Breaking News

చెన్నై లవ్ స్టోరీ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Published on Fri, 07/24/2026 - 00:01

టైటిల్: చెన్నై లవ్ స్టోరీ 
నటీనటులు : కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ, త్రిగుణ్ , సిరి హనుమంతు, నవీన్ తదితరులు
నిర్మాతలు - ఎస్ కేఎన్, సాయి రాజేశ్
కథ : సాయి రాజేశ్
స్క్రీన్ ప్లే, డైరెక్షన్ - రవి నంబూరి
సంగీతం : మణిశర్మ
ఎడిటర్ : సంతోష్ నాయుడు
సినిమాటోగ్రఫీ : విశ్వాస్ డేనియల్
విడుదల తేదీ: 24 జులై 2026

మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ మీద సాయి రాజేష్, ఎస్ కే ఎన్ నిర్మించిన చిత్రం ‘చెన్నై లవ్ స్టోరీ’ . ఈ మూవీ రవి నంబూరి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం, గౌరీ ప్రియ జంటగా నటించారు. ఈ చిత్రాన్ని జూలై 24న రిలీజ్ చేశారు. మరి ఈ సినిమా ఎలా ఉంది? కథ ఏంటి? ఈ చిత్రం ఆడియెన్స్ ఏ మేరకు నచ్చుతుంది? అన్నది ఓ సారి చూద్దాం. 

కథ ఏంటంటే?
కాలేజ్ రోజుల నుంచే అజయ్ (త్రిగుణ్), నివి అలియాస్ నివేదిత (గౌరీ ప్రియ) ప్రేమించుకుంటారు. రెండేళ్ల స్నేహం, మూడేళ్ల ప్రేమతో పెళ్లికి సిద్దం అవుతారు. సరిగ్గా పెళ్లి రోజే అజయ్ చెప్పాపెట్టకుండా వెళ్లిపోతాడు. వేరే అమ్మాయిని ఇష్టపడుతున్నాని అజయ్ చెప్పడంతో నివేదిత తట్టుకోలేకపోతుంది. ఆ బాధతో నివేదిత మందుకు బానిస అవుతుంది. ఆఫీసులో సరిగ్గా వర్క్ మీద ఫోకస్ కూడా పెట్టదు. ఇక నివేదిత రూంలోకి ఓ అతిథిగా వస్తాడు స్టీవెన్ శంకర్ (కిరణ్ అబ్బవరం). అనాథ అయిన స్టీవెన్.. ఫిల్మ్ మేకర్ అవ్వాలని, చచ్చేలోపు ఒక్కసారి అయినా తన పేరుని సిల్వర్ స్క్రీన్ మీద చూసుకోవాలని అవకాశాల కోసం తిరుగుతుంటాడు. స్టీవెన్ రాకతో నివిలో వచ్చిన మార్పులు ఏంటి? నివి, స్టీవెన్ ప్రయాణం ఎంత వరకు సాగుతుంది? దర్శకుడు అవ్వాలనే స్టీవెన్ కోరిక నెరవేరుతుందా? అజయ్ మళ్లీ నివి జీవితంలోకి వస్తాడా? చివరకు ఈ ప్రేమ కథలో ఎవరెవరు ఒకటి అవుతారు? అన్నది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే?..
ప్రేమ కథల్లో చెన్నై లవ్ స్టోరీ మాత్రం కాస్త కొత్త ప్రేమ కథే అని చెప్పుకోవాలి. ప్రేమ కథ అన్నాక.. ప్రేమికుడు, ప్రేయసి ఉంటుంది.. వీరి మధ్య ఓ సంఘర్షణ ఉంటుంది.. ఇద్దరినీ దూరం చేసే కారణం ఏదో ఒకటి ఉంటుంది.. ఈ పాయింట్స్‌ని పట్టి చూస్తే ఈ ప్రేమ కథ చాలా కొత్తగా అనిపిస్తుంది. తొలి ప్రేమ తోపు కాదే అన్న మాట, పాటలోనే ఈ కథ ఎలా ఉంటుందో అర్థం అవుతుంది. అయితే ఈ కథను ఎలా డీల్ చేశారన్న దానిపైనే రిజల్ట్ ఆధార పడి ఉంటుంది. తొలి ప్రేమ అయినా, మలి ప్రేమ అయినా ప్రేయసి సుఖాన్ని, సంతోషాన్నే ప్రేమికుడు కోరుకోవాలి.  


