Breaking News

మటన్‌ నల్లీ వివాదంలో నలిగిన పెళ్లి!

Published on Sat, 08/01/2026 - 08:54

‘పెళ్లి బాజాలు మోగాయి.. తలంబ్రాలు పడాల్సిందే.. కానీ, ఇంతలోనే పన్నీర్‌ ముక్క ప్లేట్‌లో పడలేదు! మటన్‌ నల్లీ కనబడలేదు! ఇంకేముంది.. అప్పటి వరకు సందడిగా కనిపించిన వివాహ వేదిక.. ఒక్కసారిగా రణరంగంగా మారిపోయింది. ఫైనల్‌గా పెళ్లి క్యాన్సిల్‌. ఒక్కటి కావాల్సిన జంట చెరోదారిన వెనుదిరిగింది. వినడానికి వింతగా ఉన్నా ఇదే నిజం. ఈ మధ్యకాలంలో ఇలాంటి అనూహ్యమైన విచిత్రాలు, ఊహించని వివాదాలు తరచుగా ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. సోషల్‌ మీడియాలో మారుమోగుతూనే ఉన్నాయి. అలాంటి కొన్ని సంఘటనలు..

మటన్‌ నల్లీ వివాదం.. 
తెలంగాణలో జరిగిన ఈ సంఘటనలో వధువు తరఫు వారు ఏర్పాటు చేసిన నాన్‌ వెజ్‌ మెనూలో మటన్‌ బోన్‌ మ్యారో లేకపోవడమే గొడవకు ప్రధాన కారణం. దీనిని తమకు అవమానంగా భావించిన వరుడు కుటుంబ సభ్యులు వివాహాన్ని రద్దు చేస్తున్నట్లు అనూహ్యమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. దీంతో జీవితాంతం ఒక్కటిగా ఉండాల్సిన బంధం పెళ్లిపీటల దగ్గరే తెగిపోయింది.

మటర్‌ పన్నీర్‌లో ‘పన్నీర్‌’ ఏది?
సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన ఈ సంఘటనలో మటర్‌ పన్నీర్‌ కూర ఘర్షణకు దారితీసింది. అతిథులు ఎంతో ఇష్టంగా తినే పన్నీర్‌ డిష్‌లో అసలు పన్నీర్‌ ముక్కలే కనిపించకపోవడంతో వివాదం మొదలైంది. వధువు, వరుడి తరఫు బంధువుల మధ్య చిన్నగా ప్రారంభమైన మాటల యుద్ధం కాస్తా .. దాడిచేసుకునే వరకు వెళ్లి పెళ్లి ఆగిపోయింది.

స్నేహితుల మాటతో పెళ్లి క్యాన్సిల్‌
స్నేహితుల సలహాతో వధువు తన వివాహాన్ని రద్దు చేసుకున్న విచిత్ర సంఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. 20 ఏళ్ల యువతికి ఆమె కుటుంబ సభ్యులు 30 ఏళ్ల మేనబావతో వివాహం నిశ్చయించారు. అయితే తన స్నేహితులతో చర్చించిన అనంతరం, ఈ సంబంధం సరికాదని భావించిన వధువు పెళ్లిని రద్దు చేసుకుంది.

డబ్బులు లెక్కించలేదని!
ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్‌ జిల్లాలో డబ్బులు లెక్కపెట్టలేని వరుడిని చూసి వధువు పెళ్లిని రద్దు చేసుకుంది. వివాహ తంతు జరుగుతుండగా వరుడి ప్రవర్తనపై పూజారికి అనుమానం వచ్చి వధువు కుటుంబానికి సమాచారం ఇచ్చాడు. సందేహంతో వరుడికి కొన్ని కరెన్సీ నోట్లు ఇచ్చి లెక్కపెట్టమనగా, అతడు లెక్కపెట్టలేక నిలబడిపోయాడు. దీంతో వరుడి మానసిక స్థితి సరిగ్గా లేదనే నిజాన్ని అతని కుటుంబం దాచిపెట్టిందని గ్రహించి వధువు వివాహాన్ని రద్దు చేసుకుని పెళ్లిపీటల నుంచే వెళ్లిపోయింది.

డ్యాన్స్‌ వద్దనడంతో..
పెళ్లి ఊరేగింపులో వధువు డ్యాన్స్‌ చేయడాన్ని వరుడు నిరాకరించాడని.. పెళ్లిని రద్దు చేశాడు వధువు తండ్రి. ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురంలో చోటుచేసుకున్న ఈ సంఘటనలో చిన్న విషయంలో మొదలైన వివాదం పెళ్లి ఆగిపోయేలా చేసింది. పెళ్లి వేడుకలో భాగంగా ఇరువైపుల కుటుంబ సభ్యులు, బంధువులు డ్యాన్స్‌లు చేస్తుండగా.. వధువరులిద్దరినీ డ్యాన్స్‌ చేయాల్సిందిగా వారి స్నేహితులు కోరారు. దీనికి వరుడు నిరాకరించడంతో పాటు వధువు డ్యాన్స్‌ చేయడాన్ని కూడా వరుడు నిరాకరించాడు. దీంతో వధువు తండ్రి పెళ్లిని రద్దు చేశాడు. విందులో వంటకాల పట్ల వచ్చిన చిన్నపాటి అసంతృప్తులు హాస్యంగా అనిపించినప్పటికీ, పెళ్లి సంబంధాల్లో పారదర్శకత లోపించడం, నిజాలు దాచడం వంటి విషయాలు పీటల మీద పెళ్లిళ్లు ఆగడానికి ప్రధాన కారణాలుగా మారుతున్నాయి.

Videos

కామన్వెల్త్ లో భారత్ పతకాల పంట.. 13 స్వర్ణాలతో 4వ స్థానం..

మూవీ చూసి బాబాయ్ ఏం చెప్పాడంటే..

విరుపాక్షిని హత్య చేసే కుట్ర..! లోకేష్ ని వదిలిపెట్టం..

ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్ పై బుట్టా రేణుక స్ట్రాంగ్ రియాక్షన్

పెమ్మసాని పై అంబటి అదిరిపోయే సాంగ్

బాబుకు షాక్.. TDPపై జనసేన ఘన విజయం

మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించిన సీఎం రేవంత్

జూరాల వద్ద పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ

ఇరాన్ యుద్ధం పై ట్రంప్ కీలక నిర్ణయం..

విశాఖ యారాడ బీచ్ లో విషాదం..! అలల ఉధృతికి ఇద్దరు గల్లంతు

Photos

+5

Ujjaini Mahankali Bonalu : ఘనంగా సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహంకాళి బోనాలు (ఫోటోలు)

+5

ఫ్రెండ్‌షిప్ డే స్పెషల్.. దోస్తులతో మంచు లక్ష్మీ (ఫొటోలు)

+5

కాశీ పరమేశ్వరుడి సేవలో ధనశ్రీ వర్మ (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఆగస్టు 02- 09)

+5

శ్రీవారి సేవలో యాంకర్ లాస్య-మంజునాథ్ జంట(ఫోటోలు)

+5

బ్లాక్‌ డ్రెస్‌లో దివ్య పిళ్లై స్టన్నింగ్‌ లుక్స్‌ (ఫోటోలు)

+5

చీరలో సంయుక్త.. ఎంత అందంగా ఉందో(ఫోటోలు)

+5

బ్లాక్ శారీలో మెరిసిన కాయదు లోహర్.. ఫోటోలు

+5

లండన్ ట్రిప్‌లో వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

మిల మిల మెరిసిన 'చెన్నై లవ్ స్టోరీ' తార (ఫొటోలు)