Breaking News

ఇంటితోనే ఇంకో ఇల్లు కొనచ్చు: కియోసాకి కిటుకు

Published on Sun, 08/02/2026 - 13:24

ఇల్లు అంటే చాలా మందికి జీవితంలో అతిపెద్ద ఆస్తి. అయితే, అదే ఇంటిని తెలివిగా ఉపయోగించుకుంటే అదనపు ఆదాయాన్ని సమకూర్చే సాధనంగా మార్చుకోవచ్చని ప్రముఖ ఇన్వెస్టింగ్‌ గురూ, ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి చెబుతున్నారు. ఈ మేరకు ఆయన తన ఫేస్‌బుక్‌ పోస్ట్‌లో ఇంటిని విక్రయించకుండానే దానిలో ఉన్న ఈక్విటీని ఉపయోగించి ఆదాయాన్ని పెంచుకునే విధానాన్ని వివరించారు.

కియోసాకి వివరించిన విధానం ‘క్యాష్‌-అవుట్ రీఫైనాన్స్‌’. ఉదాహరణకు పదేళ్ల క్రితం ఓ వ్యక్తి 3 లక్షల డాలర్లకు ఇల్లు కొనుగోలు చేశాడని, అందులో 60 వేల డాలర్లు డౌన్‌పేమెంట్‌గా చెల్లించి, 2.4 లక్షల డాలర్ల రుణం తీసుకున్నాడని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ ఇంటి విలువ 5 లక్షల డాలర్లకు చేరి, ఇంటి రుణం 1.8 లక్షల డాలర్లకు తగ్గితే.. యజమానికి 3.2 లక్షల డాలర్ల ఈక్విటీ ఉన్నట్లవుతుందని వివరించారు.

ఈక్విటీలో కొంత భాగాన్ని నగదుగా మార్చుకునేందుకు రీఫైనాన్స్‌ చేసుకోవచ్చని కియోసాకి తెలిపారు. కొత్తగా 3 లక్షల డాలర్ల రుణం తీసుకుంటే పాత 1.8 లక్షల డాలర్ల రుణం చెల్లించిన తర్వాత 1.2 లక్షల డాలర్లు నగదుగా చేతికి వస్తాయని చెప్పారు. ఈ మొత్తాన్ని ఆదాయం అందించే ఆస్తిలో పెట్టుబడిగా పెట్టవచ్చని సూచించారు.

ఉదాహరణగా 4 లక్షల డాలర్లకు డ్యూప్లెక్స్‌ కొనుగోలు చేసి, 1.2 లక్షల డాలర్లను డౌన్‌పేమెంట్‌గా చెల్లిస్తే మిగిలిన మొత్తానికి బ్యాంకు రుణం తీసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. రెండు యూనిట్ల నుంచి నెలకు మొత్తం 3,600 డాలర్ల అద్దె వస్తే, రుణం, పన్నులు, బీమా, నిర్వహణ ఖర్చులు పోగా సుమారు 1,000 డాలర్ల నికర నగదు ప్రవాహం ఉండొచ్చని వివరించారు. అదే సమయంలో ఇంటి రీఫైనాన్స్‌ వల్ల నెలవారీ చెల్లింపు 800 డాలర్లు పెరిగినా.. అద్దె ఆస్తి నుంచి వచ్చే ఆదాయం దాన్ని అధిగమించవచ్చని తెలిపారు.

అద్దెదారులు చెల్లించే అద్దె ద్వారా రుణం కొంతవరకు తీరడం, రెండు ఆస్తుల్లో ఈక్విటీ పెరగడం, ఆస్తుల విలువ కాలక్రమంలో పెరిగే అవకాశం ఉండటం వంటి ప్రయోజనాలు ఉంటాయని కియోసాకి చెప్పారు. అలాగే, అమెరికాలోని పన్ను నిబంధనల ప్రకారం రుణంగా తీసుకున్న నగదుకు సాధారణంగా అమ్మకపు ఆదాయం తరహాలో పన్ను ఉండదని, అయితే పన్ను ప్రయోజనాలు వ్యక్తిగత పరిస్థితులపై ఆధారపడి ఉంటాయని పేర్కొన్నారు.

