Breaking News

కామాంచి/కాశబుడ్డ.. గుండె జబ్బులను అరికట్టడంలో ఫస్ట్‌!

Published on Fri, 08/07/2026 - 04:51

ఈ పండ్ల జాతిలో నల్ల కామాంచి, ఎరుపు కామంచి రకాలు ఉంటాయి. ఇవి మాత్రం గుల్మములు. వీటి జీవిత కాలం చాలా తక్కువ. పండ్లు మాత్రం బఠాణీ గింజంత ఉంటాయి. నలుపు, ఎరుపురంగుతో కూడుకుని గుత్తులుగా ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ మొక్క అన్ని భాగాలు ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి. ఎక్కువగా వర్షాకాలంలో పూత పండ్లు వస్తుంటాయి. చలికాలంలో కొంతవరకు పూత–పండ్లు కాస్తాయి. సామాన్యంగా దీన్ని యూరోపియన్‌ బ్లాక్‌ షేడ్, బ్లాక్‌ బెర్రి నైట్‌ షేడ్‌ అని అంటారు. వీటి కుటుంబంలో 2000–3000 ప్రజాతులు ఉంటాయని అంచనా.

ఉనికి...
కామంచి సహజంగా పరపరాగ సంపర్కం చెందే పండ్ల జాతి. ఈ రకాలతో సంబంధం ఉన్న మొక్కలు – సొలానం నైగ్రం, సొలానం అమెరికానం, సొలానం డొగ్లాస్, సొలానం ఒపకు, సొలానం పిచాంతం, సొలానం రిట్రోప్లెక్జం, సొలానం సర్రచోడైస్, సొలానం స్కబ్రం, సొలానం విల్లోసం. ఈ మొక్కల పొదలు ఎక్కువగా అడవులు, పెంటకుప్పలు, రోడ్ల వెంబడి మొదలగు ప్రాంతాల్లో పెరుగుతుంటాయి. ఈ మొక్కలు అర మీటరు కంటే ఎక్కువ ఎత్తు పెరగవు. సపోర్ట్‌ ఉన్న దగ్గర నేల సారం బాగా ఉన్నచోట్ల ఇంకొంత పెరగగలవు.

శీతల ప్రదేశాలు మొదలుకొని ఉష్ణమండలం వరకు దాదాపు సముద్ర మట్టానికి 3,500 మీటర్ల ఎత్తు వరకు ఉండే ప్రాంతాల్లో ఈ మొక్కల ఉనికి ఉంది. దీని స్వస్థలం యూరాసియా. అక్కడి నుంచి అమెరికాకు, ఆస్ట్రేలియా, సౌత్‌ ఆఫ్రికాకు వెళ్ళిందని చరిత్ర చెతున్నది. ఇంచుమించు ప్రపంచంలోని అనేక దేశాల్లో వీటి ఉనికి ఉన్నదనవచ్చు. ఇండియాలోని అన్ని రాష్ట్రాల్లో ఈ మొక్కలు కనిపిస్తాయి. ఒకప్పుడు నల్లమలలోని చెంచు పెంటల (చెంచు నివాసాల) దగ్గర బాగా ఉండేవని వాళ్ళు చె΄్పారు. కానీ, ఇప్పుడు వీటి ఉనికి చాలా తగ్గిందని వాపోతున్నారు. అందుకు అనేక కారణాలు ఉన్నాయంటారు.

ఉపయోగాలు...

  • కామంచి పండ్లు తినదగినవి. రుచిలో పులుపు తీపితో కూడుకొని ఉంటాయి.

  • ఇది యాంటిసెప్టిక్‌ గా ఉపయోగ పడుతుంది. అలాగే దగ్గు, జ్వరం, ఆస్తమా నివారణకు మంచి ఔషధం అని చెప్పవచ్చు.

  • ఇది విరేచనకారిగా, జీర్ణకారిగాను పనిచేస్తుంది. అల్సర్లు, అజీర్తి, నిసత్తువ వంటి లక్షణాలను తగ్గిస్తుంది.

  • మూత్ర విసర్జన సక్రమంగా అయ్యేలా ఉపయోగపడుతుంది.

  • గుండె జబ్బులను అరికట్టడానికి మంచిగా పనిచేస్తుంది. నీళ్ళతో కడిగిన మొక్కను, శుభ్రంగా తుడిచి, దాన్ని నీళ్ళలో మరగనిచ్చి, వడకాచి తాగితే గుండెకు సంబంధించిన సమస్యలు తగ్గుతాయని నమ్మకం. అలాగే రక్తపోటునూ నియంత్రించగలదంటారు.

  • కడుపు నొప్పి, టాన్సిల్స్, వింగ్‌ వాయ్స్, గడ్డలు, వాపు మొదలగునవి తగ్గించటానికి వాడతారు. 

  • దీని ఆకులను దంచి రసం తీసి, సెప్టిక్‌ అయిన దెబ్బలపైన రెండు–మూడు రోజులు పూస్తే పుండు మానిపోతాయి.

