Breaking News

ఓటీటీలో క్రైమ్ కామెడీ సినిమా.. తెలుగు రివ్యూ

Published on Sun, 07/26/2026 - 18:21

ఖైదీ, మాస్టర్, విక్రమ్, ఓజీ తదితర సినిమాల్లో విలన్‌గా నటించి ఆకట్టుకున్న తమిళ నటుడు అర్జున్ దాస్.. హీరోగానూ అప్పుడప్పుడు మూవీస్ చేస్తుంటాడు. అలా చేసిన చిత్రమే 'కాన్ సిటీ'. చెప్పాలంటే గత నెలలో తెలుగులోనూ థియేటర్లలో రిలీజ్ కావాలి. కానీ ఎందుకనో అది జరగలేదు. ఇప్పుడు నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లోకి తెలుగు డబ్బింగ్ వెర్షన్ తీసుకొచ్చేశారు. క్రైమ్ కామెడీగా తీసిన ఈ మూవీ ఎలా ఉందనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.

(ఇదీ చదవండి: ఈ సిరీస్ చూస్తే ఫోన్ వాడాలంటే భయపడతారు.. తెలుగు రివ్యూ)

కథేంటి?‍
శరవణన్ (అర్జున్ దాస్) ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తుంటాడు. పేరుకే ప్రభుత్వ ఉద్యోగి గానీ చేతినిండా అప్పులే. ఐశ్వర్య(సాక్షి వైద్య)తో ప్రేమలో ఉంటాడు గానీ అప్పుల కారణంగా అది బ్రేకప్ అయిపోతుంది. మరోవైపు ప్రెగ్నెన్సీతో ఉన్న మిత్ర(అన్నా బెన్) కూడా ఓ సంస్థ చేతిలో మోసపోతుంది. అదే టైపులో తన కూడా ఇతరులని మోసం చేయడం మొదలుపెడుతుంది. ఇంకోవైపు జానకి(వడిఉక్కరుసు), తన కొడుకు(యోగిబాబు)తో కలిసి ట్రస్ట్ పేరిట జనాల నుంచి డబ్బులు వసూలు చేస్తూ మోసం చేస్తుంటుంది. వీళ్లందరి మోసాలు ఎలా బయటపడ్డాయి? డబ్బు గురించి వీళ్లంతా చివరకు ఏం తెలుసుకున్నారు? అనేదే మిగతా స్టోరీ.

ఎలా ఉందంటే?
ప్రపంచంలో అందరికీ కావాల్సింది ఏదైనా ఉందంటే అది డబ్బు మాత్రమే. అవసరాలు ఊరికే ఉండవుగా! బతకడం కోసం 'డబ్బు' మనతోనే ఎలాంటి మోసాన్ని అయినా చేయిస్తుంది. కష్టపడి సంపాదించుకున్నది మాత్రమే ఎప్పటికైనా నిలుస్తుంది మోసం చేసి సంపాదించుకున్నది ఎలా వచ్చిందో అలానే వెళ్లిపోతుంది అనే సత్యాన్ని చూపిస్తూ తీసిన సినిమా ఇది.

అప్పులు.. అవస్థలు.. అవసరం.. ఈజీ మనీ కోసం ప్రధాన పాత్రలన్నీ మోసాలు చేసే సీన్లతో ఫస్టాప్ బాగానే ఉంటుంది. శరవణన్ పాత్ర ఆఫీస్‌లో పనిచేయడం, చిన్నపాటి టెక్నిక్ వాడి అక్కడ డిపాజిట్ చేయాల్సిన డబ్బులు కొట్టేయడం లాంటి సీన్లు చూస్తుంటే 'లక్కీ భాస్కర్' సినిమా గుర్తొస్తుంది. కానీ మోసాలు చేసినందుకు బాధపడుతూ ఇక మారిపోవాలనుకున్నప్పుడు ఇదే బ్యాచ్‌కి గతంలో కంటే పెద్ద నేరం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు వాళ్లు ఏం చేస్తారనే అంశాలతో సెకండాఫ్ ఉంటుంది. ఇంటర్వెల్ తర్వాత నుంచి చూస్తున్నప్పుడు 'బ్లఫ్ మాస్టర్' మూవీ గుర్తొస్తుంది.

