Breaking News

రోడ్డుపై, కాలేజీ గోడలపై అలా రాశాడు.. భయపడిపోయా: నటి

Published on Sun, 08/02/2026 - 10:23

కాలేజీ రోజుల్లో తనకు ఎదురైన ఓ భయంకరమైన సంఘటన గురించి బుల్లితెర నటి శుభాంగి ఆత్రే తాజాగా ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకుంటూ ఎమోషనల్‌ అయ్యారు. ఆమె ఇంటర్‌ చదవుతున్న రోజుల్లో ఓ వ్యక్తి రోజు బైక్‌పై ఫాలో అయ్యేవాడని.. అతని చర్యలు చూసి భయపడిపోయానని శుభాంగి చెప్పింది.

‘నేను ఇండోర్‌లో 10-11వ తరగతి చదవుతున్నప్పుడు ఓ వ్యక్తి రోజు బైక్‌పై మమ్మల్ని ఫాలో అయ్యేవాడు. కాలేజీ గోడలపై, రోడ్డుపై నా పేరు, తన పేరు కలిపి రాసేశాడు. మా ఇంటికి ఎదురుగా ఉన్న గోడపై కూడా అలానే రాశాడు. నేను అతనితో ఒక్కసారి కూడా మాట్లాడలేదు. కానీ మా వెనకే తిరిగేవాడు. ఓ సారి మా అక్క అతనితో మాట్లాడింది. ‘ఇలా తిరడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని.. ఏదైనా సాధించి రా.. అప్పుడు మనం మాట్లాడుకుందాం’అని చెప్పింది. కొన్నాళ్ల తర్వాత అతను కనిపించకుండా పోయాడు. ఇలాంటి వేధింపులు ఆడపిల్లలను చాలా భయానికి గురి చేస్తాయి. బయటకు కూడా రాలేరు. ఇంట్లో వాళ్లు కూడా భయపడతారు. వేధింపులపై మహిళలు, యువతులు మౌనంగా ఉండకూడదు. ధైర్యంగా ఎదురు తిరగాలి. నేటి తరం అమ్మాయిలు తమ రక్షణ విషయంలో మరింత జాగ్రత్తతో వ్యవహరించడం మంచి పరిణామం’ అని శుభాంగి అన్నారు.

‘కసౌతీ జిందగీ కే' అనే సిరియల్‌తో సీనీ కెరీర్‌ని ప్రారంభించిన శుభాంగి ఆత్రే..  2007లో వచ్చిన 'కస్తూరి' అనే ధారవాహికతో మంచి గుర్తింపు పొందింది. ఆ తర్వాత  'భాబీజీ ఘర్ పర్ హై!'లో అంగూరి భాభీ పాత్ర పోషించి బాగా పేరు సంపాదించింది. చిడియా ఘర్, అధురి కహానీ హుమారీ, హవన్,  దో హాన్సన్ కా జోడా వంటి షోలలో కూడా నటించింది.

Videos

కామన్వెల్త్ లో భారత్ పతకాల పంట.. 13 స్వర్ణాలతో 4వ స్థానం..

మూవీ చూసి బాబాయ్ ఏం చెప్పాడంటే..

విరుపాక్షిని హత్య చేసే కుట్ర..! లోకేష్ ని వదిలిపెట్టం..

ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్ పై బుట్టా రేణుక స్ట్రాంగ్ రియాక్షన్

పెమ్మసాని పై అంబటి అదిరిపోయే సాంగ్

బాబుకు షాక్.. TDPపై జనసేన ఘన విజయం

మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించిన సీఎం రేవంత్

జూరాల వద్ద పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ

ఇరాన్ యుద్ధం పై ట్రంప్ కీలక నిర్ణయం..

విశాఖ యారాడ బీచ్ లో విషాదం..! అలల ఉధృతికి ఇద్దరు గల్లంతు

Photos

+5

Ujjaini Mahankali Bonalu : ఘనంగా సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహంకాళి బోనాలు (ఫోటోలు)

+5

ఫ్రెండ్‌షిప్ డే స్పెషల్.. దోస్తులతో మంచు లక్ష్మీ (ఫొటోలు)

+5

కాశీ పరమేశ్వరుడి సేవలో ధనశ్రీ వర్మ (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఆగస్టు 02- 09)

+5

శ్రీవారి సేవలో యాంకర్ లాస్య-మంజునాథ్ జంట(ఫోటోలు)

+5

బ్లాక్‌ డ్రెస్‌లో దివ్య పిళ్లై స్టన్నింగ్‌ లుక్స్‌ (ఫోటోలు)

+5

చీరలో సంయుక్త.. ఎంత అందంగా ఉందో(ఫోటోలు)

+5

బ్లాక్ శారీలో మెరిసిన కాయదు లోహర్.. ఫోటోలు

+5

లండన్ ట్రిప్‌లో వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

మిల మిల మెరిసిన 'చెన్నై లవ్ స్టోరీ' తార (ఫొటోలు)