  • కొన్ని ఆఫ్రికా దేశాల్లో కూడా కామంచి పండ్లను తింటారు. ఆకులను ఉడకబెట్టి అందులో ఉప్పు, ఇతర దినుసులు వేసి మొక్కజొన్నతో చేసిన ఆహారంతో కలిపి తింటారు. ఎక్కువగా కెన్యా దేశ ప్రజలు ఈ విధంగా తింటారు. టాంజనియా దేశంలో కామంచి ఆకులను మంచి ఆకుకూరగా వాడుతారు.

  • ఇథియోపియాలో ఈ పండ్లను అందరూ తింటారు. కరువు కాలంలో ఈ పండ్లను చాలా ఉపయోగిస్తారు. అలాగే ఆకులను ఆకుకూరలా వాడతారు.

  • బహుశా అందుకేనేమో ఈ మొక్కకు ‘ఫెమైన్‌ ఫుడ్‌’గా గుర్తింపు వచ్చింది.

  • దక్షిణ భారతంలో తమిళనాడులో జనం ఎక్కువగా ఇష్ట పడతారు.

  • ఇన్ని ప్రత్యేకతలున్న కామంచి పండ్లపై సరైన పరిశోధనలు చేసి పంట పొలాలు, మిద్దె తోటలకు పాకే విధంగా చేయగలిగితే ఆరోగ్యపరంగా ఎంతో లబ్ది పొందడానికి వీలు ఉంటుంది. నల్లమలలో ఉన్న ఈ మొక్కలకు ప్రత్యేకత ఉందన్నది అక్కడి జనాల అనుభవం. వీటితో పాటు థయామిన్, రిబోఫ్లేవిన్, నియాసినమైడ్, పైరిడాక్షిన్, ఫోలిక్‌ ఆమ్లం, ఆర్కర్బి ఆమ్లం, బీటా కరొటీన్‌ మొదలైన విటమిన్లు ఉన్నాయి.

సూచన...  కామంచి కాయలు, ఆకులు క్షారంగా ఉంటాయి. వీటిని తింటే వాంతులు, జ్వరం, విరేచనాలు రావచ్చు. అందుకే కొన్ని ప్రాంతాల్లో ఈ కాయలు, ఆకులను ఉడికించి తింటారు.

- డాక్టర్‌ మొరుపోజు పద్మయ్య, విశ్రాంత ప్రధాన శాస్త్రవేత్త, ఐసీఏఆర్‌ – ఐఐఓఆర్, రాజేంద్రనగర్, హైదరాబాద్‌. మొబైల్‌: 94407 08924

నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్‌

Videos

ఆ కోపంతోనే కారుతో ప్రియాంకను ఢీకొట్టారు

నువ్వు బిరియాని కనిపెడితే ఇరానీలు ఏం చేసినట్లు? బాబుపై బుగ్గన సెటైర్లే సెటైర్లు

DSCలో అంధుడిని మోసం చేసిన లోకేష్

షూస్ వేసుకొని వెంకన్న విగ్రహం తీసుకున్న కేంద్ర మంత్రి పెమ్మసాని

దిశా చట్టాన్ని పేరు మార్చి అయినా చట్టాన్ని అమలు చెయ్.. అనితకు వరుదు కళ్యాణి సూచన

రఫేల్ ది గేమ్ చేంజర్

నీ కంటే అడుక్కున్నవాడు నయం..! బాబు,లోకేష్ ని ఏకిపారేసిన లక్ష్మీ పార్వతి

అన్యాయం జరిగిన వారికి ఉద్యోగాలు ఇవ్వాల్సిందే

లోన్ తీసుకున్నారా? ఇక EMI వేధింపులు ఉండవు

కండిషన్ క్రిటికల్ చివరి ప్రయత్నాలు

Photos

+5

ప్రెగ్నెన్సీతో సమంత.. ఆగస్టు ఎనర్జీతో ఇలా (ఫొటోలు)

+5

వేశ్య పాత్రలో అదరగొట్టిన వామికా గబ్బి.. ఈ బ్యూటీ బ్యాగ్‌గ్రౌండ్‌ తెలుసా? (ఫొటోలు)

+5

సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ HD స్టిల్స్

+5

హైదరాబాద్ : అమ్మవారికి బంగారు బోనం సమర్పించిన కొణిదెల నిహారిక .. ఫొటోలు వైరల్

+5

హైదరాబాద్ లో సందడి చేసిన ‘కాంతారా’ ఫేమ్‌ రుక్మిణి వసంత్‌ (ఫొటోలు)

+5

‘కొరియన్‌ కనకరాజు’ సినిమా సక్సెస్‌ సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

విజయ్ విడాకుల కేసులో ట్విస్ట్.. ట్రెండింగ్‌లో ఫ్యామిలీ ఫోటోలు

+5

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్‌లో బోనాల పండుగ (ఫొటోలు)

+5

ఒంగోలు : భక్తితో వేల్ కావడి ఉత్సవం (ఫొటోలు)

+5

'కనకరాజు'తో హ్యాట్రిక్ కొట్టిన రితికా నాయక్ (ఫొటోలు)