ఫస్టాప్ సహజంగా అనిపిస్తుంది గానీ సెకండాఫ్‌లో మాత్రం ప్రధాన పాత్రలు చేసే పనులన్నీ లాజిక్స్ దూరంగా ఉన్నట్లు అనిపిస్తాయి. కాకపోతే కథ, స్క్రీన్ ప్లే లాంటి వాటి వల్ల ఉన్నంతలో చూడాలనిపించేలా అనిపించడం మూవీకి ప్లస్ పాయింట్. మరీ గొప్ప మూవీ అయితే కాదు గానీ చూస్తున్నంతసేపు టైమ్ పాస్ అయిపోతుంది. గతంలో ఈ మూవీ టీజర్ రిలీజ్ చేసినప్పుడు.. బిల్లింగ్ మెషీన్ నుంచి డబ్బులు వస్తున్నట్లు చూపించి ఆసక్తి రేపారు. కానీ అసలు ఈ సీన్ సినిమాలో పెట్టకుండా భలే మోసం చేశారు. స్టోరీ మార్చి తీశారా? లేదంటే పబ్లిసిటీ కోసమే ఈ టీజర్ వదిలారా అనేది అర్థం కాని ప్రశ్న.

ఎవరెలా చేశారు?
శరవణన్‌గా చేసిన అర్జున్ దాస్, మిత్రగా చేసిన అన్నాబెన్, మిగతా పాత్రల్లో నటించిన వడి ఉక్కరుసు, యోగిబాబు, వీటీవీ గణేష్ తదితరులు తమ స్టైల్ ఆఫ్ యాక్టింగ్‌కి భిన్నమైన పాత్రల్లో ఇందులో కనిపించారు. అలానే ఆకట్టుకున్నారు. కానీ స్టోరీ పరంగా యావరేజ్‌గా అనిపించింది. సినిమాటోగ్రఫీ బాగుంది గానీ మ్యూజిక్ అయితే గుర్తుంచుకునేంతలా లేదు. అసభ్యకర సీన్స్ లేవు. కుటుంబంతోనూ కలిసి చూడొచ్చు.

- చందు డొంకాన

(ఇదీ చదవండి: ఓటీటీలో తమిళ కామెడీ థ్రిల్లర్ సినిమా 'పరిమిళ అండ్ కో' తెలుగు రివ్యూ)

Videos

డీఏస్సీ స్కామ్ లో సీబీఐ ఎంక్వైరీ..? తక్షణమే లోకేష్ రాజీనామా..?

రంగనాథ్‌పై TG హైకోర్టు కీలక ఆదేశాలు

సీనియర్స్ కే ఆ అర్హత దక్కాలి వాళ్ళ తర్వాతే నేను

విజయవాడలో టెన్షన్ టెన్షన్.. ఔట్ సోర్సింగ్ కార్మికుల కన్నెర్ర..

పెద్దిని పరామర్శించిన KCR

దేవినేని ఉమాను కలిస్తే తప్పేంటి..? నోరు తెరిస్తే తట్టుకోలేవు..

మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని వైఎస్సార్సీపీ డిమాండ్

గుడ్ న్యూస్.. వచ్చే మూడు రోజుల్లో భారీ వర్షాలు..

పవన్ కళ్యాణికి బిగ్ షాక్ జనసేనపై తిరగబడ్డ Gen-Z

భారీగా పెరిగిన బంగారం ధరలు.. 10 గ్రాముల ధర మరీ ఇంతనా? తాజా రేట్లు చూసి షాక్ అవుతారు!

Photos

+5

'మహేంద్రగిరి వారాహి' టీజర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

గర్ల్‌ఫ్రెండ్‌తో టీమిండియా క్రికెటర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ (ఫొటోలు)

+5

మీనాక్షి చౌదరి అమెరికా ట్రిప్.. ఎంత ముద్దుగా ఉందో? (ఫొటోలు)

+5

ఏపీ : విశాఖపట్నం దగ్గరలో అద్భుతమైన జలపాతం... ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

ఈ టాలీవుడ్ నటుడు గుర్తున్నాడా..? ఆయన కూతురు మనవి ఇప్పుడు క్రేజీ హీరోయిన్.. (ఫొటోలు)

+5

డాక్టర్‌ సతీశ్‌రెడ్డికి 'ఛేంజ్‌ మేకర్‌' పురస్కారం అందజేసిన చిరంజీవి (ఫొటోలు)

+5

శ్రీకాళహస్తి : ధర్మరాజులస్వామి ఆలయంలో శాస్తోక్తంగా అగ్నిగుండ మహోత్సవం (ఫొటోలు)

+5

'శ్రీనివాస మంగాపురం' మూవీ ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

విజ‌య‌వాడ దుర్గ‌మ్మ‌కు తెలంగాణ బోనాలు (ఫోటోలు)

+5

నేచర్ ఎంజాయ్ చేస్తోన్న టాలీవుడ్ నటి అనసూయ (ఫోటోలు)