Breaking News

ఫేక్‌ఆట కట్టించే లా

Published on Sat, 08/08/2026 - 04:36

ఒకప్పుడు సెలబ్రిటీల చుట్టూ మాత్రమే తిరిగిన ‘డీప్‌ఫేక్‌’ విష సర్పం... ఇప్పుడు సామాన్యుల జీవితాల్లోకి కూడా వచ్చింది. స్విచ్‌ వేసి లైట్‌ వెలిగించినంత తేలిగ్గా  ‘మాయా సాంకేతికత’  అందుబాటులోకి వచ్చింది. డీప్‌ఫేక్‌ దెబ్బకు...పచ్చని సంసారాల్లో చిచ్చు రేగుతుంది. పీటల మీద పెళ్లి ఆగిపోతుంది. 

ఒక్కటా... రెండా... ఎన్నో ఎన్నెన్నో! ఏ.ఐ. టెక్నాలజీ సృష్టించిన డీప్‌ఫేక్, హానికరమైన సింథటిక్‌ కంటెంట్‌కు మరింత పకడ్బందీగా అడ్డుకట్ట వేయడానికి కేంద్రప్రభుత్వం నడుం బిగించింది. డీప్‌ఫేక్‌ డిటెన్షన్‌ టెక్నాలజీని అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టింది. పదమూడు ఏఐ రెస్పాన్సిబిలిటీ ప్రాజెక్ట్‌లకు ఆమోదం తెలిపింది...

డీప్‌ఫేక్‌ కంటెంట్‌ వ్యాప్తిని అరికట్టడానికి భారత ఎలక్ట్రానిక్స్‌–ఇన్‌ఫర్‌మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వశాఖ మెటా, ఎక్స్‌లాంటి సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లను దృష్టిలో పెట్టుకొని కఠినమైన నియమాలను రూ΄÷ందించింది. ‘ఏఐ వాడకం పెరగడం వల్ల నకిలీ ఫొటోలు, వీడియోలు, ఆడియోలను సృష్టించడం సులువైంది. వీటిని సైబర్‌ నేరాలకు కూడా ఉపయోగిస్తున్నారు. డీప్‌ఫేక్‌లకు అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వం ఇప్పటికే ఉన్న చట్టాలను పటిష్టం చేసింది. ఇన్‌ఫర్‌మేషన్‌ టెక్నాలజీ (ఇంటర్మీడియటరీ గైడ్‌లైన్స్‌ అండ్‌ డిజిటల్‌ మీడియా ఎథిక్స్‌ కోడ్‌–2021)ని సవరించింది’ అంటున్నారు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ సహాయ మంత్రి జితిన్‌ ప్రసాద్‌.

వేగంగా చర్యలు తీసుకోవచ్చు
చట్టవిరుద్ధమైన ఏఐ కంటెంట్‌పై ఇకపై ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌లు వేగంగా చర్యలు తీసుకోవచ్చు. గతంలో ఉన్న 36 గంటల గడువుకు బదులుగా, మూడు గంటల లోపే తొలగించాలి. చట్ట విరుద్ధమైన ఏఐ కంటెంట్‌ను గుర్తించడానికి, ఆటోమేటెడ్‌ సాధనాలతో సహా తగిన సాంకేతిక చర్యలను అమలు చేయాలని ప్రభుత్వం సోషల్‌ మీడియా కంపెనీలను కోరింది. సవరించిన నిబంధనల ప్రకారం ఏఐ ద్వారా రూ΄÷ందించిన కంటెంట్‌ను స్పష్టంగా లేబుల్‌ చేయాలి. సింథటిక్‌ కంటెంట్‌ను మరింత సులభంగా గుర్తించడానికి ఇది ఉపయోగపడుతుంది. డీప్‌ఫేక్‌ల ద్వారా ప్రజలు తప్పుదోవ పట్టే అవకాశాలను తగ్గిస్తుంది.