నివి ప్రేమలో విఫలం అవ్వడం, పెళ్లి క్యాన్సిల్ అవ్వడం, ఆపై మందుకు బానిస అవ్వడం వంటి సీన్లతో ఆరంభం నుంచే ప్రేక్షకుడ్ని హుక్ చేసేస్తాడు దర్శకుడు. ఆ తర్వాత హీరో పాత్రను పరిచయం చేయడం, అక్కడితో కాస్త ఎంటర్టైన్మెంట్ ట్రాక్ నడిపించడంతో కథ అలా ముందుకు వెళ్తుంటుంది. హీరో, హీరోయిన్ల మధ్య మొదట్లో వచ్చే గొడవలు, ఆ తర్వాత ఇద్దరి మధ్య స్నేహం, ప్రేమ చిగురించడం వంటి సీన్లతో కథ మరింత స్పీడుగా వెళ్తున్నట్టు అనిపిస్తుంది. అయితే అన్నీ బాగానే ఉన్నాయ్ అని అనుకునే టైంకి కథ ఎవ్వరూ ఊహించని టర్న్ తీసుకుంటుంది. ఆ ఇంటర్వెల్ బ్లాక్‌తో అందరి మైండ్ బ్లాక్ అవుతుంది. 


సెకండాఫ్‌ని ఎలా డీల్ చేస్తారు? అసలు కథ ఎలా ముందుకు సాగుతుంది? అనే ఇంట్రెస్టింగ్ పాయింట్లతో ద్వితీయార్దాన్ని ప్రేక్షకుడు చూస్తాడు. ఇక ఆడియెన్స్‌ ఇంట్రెస్ట్‌కి తగ్గట్టుగానే కథనం సాగుతుంటుంది. హీరో, హీరోయిన్ల ట్రాక్ అక్కడ చాలా కొత్తగా అనిపిస్తుంది. మళ్లీ అజయ్ పాత్రను తీసుకు రావడంతో కథ మరింత ఇంట్రెస్టింగ్‌గా మారుతుంది. ఆ తరువాత కథ అక్కడక్కడే తిరుగుతుండటం, చాలా వరకు సాగదీసినట్టుగా అనిపిస్తుంది. సెకండాఫ్‌లోని కొన్ని ఎమోషనల్ సీన్స్ గుండెల్ని మెలిపెట్టేలా ఉంటాయి. క్లైమాక్స్‌కి కన్నీరు పెట్టాల్సిందే. అలా చివరకు ఓ సంతృప్తితో ప్రేక్షకుడు బయటకు వెళ్తాడు. అయితే ద్వితీయార్దాన్ని ఇంకాస్త బెటర్‌గా మల్చి ఉంటే.. ఫలితం వేరేలా ఉండేదనిపిస్తుంది.

ఎవరెలా చేశారంటే..
కిరణ్ అబ్బవరం తనకు ఇచ్చిన స్టీవెన్ పాత్రకు వంద శాతం న్యాయం చేశాడు. ఫస్ట్ హాఫ్‌లో అమాయకుడిగా అందరినీ నవ్విస్తూ కనిపించే కిరణ్ అబ్బవరం, సెకండాఫ్‌లో మరింత కొత్తగా కనిపిస్తాడు. చాలా వరకు ఎమోషనల్ సీన్స్‌తో కిరణ్ అబ్బవరం ఏడ్పించేస్తాడు. గౌరి ప్రియ అయితే ఈ చిత్రానికి సోల్. ఆమె కారెక్టర్‌ను అద్భుతంగా రాసుకున్నారు.. ఆమె కూడా అంతే అద్భుతంగా నటించారు. త్రిగుణ్ పాత్ర కూడా బాగుంటుంది. హీరోయిన్ ఫ్రెండ్స్ గ్యాంగ్, మురుగన్ తల్లి, కరుణ కుమార్ పాత్రలు బాగుంటాయి. మిగిలిన వారంతా తమ పరిధి మేరకు మెప్పించారు.

