Breaking News

నటి త్విషా శర్మ కేసులో కీలక పరిణామం.. తర్వాత ఏం జరగబోతోంది?

Published on Sun, 07/12/2026 - 10:09

ఇండోర్: దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన మోడల్, నటి ట్విషా శర్మ అనుమానాస్పద మృతి కేసులో సరికొత్త మలుపు చోటు చేసుకుంది. త్విషా శర్మది ఆత్మహత్య కాదని, ఆమెను దారుణంగా హత్య చేశారని నిర్ధారించేలా బలమైన శాస్త్రీయ ఆధారాలు లభ్యమయ్యాయి  

ఆమె శరీరంపై ఉన్న గాయాల గుర్తులు జిమ్ బెల్ట్ వల్ల ఏర్పడినట్లు ఢిల్లీ ఎయిమ్స్  వైద్య నిపుణుల బృందం తేల్చింది . ఈ మేరకు సిద్ధం చేసిన 11 పేజీల సుదీర్ఘ నివేదికను ఎయిమ్స్ అధికారులు అత్యంత రహస్యంగా  కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి అందజేశారు. 

సుప్రీంకోర్టు, మధ్యప్రదేశ్ హైకోర్టుల ప్రత్యేక ఆదేశాల మేరకు ఎయిమ్స్ ఫోరెన్సిక్ విభాగాధిపతి డాక్టర్ సుధీర్ గుప్తా నేతృత్వంలోని నిపుణుల బృందం త్విషా శర్మ చర్మ కణజాలాలను సేకరించి అత్యాధునిక హిస్టోపాథాలజీ పరీక్షలు నిర్వహించింది .

ఈ శాస్త్రీయ పరీక్షల్లో  ట్విషా శర్మ  మెడ, శరీరంపై ఉన్న లోతైన గాయాలు, ఆమెను లొంగదీసుకుని ఉరి బిగించేందుకు జిమ్నాస్టిక్ లేదా జిమ్ బెల్టును క్రూరంగా ఉపయోగించడం వల్లే సంభవించాయని వెల్లడైంది ఈ మృతికి గల ఖచ్చితమైన కారణాలను, అంతర్గత గాయాలను విశ్లేషించడానికి మెడికల్ బోర్డు నెల రోజుల పాటు జాతీయ, అంతర్జాతీయ వైద్య జర్నల్స్, ఫోరెన్సిక్ శాస్త్రీయ పద్ధతులను క్షుణ్ణంగా పరిశీలించింది

కోర్టు ఆదేశాల ప్రకారం నివేదికలోని పూర్తి వివరాలను బహిర్గతం చేయడానికి డాక్టర్ సుధీర్ గుప్తా నిరాకరించారు  ఈ ఎయిమ్స్ నివేదిక ఆధారంగా ఇకపై సీబీఐ దర్యాప్తు జరిపి త్వరలోనే అసలు నిజానిజాలను, నిందితులను చట్టం ముందు నిలబెట్టనుందని ఆయన పేర్కొన్నారు  

నటి ట్విషా శర్మకు వివాహమైన కేవలం 5 నెలలకే, గత మే 12న మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో గల తన అత్తగారి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించారు. ట్విషా భర్త సమర్థ్ సింగ్ తల్లి గిరిబాలా సింగ్ ఒక విశ్రాంత జిల్లా న్యాయమూర్తి కావడంతో, స్థానిక పోలీసులు నిందితులకు కొమ్ముకాస్తున్నారని, దర్యాప్తును పక్కదారి పట్టిస్తున్నారని త్విషా తల్లిదండ్రులు తీవ్ర ఆరోపణలు చేశారు  

స్థానిక పోలీసుల తీరుపై నమ్మకం లేకపోవడంతో వారు న్యాయం కోసం దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. బాధితుల అభ్యర్థనను పరిశీలించిన న్యాయస్థానం, ఈ కేసు దర్యాప్తును తక్షణమే సీబీఐకి బదిలీ చేయడమే కాకుండా, ఎయిమ్స్ చేత ఫోరెన్సిక్ రీ-ఎగ్జామినేషన్ చేయించాలని ఆదేశించింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఎయిమ్స్ నివేదికతో ఈ కేసులో అత్తగారి కుటుంబ సభ్యుల చుట్టూ ఉచ్చు బిగుసుకునే అవకాశం కనిపిస్తోంది.

Videos

నాగార్జున యాదవ్ అరెస్ట్ వెనుక..

షాబాద్ నిందితుడు సైకో కిల్లర్ అరెస్ట్?

YSRCP అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ అరెస్ట్..

మా భూములు అమ్ముకోడానికి నువ్వు ఎవడివి... మీ అబ్బ కొడుకులకి ఇదే మా వార్నింగ్

కాంతార 3 లోడింగ్.. 1000 కోట్లు టార్గెట్ గా రిషబ్ శెట్టి

ఖమేనీ మృతికి ప్రతీకారం తప్పదు.. ఇరాన్ మాస్ వార్నింగ్

రైతులు పిచ్చి నా కొడుకుల్లాగా కనిపిస్తున్నారా... తోలు తీస్తాం ఏమనుకున్నారో...

తమిళ హీరో ఆర్యపై హైదరాబాద్ లో చీటింగ్ కేసు

గల్ఫ్ దేశాల్లో బాంబుల మోత... కువైట్, ఖతార్ లో భారీ పేలుళ్లు

చంద్రబాబుకు కోపమొచ్చింది.. పబ్లిక్ మీటింగులో సీరియస్ వార్నింగ్

Photos

+5

అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ పెళ్లికి అప్పుడే రెండేళ్లు (ఫోటోలు)

+5

అన్షులా కపూర్ వెడ్డింగ్ పార్టీ.. బాలీవుడ్ తారల సందడి (ఫోటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (జూలై 12 - 19)

+5

లెజెండరీ సింగర్ జానకి భౌతికకాయానికి సినీ, రాజకీయ ప్రముఖులు నివాళి (ఫోటోలు)

+5

యూత్’ ఫేం మీనాక్షి దినేష్ స్టన్నింగ్‌ లుక్స్‌ (ఫోటోలు)

+5

శ్రీనివాస మంగాపురం ప్ర‌మోష‌న్స్‌.. ఫోటోలు షేర్ చేసిన రాషా తడాని..

+5

‘లెనిన్‌’సక్సెస్‌ మీట్‌లో స్పెషల్‌ అట్రాక్షన్‌గా భాగ్యశ్రీ బోర్సే (ఫోటోలు)

+5

కుటుంబ సమేతంగా శివన్న 64వ బర్త్‌డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

అఖిల్‌ ‘లెనిన్‌’ సక్సెస్‌మీట్‌(ఫోటోలు)

+5

ప్రముఖ గాయని ఎస్.జానకి అరుదైన ఫోటోలు