‘సాక్ష్య’ సహకారంతో...
నియంత్రణా పరమైన మార్పులతో ΄ాటు డీప్‌ఫేక్‌ డిటెన్షన్‌ టెక్నాలజీని మెరుగుపరచడానికి విద్యాసంస్థలలో పదమూడు ‘రెస్పాన్సిబుల్‌ ఏఐ’ ప్రాజెక్ట్‌లను ప్రభుత్వం ఆమోదించింది. ఐఐటీ, జో«ద్‌పూర్, ఐఐటీ, మద్రాస్‌ అభివృద్ధి చేస్తున్న మల్టీ– ఏజెంట్‌ డీప్‌ఫేక్‌ డిటెక్షన్‌ ఫ్రేమ్‌వర్క్‌ ‘సాక్ష్య’ ఈ కార్యక్రమాలలో కీలకమైనది. మరొక ప్రాజెక్ట్‌...ఏఐ విశ్లేషక్‌. నకిలీ ఆడియో, వీడియోలను గుర్తించడానికి దీన్ని రూ΄÷ందించారు. మీడియాఫైళ్లను విశ్లేషించడానికి, వాటిని తారుమారు చేశారా అనేది తెలుసుకోవడానికి ‘ఏఐ విశ్లేషక్‌’ ఉపయోగపడుతుంది. ఐఐటీ, ఖరగ్‌పూర్‌ రియల్‌–టైమ్‌ వాయిస్‌ డీప్‌ఫేక్‌ డిటెన్షన్‌ సిస్టమ్‌పై పనిచేస్తోంది. ఏఐ సృష్టించిన మాటలను ఇది గుర్తించగలదు. తద్వారా వాయిస్‌ స్కామ్‌లు, ఆర్థిక మోసాలు జరగకుండా నిరోధించవచ్చు.

యూట్యూబ్‌ లైక్‌ డిటెక్షన్‌
ఏఐ–ఆధారిత పోలికను గుర్తించే ్రపోగ్రామ్‌కు 18 ఏళ్లు పైబడిన యూజర్‌లు అందరికీ యాక్సెస్‌ విస్తరిస్తున్నట్లు యూట్యూబ్‌ ప్రకటించింది. దీంతో తమ పోలికతో ఏఐ ద్వారా సృష్టించబడిన డీప్‌ఫేక్‌లపై చర్య తీసుకోవచ్చు. యూట్యూబ్‌లోని లైక్‌ డిటెక్షన్‌ టూల్‌ అనేది పోలికలను కనిపెడుతుంది. ఒకవేళ ఈ టూల్‌ పోలిక కనుగొంటే, ఎవరి పోలిక అయితే గుర్తించబడిందో ఆ యూజర్‌కు ఒక హెచ్చరిక(అలర్ట్‌) పంపబడుతుంది. దీంతో ఆ కంటెంట్‌ను తొలగించమని యూట్యూబ్‌ను అభ్యర్థించే అవకాశం బాధితులకు దొరుకుతుంది. సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఏఐ ద్వారా సృష్టించబడిన చాలా డీప్‌ఫేక్‌లు సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, ఇతర ప్రముఖులను లక్ష్యంగా చేసుకున్నప్పటికీ సామాన్యులకు సంబంధించి కూడా ఇది ఆందోళన కలిగిస్తుంది. ఈ నేపథ్యంలో వారికి లైక్‌ డిటెక్షన్‌ టూల్‌ ఉపయోగపడుతుంది.

ఎలా గుర్తించవచ్చు?
డీప్‌ఫేక్‌ కొత్తగా వచ్చిన రోజుల్లో ఆ సాంకేతికత పరిపూర్ణంగా ఉండేది కాదు. తారుమారు చేసినట్లు స్పష్టమైన సంకేతాలు చూపించేది. వీడియోలలో కనిపించే వ్యక్తులు అసహజంగా కనురెప్పలు ఆర్పడం లాంటివి అందులో ఒకటి. తరువాత రోజుల్లో టెక్నాలజీ మెరుపడడంతో డీప్‌ఫేక్‌లను గుర్తించడం కష్టమైంది. అయినప్పటికీ కొన్ని సంకేతాలతో వాటిని గుర్తించవచ్చు అంటున్నారు నిపుణులు...