సాంకేతిక విషయాలకు వస్తే..  ఈ సినిమాకి మరో ప్రధాన బలం మణిశర్మ సంగీతం అని చెప్పాలి. తనదైన బీజియం తో మ్యాజిక్ చేశాడనే చెప్పుకోవచ్చు. పాటలు ఆహ్లాదకరంగా ఉంటాయి. కెమెరావర్క్ గొప్పగా అనిపిస్తుంది. విజువల్స్ ఎంతో ప్లెజెంట్‌గా ఉంటాయి. మాటలు మనసుని హత్తుకుంటాయి. క్యాస్టూమ్స్, ఎడిటింగ్ అన్నీ బాగుంటాయి. నిర్మాణ విలువలు ఎంతో ఉన్నతంగా అనిపిస్తాయి.

  • అంజి శెట్టె, సాక్షి వెబ్ డెస్క్ 

 

Videos

LIVE: ఆక్వా రైతులతో వైఎస్ జగన్

రాజీనామాకు నో... పేపర్ లీక్ తో ధర్మేంద్ర ప్రధాన్ కు లింకా?

వ్యాన్ ముందు ఎందుకు నిలబడ్డానంటే..! వైరల్ వీడియోపై RHIYA AHIR EMOTIONAL

SMలో వీడియో వైరల్.. GEN-Z డేరింగ్ లేడీ.. మహిళా కానిస్టేబుల్ తో ఫైట్

అర్థరాత్రి 11:55 గంటలకు.. సెల్ఫీ వీడియో విడుదల చేసిన మోదీ!

మీకేంత ధైర్యం.. ఢిల్లీ యూనివర్సిటీకి రాహుల్ వార్నింగ్

గుజరాత్ లో వర్ష బీభత్సం నీట మునిగిన ఇళ్లు, కార్లు

ఈ కథకు ముగింపు ఎప్పుడు అనేది . ఇప్పుడే చెప్పలేం... అసలు కథ ముందుంది

అర్థరాత్రి ఎలా ఉంది ? రాత్రి 12 గంటలకు.. జంతర్ మంతర్ వద్ద యువతులు

పాతాళానికి పడిపోయిన బంగారం ధరలు ఈరోజు తులం ఎంతంటే?

Photos

+5

హైదరాబాద్ : శిల్పకళా వేదికలో ధన్య ప్రసాద్ కూచిపూడి (ఫొటోలు)

+5

విజయవాడ : ఆషాఢ సారెతో అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

కొత్త లోకా బ్యూటీకి బిగ్‌ ఛాన్స్‌.. ఏకంగా దురంధర్‌ హీరోతో..! (ఫోటోలు)

+5

ఏపీ : అద్భుతమైన వేంకటేశ్వరస్వామి ఆలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

గుజరాత్‌లో వర్ష బీభత్సం...నీట మునిగిన కార్లు (ఫొటోలు)

+5

'కేరింత' నటి సుకృతి సీమంతం వేడుక (ఫొటోలు)

+5

బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకున్న ప్రముఖ నటి (ఫొటోలు)

+5

అందాల బొమ్మలా యంగ్ హీరోయిన్ శ్రీదేవి (ఫొటోలు)

+5

రిలీజైన 'చెన్నై లవ్ స్టోరీ'.. ట్రెండింగ్‌లో గౌరిప్రియ (ఫొటోలు)

+5

నల్ల చీరలో గ్లామరస్ మలయాళ కుట్టి (ఫొటోలు)