'జన నాయగన్' 50 శాతమే రీమేక్.. వేరే కథ విజయ్‌కి చెబితే

Published on Tue, 07/21/2026 - 09:23

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన చిట్టచివరి సినిమా 'జన నాయగన్' మరో రెండు రోజుల్లో విడుదల కానుంది. అయితే ఇది తెలుగు మూవీ 'భగవంత్ కేసరి' రీమేక్ అనే ప్రచారం చాన్నాళ్లుగా సాగుతోంది. ఇది అదే అని అందరికీ తెలిసినప్పటికీ అధికారికంగా ఏది బయటకు రాలేదు. కానీ ఇప్పుడు స్వయంగా దర్శకుడు హెచ్. వినోత్ రీమేక్ వార్తలపై స్పష్టత ఇచ్చేశాడు. సగం మాత్రమే రీమేక్ చేసినట్లు చెప్పుకొచ్చాడు.

(ఇదీ చదవండి: ఒకే కుటుంబానికి 10 జాతీయ అవార్డులు)

''జన నాయగన్'..భగవంత్ కేసరికి రీమేక్. కాకపోతే పూర్తిగా చేయలేదు. 'భగవంత్ కేసరి'లో 50% మాత్రమే ఉంటుంది. ఫస్టాఫ్‌లో 60%, సెకండాఫ్‌లో 20% ఉంటుంది. విజయ్ సార్ చివరి మూవీ కోసం నేను మొదట వేరే కథ వినిపించా. కానీ ఆ కథ చాలా హెవీగా ఉందన్నారు. 'భగవంత్ కేసరి'ని రీమేక్ చేయమని నన్ను అడిగారు. బాలయ్య యూనివర్స్ విజయ్ శైలికి భిన్నంగా ఉంటుంది. 'నేర్కొండ పార్వై' తర్వాత మళ్లీ రీమేక్ చేయాలా అనే సందేహాలు నాకు చాలానే ఉండేవి. ఇది విజయ్ చివరి సినిమా కాబట్టి, ఛాన్స్ వదులుకోవాలని అనుకోలేదు'

'అయితే మనం ఎందుకు రీమేక్ సినిమా చేయాలని నేను విజయ్‌ని అడిగాను. 'భగవంత్ కేసరి' ఎందుకు నచ్చిందో ఆయన నాకు సీన్ బై సీన్ వివరించారు. విజయ్‌కి మహిళా సాధికారత పట్ల ఆసక్తి ఉంది. ఇది విజయ్ సర్ చివరి సినిమా అని ఎవరూ ఖచ్చితంగా చెప్పలేరు. అయితే భవిష్యత్తులో సీఎం విజయ్ సర్‌గా మారిన తర్వాత వచ్చే తొలి సినిమాగా మాత్రం దీన్ని చూడొచ్చు. ఇది కేవలం కమర్షియల్ ఎంటర్‌టైనర్ కాదు. విజయ్‌ని హీరోయిక్‌గా చూపించడానికే తీసిన సినిమా కాదు. సున్నితమైన రాజకీయాల నేపథ్యంలో సాగే కథ ఇది'

'జన నాయగన్‌' విషయంలో నేను రెండుసార్లు ఏడ్చాను. సెన్సార్ ఆలస్యమై పొంగల్ పండగకు సినిమా విడుదల కానప్పుడు, సినిమా ఆన్‌లైన్‌లో లీక్ అయినప్పుడు, పైరసీని ఎవరూ ఆపలేకపోయినప్పుడు బాధపడ్డాను. అప్పుడు విజయ్ సార్ నాకు అండగా నిలిచారు. 'ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి, బాధపడకండి. ఒకవేళ మనసు బాగోలేకపోతే నాకు ఫోన్ చేయండి' అని నాకు ధైర్యం చెప్పారు' అని డైరెక్టర్ వినోత్ అన్నాడు. ఈ సినిమాలో విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ కాగా మమిత బైజు కీలక పాత్ర చేసింది. బాబీ డియోల్ విలన్‌గా నటించాడు. అనిరుధ్ సంగీతమందించాడు.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)

Videos

జంతర్ మంతర్ లో మీమ్స్.. రీల్స్

NEET పేపర్ లీక్ పై మోదీ సంచలన వీడియో

దీక్షను విరమించిన వాంగ్ చుంగ్

తిరుమలలో విగ్రహం దొంగలించింది నారా లోకేష్ అనుచరుడే

ఢిల్లీలో CJP తుఫాన్.. లాఠీ దెబ్బలకు భయపడని Gen-Z.. దద్దరిల్లిన జంతర్ మంతర్

చంద్రబాబుకు బిగ్ ఝలక్ ఇచ్చిన పవన్

మనకెలాగో అభివృద్ధి చేతకాదు.. తిట్టడం కూడా చేతకాదా.. మంత్రులపై చంద్రబాబు ఫైర్

దద్దరిల్లిన జంతర్ మంతర్.. ఢిల్లీలో బొద్దింకల నిరసన

మళ్లీ వస్తే డ్రగ్స్ కేసు పెడ్తా.. CJP లీడర్స్ కు పోలీస్ వార్నింగ్

తిరుమలలో 60 ఏళ్ల చరిత్ర.. మీకు సిగ్గుగా అనిపించట్లేదా BR నాయుడు

Photos

+5

నారింజ రంగు డ్రెస్‌లో మెరిసిపోతున్న నటి సిరి హనుమంత్‌ (ఫొటోలు)

+5

వైభ‌వ్ విశ్వ‌రూపం.. జింబాబ్వేపై భార‌త్ ఘ‌న విజ‌యం (ఫొటోలు)

+5

గచ్చిబౌలి : 11వ అఖిల భారత పోలీస్ జూడో క్లస్టర్-2026 (ఫొటోలు)

+5

‘కర్మాఖ్య’ ట్రైలర్ లాంచ్‌...ముఖ్య అతిథిగా విజయశాంతి (ఫొటోలు)

+5

ధగధగ మెరిసిపోతున్న అత్తారింటికి దారేది హీరోయిన్ ప్రణీత (ఫొటోలు)

+5

సీఎం విజయ్‌తో సినిమా ట్రెండింగ్ లో మమితా బైజు (ఫొటోలు)

+5

నల్లగొండ : పట్టా వచ్చిన వేళ.. ఆనంద హేళ (ఫొటోలు)

+5

మెరూన్‌ కలర్‌ చీరలో శివాని నాగారం అందాల సందడి..ఫోటోలు

+5

చెన్నై లవ్ స్టోరీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫోటోలు

+5

బర్త్‌డే స్పెషల్‌.. హీరో సూర్య రేర్‌ ఫోటోలు