అయితే, ఈ వ్యూహంలో రిస్క్‌లు కూడా ఉన్నాయని కియోసాకి హెచ్చరించారు. అద్దెలు తగ్గడం, అద్దెదారులు చెల్లింపులు చేయకపోవడం, ఖాళీగా ఉండే కాలం పెరగడం, అనుకోని మరమ్మతు ఖర్చులు రావడం వంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు తగిన నగదు నిల్వలు ఉండాలని సూచించారు. రెండు రుణాల చెల్లింపులను కనీసం ఆరు నెలలపాటు భరించే సామర్థ్యం ఉందా అనే విషయాన్ని ముందుగానే పరిశీలించుకోవాలని చెప్పారు.

ఇదీ చదవండి: బెంగళూరులో ఇల్లు కొన్నానోచ్‌.. జెన్‌జీ ఆనందం!

ఇంట్లోని ఈక్విటీని అలాగే ఉంచడం కంటే ఆదాయం సృష్టించే ఆస్తుల్లోకి మళ్లించడం ద్వారా సంపదను పెంచుకోవచ్చన్నదే తన సూచన సారాంశమని కియోసాకి తెలిపారు. అయితే, తాను ఇచ్చిన లెక్కలు కేవలం విద్యాపరమైన సరళీకృత ఉదాహరణలు మాత్రమేనని, వాస్తవ రుణ వడ్డీరేట్లు, అద్దె ఆదాయం, నిర్వహణ ఖర్చులు, ఆస్తుల విలువ పెరుగుదల, పన్ను ప్రభావాలు ప్రాంతం, మార్కెట్ పరిస్థితులు, వ్యక్తిగత ఆర్థిక పరిస్థితులను బట్టి మారుతాయని ఆయన స్పష్టం చేశారు. పెట్టుబడి నిర్ణయాల ముందు ఆర్థిక సలహాదారు, పన్ను నిపుణులు, రియల్‌ ఎస్టేట్‌ నిపుణుల సలహా తీసుకోవాలని సూచించారు.

Videos

కామన్వెల్త్ లో భారత్ పతకాల పంట.. 13 స్వర్ణాలతో 4వ స్థానం..

మూవీ చూసి బాబాయ్ ఏం చెప్పాడంటే..

విరుపాక్షిని హత్య చేసే కుట్ర..! లోకేష్ ని వదిలిపెట్టం..

ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్ పై బుట్టా రేణుక స్ట్రాంగ్ రియాక్షన్

పెమ్మసాని పై అంబటి అదిరిపోయే సాంగ్

బాబుకు షాక్.. TDPపై జనసేన ఘన విజయం

మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించిన సీఎం రేవంత్

జూరాల వద్ద పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ

ఇరాన్ యుద్ధం పై ట్రంప్ కీలక నిర్ణయం..

విశాఖ యారాడ బీచ్ లో విషాదం..! అలల ఉధృతికి ఇద్దరు గల్లంతు

Photos

+5

Ujjaini Mahankali Bonalu : ఘనంగా సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహంకాళి బోనాలు (ఫోటోలు)

+5

ఫ్రెండ్‌షిప్ డే స్పెషల్.. దోస్తులతో మంచు లక్ష్మీ (ఫొటోలు)

+5

కాశీ పరమేశ్వరుడి సేవలో ధనశ్రీ వర్మ (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఆగస్టు 02- 09)

+5

శ్రీవారి సేవలో యాంకర్ లాస్య-మంజునాథ్ జంట(ఫోటోలు)

+5

బ్లాక్‌ డ్రెస్‌లో దివ్య పిళ్లై స్టన్నింగ్‌ లుక్స్‌ (ఫోటోలు)

+5

చీరలో సంయుక్త.. ఎంత అందంగా ఉందో(ఫోటోలు)

+5

బ్లాక్ శారీలో మెరిసిన కాయదు లోహర్.. ఫోటోలు

+5

లండన్ ట్రిప్‌లో వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

మిల మిల మెరిసిన 'చెన్నై లవ్ స్టోరీ' తార (ఫొటోలు)