రాజీనామా చేసేంత వరకు నిరసన కొనసాగుతుంది..!
Breaking News
జస్ట్ రెండేళ్లలో 142 కేజీల నుంచి 80 కేజీలకు..! నిలకడగా బరువు తగ్గాలంటే..
Published on Mon, 07/20/2026 - 17:27
బరువు తగ్గడం కష్టం కాదు గానీ, మళ్లీ యథావిధిగా పెరగకుండా ఉండటమే అతి పెద్ద టాస్క్ అని అంటున్నారు పలువురు. అందుకే వెయిట్‌లాస్ జర్నీలో నిలకడగా బరువు తగ్గేందుకు ప్రాధాన్యత ఇవ్వమని నొక్కి చెబుతున్నారు ఫిట్‌నెస్ నిపుణులు. అదే మిమ్మల్ని స్మార్ట్‌గా మార్చి వెయిట్‌లాస్ జర్నీలో విజయం సాధించేలా చేస్తుందని చెబుతున్నారు. అందుకు ఉదాహరణే..ఈ యువకుడు. బరువు తగ్గక మునుపు తన రూపం, ఆ తర్వాత ఉన్న మార్పులను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వీడియో షేర్ చేశారు.
ఆ వ్యక్తే కువార్ కపూర్. ఆయన సుమారు 142 కేజీల బరువు ఉండేవాడినని అన్నారు. బరువు తగ్గక మునుపు ఏవిధంగా ఉన్నానో పంచుకుంటూ..ప్రస్తుతం సుమారు 62 కేజీల పైనే తగ్గి 80 కేజీలకు తగ్గినట్లు వెల్లడించారు వీడియోలో. ఈ మార్పుకి వెనుక రహస్యం క్రాష్ డైట్‌లు కాదని, సరైన మార్గంలో నిలకడగా చేయడమేనని అన్నారు. తాను సరైన మార్గంలో నిలకడగా కార్డియో దినచర్యపై దృష్టిసారించి రెండేళ్లలోనే ఇంతలా స్మార్ట్‌గా మారానని చెప్పుకొచ్చాడు.
అందుకోసం ఎలా కార్షియో సెషన్‌లు చేయాలో చెప్పారు. ఆయన వీడియోలో చాలామంది నేరుగా పదివేల అడుగులతో వాకింగ్ ప్రారంభిస్తారు. దీంతో త్వరితగతిన అలిసిపోయి..రెండో వారానికల్లా స్కిప్ చేస్తారని అన్నారు. అస్సలు ఈ పద్ధతిని పొరపాటుగా అభివర్ణించారు. అందుకే అతడు కొవ్వు తగ్గడానికి నిలకడగా చేసే కార్డియో ప్రగతిని పంచుకున్నారు.
ప్రారంభ అధిక బరువులో..
ప్రారంభ దశలో నేరుగా పదివేలు అడుగులు కాకుండా నెమ్మదిగా మొదలు పెట్టానని చెప్పారు. నిర్వహించగలిగితే సాధారణంగా రోజుకు 3000 నుంచి 5000 అడుగులు సరి అని చెప్పారు. లేదా అంతకంటే తక్కువ నడిచినా పర్లేదని అన్నారు. ఇక్కడ అలిసిపోకుండా నిలకడగా ఉండటమే లక్ష్యం అని అన్నారు.
అధిక బరువు దశలో..
అధిక బరువు ఉన్నవారు వారానికి రెండు సెషన్లలో, ఒకే జోన్‌లో 8000 అడుగులతో ప్రారంభించాలని ఆయన సిఫార్సు చేశారు. ఆయన ప్రకారం, శరీరం అలవాటుపడినప్పుడు, కార్డియో మెరుగుపడుతుంది. సామర్థ్యానికి మించి ప్రయత్నించే బదులు, సాధారణ వేగంతో చేయాలని కూడా ఆయన సూచించారు.
ఓ మోస్తారు మార్పు మొదలయ్యాక..
వారానికి రెండు సెషన్లలో, రెండు జోన్లలో 10,000 నుంచి 12,000 అడుగులు వేయాలని ఆ వ్యక్తి సూచించారు. ఎందుకంటే, ఈ దశలో స్థూలకాయం లేదా అధిక బరువు దశలతో పోలిస్తే శరీరం సమర్థవంతంగా పనిచేసే సామర్థ్యం మెరుగుపడుతుందని అన్నారు.
బరువు తగ్గే దశ
ఈ దశలో, రెండు లేదా మూడు ప్రాంతాలలో వారానికి రెండుసార్లు 15,000 అడుగులు నడవాలని ఆయన సలహా ఇచ్చారు. ఇది కొవ్వు తగ్గే ప్రక్రియను వేగవంతం చేయడానికి సహాయపడుతుంది. ఒకవేళ జిమ్‌లో పనితీరు తగ్గితే, ఆహారాన్ని కాకుండా కార్డియోను తగ్గించడం మంచిదని కూడా ఆయన తెలిపారు.
అత్యంత కీలకమైన దశ
ఇందులో అధిక ఫలితాలు, గొప్ప ప్రయోజనాలు లభిస్తాయి కాబట్టి, రెండు లేదా మూడు విడతలుగా (సెషన్లలో) మొత్తం 20,000 అడుగులు నడవాలని ఆయన సూచించారు. ప్రతి దశకు తగిన కార్డియో వ్యాయామాలను వివరించడంతో పాటు, ఏ దశలో ఉన్నవారైనా సరే వారానికి కనీసం మూడు లేదా నాలుగు సార్లు బరువులు ఎత్తే వ్యాయామాలు (వెయిట్ లిఫ్టింగ్) చేయాలని కూడా సూచించారు. ఇలా కార్డియోని పెంచుకుంటే మెరుగైన ఫలితాలు అందుకోవడమే గాక ఆటోమేటిగ్గా బరువు కూడా తగ్గుతారని చెబుతున్నారు కువార్ కపూర్.
గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.
(చదవండి: పదవిలో ఉండగా తండ్రైన తొలి ఉపాధ్యక్షుడు..హాట్‌టాపిక్‌గా ఆ శాపం..!)
Tags : 1