→ సహజత్వం లోపించిన డీప్‌ఫేక్‌ ఫొటోలు ఎలక్ట్రానిక్‌ మెరుపును కలిగి ఉంటాయి → చిత్రంలోని వ్యక్తి స్పష్టమైన ఫోకస్‌లో ఉంటాడు. బ్యాక్‌గ్రౌండ్‌లోని అంశాలు వాస్తవికంగా అనిపించవు 
→ సాధారణ డీప్‌ఫేక్‌ పద్ధతులలో ముఖాలను మార్చడం 
ఫేస్‌–స్వాపింగ్‌) ఒకటి. ముఖం అంచులను నిశితంగా చూడాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. ముఖంలోని చర్మపు రంగు శరీరంలోని మిగిలిన భాగంతో సరిపోలుతుందా? ముఖం అంచులు స్పష్టంగా ఉన్నాయా లేదా చూడాలి 
→ వీడియోలో ఉన్న వ్యక్తి పెదాల కదలికలు ఆడియోతో ఖచ్చితంగా సరిపోలుతున్నాయా... లేదా అనేది చూడాలి 
→ పళ్లు సహజంగా ఉన్నాయా... అసహజంగా ఉన్నాయా అనేది పరిశీలించాలి. సైబర్‌ సెక్యూరిటీ కంపెనీ నార్టన్‌ ప్రకారం ఒక్కోపంటిని సృష్టించేంత అధునాతనమైన అల్గారిథమ్‌లు ఇంకా అభివృద్ధి చెందలేదు 
→ ఫొటోలు లేదా వీడియోలు మార్ఫింగ్‌ చేయబడ్డాయా లేదా అనేది తెలుసుకోవడానికి మైక్రోసాఫ్ట్‌ ఒక అథంటికేటర్‌ టూల్‌ను అభివృద్ధి చేసింది. చిప్‌ మేకర్‌ ఇంటెల్‌ ‘ఫేక్‌క్యాచర్‌’ ఫొటో లేదా వీడియో నిజమైనదా కాదా అని తెలుసుకోవడానికి, పిక్సెళ్ళను విశ్లేషించడానికి అల్గారిథమ్‌లను ఉపయోగిస్తుంది.

Videos

ఆ కోపంతోనే కారుతో ప్రియాంకను ఢీకొట్టారు

నువ్వు బిరియాని కనిపెడితే ఇరానీలు ఏం చేసినట్లు? బాబుపై బుగ్గన సెటైర్లే సెటైర్లు

DSCలో అంధుడిని మోసం చేసిన లోకేష్

షూస్ వేసుకొని వెంకన్న విగ్రహం తీసుకున్న కేంద్ర మంత్రి పెమ్మసాని

దిశా చట్టాన్ని పేరు మార్చి అయినా చట్టాన్ని అమలు చెయ్.. అనితకు వరుదు కళ్యాణి సూచన

రఫేల్ ది గేమ్ చేంజర్

నీ కంటే అడుక్కున్నవాడు నయం..! బాబు,లోకేష్ ని ఏకిపారేసిన లక్ష్మీ పార్వతి

అన్యాయం జరిగిన వారికి ఉద్యోగాలు ఇవ్వాల్సిందే

లోన్ తీసుకున్నారా? ఇక EMI వేధింపులు ఉండవు

కండిషన్ క్రిటికల్ చివరి ప్రయత్నాలు

Photos

+5

ప్రెగ్నెన్సీతో సమంత.. ఆగస్టు ఎనర్జీతో ఇలా (ఫొటోలు)

+5

వేశ్య పాత్రలో అదరగొట్టిన వామికా గబ్బి.. ఈ బ్యూటీ బ్యాగ్‌గ్రౌండ్‌ తెలుసా? (ఫొటోలు)

+5

సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ HD స్టిల్స్

+5

హైదరాబాద్ : అమ్మవారికి బంగారు బోనం సమర్పించిన కొణిదెల నిహారిక .. ఫొటోలు వైరల్

+5

హైదరాబాద్ లో సందడి చేసిన ‘కాంతారా’ ఫేమ్‌ రుక్మిణి వసంత్‌ (ఫొటోలు)

+5

‘కొరియన్‌ కనకరాజు’ సినిమా సక్సెస్‌ సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

విజయ్ విడాకుల కేసులో ట్విస్ట్.. ట్రెండింగ్‌లో ఫ్యామిలీ ఫోటోలు

+5

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్‌లో బోనాల పండుగ (ఫొటోలు)

+5

ఒంగోలు : భక్తితో వేల్ కావడి ఉత్సవం (ఫొటోలు)

+5

'కనకరాజు'తో హ్యాట్రిక్ కొట్టిన రితికా నాయక్ (ఫొటోలు)