Breaking News

కేలరీల లోటు పద్ధతితో ఏకంగా 26 కిలోలు..! ఎలా చేయాలంటే..

Published on Thu, 07/30/2026 - 17:34

బరువు తగ్గడం తరుచుగా సవాలుగా అనిపించొచ్చు. విపరీతమైన ఆకలి కోరికలు, స్థిరత్వం లేని పురోగతి చాలామందిని వెయిట్‌లాస్‌ లక్ష్యం నుంచి వెనక్కి తగ్గేలా నిరుత్సాహపరుస్తుంది. అలాంటి వారికీ ఈ మహిళ పాటించిన టెక్నిక్‌ హెల్ప్‌ అవ్వొచ్చు. ఆరోగ్యకరమైన అవాట్లతోటే స్థిరంగా బరువు తగ్గింది. తిరిగి పెరగకుండా మెయింటైన్‌ చేస్తూ స్ఫూర్తిగా నిలిచింది. అదెలాగో సవివరంగా ఆమె మాటల్లోనే తెలుసుకుందామా..!.

ఆ మహిళా కంటెంట్‌ క్రియేటర్‌ అందుకు సంబంధించిన వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. కేలరీల వినయోగంలో అటెన్షన్‌తో వ్యవహరించి సుమారు 26 కిలోలు వరకు తగ్గినట్లు తెలిపింది. కేలరీల లోటు అనే భావనను అర్థం చేసుకోవడమే తన ఫిట్‌నెస్‌ ప్రయాణంలో ఒక ఒకకొత్త మలుపు అని చెబుతోంది. 

శ్వాస తీసుకోవడం, ఆలోచించడం, కదలడం, శారీరక ప్రక్రియలను నిర్వహించడం వంటి ప్రాథమిక విధులను నిర్వర్తించడానికి ప్రతి వ్యక్తి శరీరానికి నిర్దిష్ట సంఖ్యలో కేలరీలు అవసరం. ఆ సంఖ్యను మెయింటెనెన్స్‌ కేలరీలు అంటారు. దానిపై అటెన్షన్‌ ఉంచితే బరువు తగ్గడం సులభం అని అంటున్నారు. మనం ఖర్చు చేసే కేలరీల కంటే అతిగా తింటే బరువు పెరగడానికే దారితీస్తుందని అన్నారు. అదే సమయంలో మెయింటెనెన్స్ కంటే తక్కువగా తినడం క్యాలరీల లోటును సృష్టిస్తుంది. ఇది కాలక్రమేణా బరువు తగ్గడానికి దారితీస్తుందని వెల్లడించింది. 

తాను సుమారు రెండువేల కేలరీలతో ప్రారంభించి, రోజుకు సుమారు 1,450 కేలరీలకు చేరుకుని ప్రతి వారం 100 నుంచి 150 కేలరీల చొప్పున ఆహారం తీసుకోవడాన్ని తగ్గించుకున్నానని అన్నారు. ఆమె ఈ లోటును 12 వారాల పాటు కొనసాగించి, ఆ తర్వాత మళ్లీ దాన్ని రిపీట్‌ చేస్తూ బరువు తగ్గుతూ వచ్చానని అన్నారు. ఇది ఎలాంటి తీవ్రమైన డైటింగ్‌ పద్ధతులను పాటించకుండా 26 కిలోల బరువు తగ్గడానికి దారితీస్తుందని అన్నారు.

కేలరీల లోటుని ఎలా లెక్కించాలి..
ఉచిత ఆన్‌లైన్ TDEE (మొత్తం రోజువారీ శక్తి వ్యయం) కాలిక్యులేటర్‌ను ఉపయోగించి, మీ వయసు, ఎత్తు, బరువు ఆదారంగా అనుసరించాల్సిన కేలరీల వివరణ ఇస్తుంది. చిన్నగా కేలరీల లోటు మొదలుపెట్టి దాదాపు వంద నుంచి 300 దాక కేలరీలు తగ్గించండి. అలాగే ప్రతివారం పురోగతని చెక్‌చేయండి. 

ఒకవేళ ఫలితం కనిపించకపోతే కేలరీల లోటుని కొద్దిగా తగ్గించి, శారీరక శ్రమను పెంచాలని చెప్పుకొచ్చింది. చివరగా ఆమె వెయిట్‌లాస్‌ జర్నీతో కేలరీల లోటుని సరైన విధంగా నిర్వహిస్తే స్థిరంగా బరువు తగ్గడం అనేది అత్యంత సులువైన మార్గమని చెబుతోందామె.

గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. 

 

(చదవండి: ఎవరీ మిరాండా గిబ్సన్‌? ఏకంగా 449 రోజులు..)

 

Videos

BIG Question: ఉప్పొంగిన ఉత్తరాంధ్ర.. జనసంద్రం పోటెత్తితే ఎలా ఉంటుందో తెలుసా?

పాతపట్నం MLA కారు యాక్సిడెంట్ కేసులో మీరు ఏం చేశారు..

BCCI నుంచి వైభవ్‌కు బిగ్ గిఫ్ట్.. వైస్ కెప్టెన్‌గా ప్రమోషన్!

YS జగన్ శ్రీకాకుళం టూర్ పై పబ్లిక్ రియాక్షన్

బుర్ర పనిచేస్తుందా బాబు? CPR ఎందుకు చేస్తాడు.. బాబుకు జగన్ కౌంటర్

సీదిరి అప్పలరాజుని నాశనం చేయడం కోసం... జగన్ సంచలన కామెంట్స్

సీదిరి అక్రమ అరెస్ట్ పై YS జగన్ రియాక్షన్

జగన్ కీలక ప్రెస్ మీట్ @శ్రీకాకుళం

అంపోలు జైలు వద్ద YS జగన్ ప్రెస్ మీట్

జగన్ అభిమానులపై పోలీసులు లాఠీ ఛార్జ్

Photos

+5

పారిస్ ట్రిప్‌లో ‘సర్జా సిస్టర్స్’.. అర్జున్‌ చిన్న కూతురు ఫోటోలు వైరల్‌

+5

వైఎస్‌ జగన్‌ రాకతో ఉత్తరాంధ్ర జనసంద్రం (ఫొటోలు)

+5

ఒక శకం ముగిసింది.. అంతర్జాతీయ క్రికెట్‌కు రహానే గుడ్‌బై..(ఫొటోలు)

+5

ఈ చిన్నారే.. ఇప్పుడు ట్రెండింగ్‌ స్టార్‌! వెంకీ మామ కూతురి క్యూట్‌ (ఫొటోలు)

+5

చిరునవ్వుతో అభిమానులను ఫిదా చేసిన అనుపమ పరమేశ్వరన్ (ఫొటోలు)

+5

ట్రెడిషనల్ లుక్‌లో కట్టిపడేసిన అందాల భామ రజిష విజయన్ (ఫొటోలు)

+5

అప్సరసలా దివ్యమైన రూపంతో మెరిసిన శోభిత ధూళిపాళ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : రవీంద్రభారతిలో ఇది.. అందెల రవళి (ఫొటోలు)

+5

హైదరాబాద్ : అంతర్జాతీయ పులుల దినోత్సవం...అదిగో పులి (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