కామన్వెల్త్ లో భారత్ పతకాల పంట.. 13 స్వర్ణాలతో 4వ స్థానం..
Breaking News
ఓటీటీలోకి రష్మిక కొత్త సినిమా...స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
Published on Sun, 08/02/2026 - 12:06
షాహిద్ కపూర్, రష్మిక, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘కాక్‌టెయిల్ 2’.హోమీ అదజానియా దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూన్ 19న థియేటర్స్‌లో విడుదలై..మంచి విజయం సొంతం చేసుకుంది. ఇప్పుడీ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయింది. ఆగస్ట్ 14 నుంచి ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది.
కాక్ టెయిల్ 2 కథేంటంటే..
కునాల్ (షాహిద్ కపూర్), దియా (రష్మిక మందన్న) ఇద్దరు లివ్ ఇన్ రిలేషన్‌లో ఉంటారు. ఓ సారి కునాల్, దియా ఫారిన్‌లో వెకేషన్‌కు వెళ్లినప్పుడు అక్కడ దియా బెస్ట్‌ఫ్రెండ్ యాలీతో కునాల్‌కి పరిచయం ఏర్పడుతుంది. అయితే కునాల్‌పై యాలీ క్రష్ పెంచుకోవడమే కాకుండా ఓ సమయంలో అతడితో శారీరకంగా కలుస్తారు. ఈ విషయం దియాకు తెలిసిన తర్వాత ఏం జరిగింది? కునాల్, దియా మధ్యకు యాలీ ఎలా వచ్చింది? దియాతో డేటింగ్ చేస్తున్నప్పటికీ.. యాలీ ఎలా దగ్గరైంది? చివరకు కునాల్ ఎవరినీ పెళ్లి చేసుకొన్నాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
Tags : 1