడ్జెట్ పరిశీలనలో ఉంది. నిజానికి.. 2017లో ఈ 60 రోజుల గ్రేస్ పీరియడ్‌ను తీసుకొచ్చారు. ఉద్యోగం కోల్పోయిన విదేశీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు కొత్త ఉద్యోగం వెతుక్కోవడానికి ఇది ఉపయోగపడుతోంది. ప్రస్తుతం H-1Bతో పాటు E-1, E-2, E-3, H-1B1, L-1, O-1, TN వంటి కొన్ని వీసా కేటగిరీలకు ఈ నిబంధన వర్తించే అవకాశం ఉంది.

ఒకవేళ గ్రేస్ పీరియడ్‌ను తొలగిస్తే.. ఉద్యోగం కోల్పోయిన విదేశీ ఉద్యోగులు, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులు వెంటనే అమెరికా విడిచి వెళ్లాల్సి వస్తుంది. ఉద్యోగం పోతే.. అక్కడే ఉండి కొత్త ఉద్యోగం వెతుక్కోవడం అంత సులభం కాదు. అలాగే.. అమెరికాలోనే ఉండి కొత్త కంపెనీకి మారడం లేదా వీసా స్టేటస్ మార్చుకోవడం కూడా ఇబ్బందికరంగా మారవచ్చు. అయితే.. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో USCIS మినహాయింపు ఇచ్చే అవకాశం ఉంటుంది.

ఈ ప్రతిపాదన భారతీయులపై ప్రభావం చూపనుంది. ఎందుకంటే.. అమెరికాలో H-1B వీసాల ద్వారా పనిచేస్తున్న వారిలో భారతీయులు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. 2024 ఆర్థిక సంవత్సరంలో H-1B దరఖాస్తుల్లో భారతీయుల వాటా 71 శాతంగా ఉంది. కాబట్టి ఉద్యోగం కోల్పోయిన భారతీయులకు 60 రోజుల సమయం లేకపోతే.. కొత్త ఉద్యోగం వెతుక్కోవడం మరింత కష్టమవుతుంది. అమెరికా విడిచి రావాల్సి ఉంటుంది.

ఇదీ చదవండి: UPI ఛార్జీలపై కేంద్రం కీలక ప్రకటన!

Videos

ఆ కోపంతోనే కారుతో ప్రియాంకను ఢీకొట్టారు

నువ్వు బిరియాని కనిపెడితే ఇరానీలు ఏం చేసినట్లు? బాబుపై బుగ్గన సెటైర్లే సెటైర్లు

DSCలో అంధుడిని మోసం చేసిన లోకేష్

షూస్ వేసుకొని వెంకన్న విగ్రహం తీసుకున్న కేంద్ర మంత్రి పెమ్మసాని

దిశా చట్టాన్ని పేరు మార్చి అయినా చట్టాన్ని అమలు చెయ్.. అనితకు వరుదు కళ్యాణి సూచన

రఫేల్ ది గేమ్ చేంజర్

నీ కంటే అడుక్కున్నవాడు నయం..! బాబు,లోకేష్ ని ఏకిపారేసిన లక్ష్మీ పార్వతి

అన్యాయం జరిగిన వారికి ఉద్యోగాలు ఇవ్వాల్సిందే

లోన్ తీసుకున్నారా? ఇక EMI వేధింపులు ఉండవు

కండిషన్ క్రిటికల్ చివరి ప్రయత్నాలు

Photos

+5

ప్రెగ్నెన్సీతో సమంత.. ఆగస్టు ఎనర్జీతో ఇలా (ఫొటోలు)

+5

వేశ్య పాత్రలో అదరగొట్టిన వామికా గబ్బి.. ఈ బ్యూటీ బ్యాగ్‌గ్రౌండ్‌ తెలుసా? (ఫొటోలు)

+5

సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ HD స్టిల్స్

+5

హైదరాబాద్ : అమ్మవారికి బంగారు బోనం సమర్పించిన కొణిదెల నిహారిక .. ఫొటోలు వైరల్

+5

హైదరాబాద్ లో సందడి చేసిన ‘కాంతారా’ ఫేమ్‌ రుక్మిణి వసంత్‌ (ఫొటోలు)

+5

‘కొరియన్‌ కనకరాజు’ సినిమా సక్సెస్‌ సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

విజయ్ విడాకుల కేసులో ట్విస్ట్.. ట్రెండింగ్‌లో ఫ్యామిలీ ఫోటోలు

+5

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్‌లో బోనాల పండుగ (ఫొటోలు)

+5

ఒంగోలు : భక్తితో వేల్ కావడి ఉత్సవం (ఫొటోలు)

+5

'కనకరాజు'తో హ్యాట్రిక్ కొట్టిన రితికా నాయక్ (ఫొటోలు)