ఏ మొహం పెట్టుకొని ఇంటింటికి వెళ్తున్నారు. చనిపోయిన వ్యక్తిపై ఎందుకు అంత ద్వేషం..!
Breaking News
మధ్యతరగతి నేపథ్యంలో...
Published on Tue, 07/28/2026 - 00:04
విక్రమ్ సహిదేవ్, సంధ్యా వశిష్ట, తారక్ పొన్నప్ప ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘అనకాపల్లి’. ఖగేష్ తమ్మినేని దర్శకత్వంలో భవ్యశ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్‌పై కాండ్రేగుల నాయుడు, త్రినాథరావు నక్కిన నిర్మించారు. కాండ్రేగుల కుమార్ రాజా కో ప్రోడ్యూసర్‌గా వ్యవహరించిన ఈ మూవీకి త్రినాథరావు నక్కిన కథ, స్క్రీన్ ప్లేని అందించడమే కాకుండా ఓ ముఖ్య పాత్ర పోషించారు.
ఆగస్టు 7న విడుదల కానున్న ఈ మూవీ ట్రైలర్‌ను విశాఖపట్నంలో జరిగిన ఎలైట్ క్రికెట్ లీగ్ సీజన్ 2లో టాలీవుడ్ థండర్స్ టీమ్ విడుదల చేసింది. హీరోలు శ్రీకాంత్, సుధీర్ బాబు, తరుణ్, అశ్విన్ బాబు, సంగీత దర్శకుడు తమన్ ట్రైలర్‌ను విడుదల చేసి, ‘అనకాపల్లి’ విజయం సాధించాలని ఆకాంక్షించారు. ‘‘మధ్యతరగతి నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో త్రినాథరావు, ఇంద్రజ మిడిల్ క్లాస్ పేరెంట్స్‌గా కనిపిస్తారు’’ అని చిత్రయూనిట్ పేర్కొంది.
Tags : 1