Breaking News

ప్లీజ్‌ పట్టుచీరను ఎలా ఉతకాలో చెప్పరు..!: ఓ విదేశీ మహిళ అభ్యర్థన

Published on Tue, 07/14/2026 - 11:30

మహిళామణులకు పట్టు చీర అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అదివాళ్లకు ఒక వస్త్రం మాత్రమే కాదు ఒక హుందాతనాన్ని, పండుగ వాతావరణాన్ని అందించే జ్ఞాపకాల చీర. ఆ చీరలో వాళ్లకు ఏళ్ల తరబడి పదిలంగా దాచుకున్న జ్ఞాపకాలు ఉంటాయి. అలాంటి చీర భారతీయ మహిళలకే కాదు విదేశీ వనితల మనసులను సైతం గెలుచుకుంది. అలాంటి మన భారతీయ పట్టుచీరను కొనుకున్న ఓ విదేశీ మహిళ దాన్ని ఎలా ఉతకాలో తెలియక ఇబ్బందిపడుతున్నా..దయచేసి ఏదైన సలహా ఇవ్వరు అంటూ వీడియో రికార్డు చేసి మరి సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది.

నెట్టింట పంచుకున్న వీడియోలో ఆ విదేశీ మహిళ భారతీయ మహిళలను ఉద్దేశించి ఒక అభ్యర్థన చేసింది. తన అందమైన పట్టు చీరను చూపిస్తూ..దాని లేబుల్‌పై డ్రైక్లీనింగ్‌ చేసి ఉతకాలని ఉంది. అయితే తాను ఉండే ఆస్ట్రేలియన్‌ బుష్‌లో డైక్లీనింగ్‌ సర్వీస్‌ సమీపంలో లేదని, అందువల్ల ఈ పట్టుచీరను ఎలా ఉతకాలో సలహా ఇవ్వరా ప్లీజ్‌ అని కోరింది. తాను ఆస్ట్రేలియాలోని ఓ మారుమూల ప్రాంతంలో ఉంటానని, అందువల్ల ఇది పాడవ్వకుండా ఎలా ఉతకాలో చక్కటి చిట్కా గానీ సలహా గానీ చెప్పమని అభ్యర్థించిందామె. 

తాను భారత పర్యటనలో ఈ అందమైన చీర కొన్నానని చెప్పింది. ఈ సున్నితమైన పట్టు వస్త్రంపై ఉన్న క్లిష్టమైన ఎంబ్రాయిడరీ కారణంగా ఉతకడానికి భయపడుతున్నట్లు పేర్కొంది. ఉతకడంలో ఏ చిన్న పొరపాటు జరిగినా..చీర మొత్తం పాడైపోతుంది, అందువల్ల ఎలా ఉతకాలో నేర్పించరు అంటూ తన వీడియోని ముగించింది. అంతేగాదు అందుకు సంబంధించిన చిట్కాలు, సలహాలు కామెంట్‌ బాక్స్‌లో పంచుకోమని, తాను వినడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పుకొచ్చింది. 

అలాగే ఎల్లప్పుడూ తన అనుమానాలు, సందేహాలు నివృత్తి చేసే ఆన్‌లైన్‌ కమ్యూనిటీకి ధన్యావాదాలు కూడా చెప్పారామె. ఆమె అభ్యర్థనకు నెటిజన్లు స్పందించడమే కాదు పలు రకాల సలహాలు, సూచనలు అందించారు. చాలామంది మహిళలు కఠినమైన డిటర్జెంట్‌కి బదులుగా షాంపుతో ఉతికి నీడలో ఆరేసి భద్రపరచుకుంటే సరిపోతుందని సలహాలు ఇచ్చారు. అంతేగాదు బ్రష్‌ ఉపయోగించొద్దని, చేతులతోనే సున్నితంగా రుద్దమని కూడా సూచించారు. 

 

(చదవండి: శస్త్ర చికిత్స లేకుండా ఏఐ ఎండోమెట్రియోసిస్‌ను నిర్థారించగలదా? బ్రయాన్ జాన్సన్ గర్లఫ్రెండ్‌..)
 

Videos

ట్రంప్ వెనక్కి తగ్గిన వెనుక షాకింగ్ నిజాలు

బాబుకు పవన్ బిగ్ షాక్

విశ్వసనీయత లేని బాబు మాటలు

మీరు రావొద్దు... ప్రభుత్వ లాంఛనాలు అవసరం లేదు...

CI వేధింపులు తట్టుకోలేక పుట్టినరోజు నాడే

టీమిండియాకు బ్యాడ్ న్యూస్.. రెండో వన్డే నుంచి గిల్ ఔట్?

సాయి కృష్ణ కేసుపై తల్లి వెనకడుగు అడ్వకేట్ సంచలన వ్యాఖ్యలు

నేను విన్నాను...!. నేను ఉన్నాను..!

ముద్రగడ ఇంటి వద్ద పోలీసుల ఓవర్ యాక్షన్ ఇచ్చిపడేసిన అంబటి

బిజ్లీ మహాదేవ్ అసలు రహస్యం! సైన్స్ కు అర్థంకాని శివుడి మహిమ

Photos

+5

రాధిక భర్త శరత్‌కుమార్ బర్త్ ‍డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

ముద్రగడకు కన్నీటి వీడ్కోలు.. పాడె మోసిన వైఎస్‌ జగన్‌ (ఫొటోలు)

+5

కొరియన్ అమ్మాయితో మహేశ్ మేనల్లుడి పెళ్లి సందడి (ఫొటోలు)

+5

ఆక్వా రైతులకు బాసటగా.. వైఎస్‌ జగన్‌ భీమవరం పర్యటన (ఫొటోలు)

+5

ప్రెగ్నెన్సీతోనూ సమంత ఫారిన్ ట్రిప్ (ఫొటోలు)

+5

జగపతిబాబు-లయ 'వదలా' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

'ఆపరేషన్ అరుణారెడ్డి' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

పింక్ శారీలో బాలీవుడ్ భామ మాధురి దీక్షిత్‌ అందాలు.. ఫోటోలు

+5

ఫ్రెండ్ పార్టీలో బాలీవుడ్ భామ ఆలియా భట్ సందడి.. ఫోటోలు

+5

కూతురి పెళ్లి.. ఫ్యామిలీ ఫొటోలు షేర్ చేసిన నిర్మాత (ఫొటోలు)