Breaking News

కారం దోసెలు ఫుల్లుగా లాగించాను: రాషా తడానీ

Published on Sun, 07/12/2026 - 03:50

‘తెలుగు సినిమాలంటే నాకు చాలా ఇష్టం. ‘బాహుబలి’ నాకు నచ్చిన చిత్రం. తెలుగు సినిమా చాలా అడ్వాన్డ్స్‌గా ఉంది. అందుకే తెలుగు సినిమా చేయాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నాను. ఆ చాన్స్‌ ‘శ్రీనివాస మంగాపురం’తో లభించినందుకు సంతోషంగా ఉంది. అలాగే నా తొలి తెలుగు సినిమా ‘శ్రీనివాస మంగాపురం’ చిత్రీకరణ తిరుపతిలో జరగడం నా అదృష్టం. దేవుడు, ప్రేక్షకుల ఆశీస్సులతో ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు రాషా తడానీ. జయకృష్ణ ఘట్టమనేని, రాషా తడానీ హీరో హీరోయిన్లుగా పరిచయం అవుతున్న సినిమా ‘శ్రీనివాస మంగాపురం’. 

అశ్వినీదత్‌ సమర్పణలో అజయ్‌ భూపతి దర్శకత్వంలో పి. కిరణ్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 30న విడుదల కానుంది. శనివారం విలేకరుల సమావేశంలో రాషా తడానీ మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో శ్రీను పాత్రలో జయకృష్ణ, మంగ పాత్రలో నేను నటించాం. మంగ పాత్రలో రెండు షేడ్స్‌ ఉంటాయి. ఈ పాత్ర నా నిజ జీవితానికి దగ్గరగా ఉంటుంది. అజయ్‌ భూపతిగారు ప్రతి డైలాగ్, అందులోని ఎమోషన్‌ను దగ్గరుండి నేర్పించారు. అశ్వినీదత్‌గారు నన్ను మనవరాలిలా చూసుకున్నారు. ఈ సినిమా షూటింగ్‌ అంతా ఒక విహార యాత్రలా గడిచింది. 

నేనైతే కారం దోసెలు ఫుల్లుగా లాగించాను. అలాగే సీరియస్‌గా వర్క్‌ చేయాలన్నప్పుడు సీరియస్‌గానే చేశాం. మా అమ్మానాన్నలకు కూడా తెలుగు సినిమా అంటే అభిమానమే. మా నాన్నగారు (డిస్ట్రిబ్యూటర్‌–నిర్మాత అనిల్‌ తడానీ) ఓ సందర్భంలో ముంబై నుంచి హైదరాబాద్‌కు షిఫ్ట్‌ అవ్వాలనుకున్నారు. కానీ కుదరలేదు. ప్రస్తుతం తెలుగు భాష అర్థం అవుతోంది. పూర్తిగా నేర్చుకోమని మా అమ్మ సలహా ఇచ్చారు. 

నేనూ నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. నాకు డిఫరెంట్‌ రోల్స్‌ చేయాలని ఉంది. నా తొలి హిందీ చిత్రం ‘ఆజాద్‌’ పీరియాడికల్‌ మూవీ. ఆ తర్వాత చేసిన ‘లైకీ లైకా’ డిఫరెంట్‌ లవ్‌ ఫిల్మ్‌. ‘శ్రీనివాస మంగాపురం’ విలేజ్‌ లవ్‌స్టోరీ. హిందీలో కామెడీ సినిమా చేస్తున్నాను. ఇలా విభిన్న జానర్స్‌లో సినిమాలు చేయాలని ఉంది’’ అని అన్నారు. 

Videos

నాగార్జున యాదవ్ అరెస్ట్ వెనుక..

షాబాద్ నిందితుడు సైకో కిల్లర్ అరెస్ట్?

YSRCP అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ అరెస్ట్..

మా భూములు అమ్ముకోడానికి నువ్వు ఎవడివి... మీ అబ్బ కొడుకులకి ఇదే మా వార్నింగ్

కాంతార 3 లోడింగ్.. 1000 కోట్లు టార్గెట్ గా రిషబ్ శెట్టి

ఖమేనీ మృతికి ప్రతీకారం తప్పదు.. ఇరాన్ మాస్ వార్నింగ్

రైతులు పిచ్చి నా కొడుకుల్లాగా కనిపిస్తున్నారా... తోలు తీస్తాం ఏమనుకున్నారో...

తమిళ హీరో ఆర్యపై హైదరాబాద్ లో చీటింగ్ కేసు

గల్ఫ్ దేశాల్లో బాంబుల మోత... కువైట్, ఖతార్ లో భారీ పేలుళ్లు

చంద్రబాబుకు కోపమొచ్చింది.. పబ్లిక్ మీటింగులో సీరియస్ వార్నింగ్

Photos

+5

అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ పెళ్లికి అప్పుడే రెండేళ్లు (ఫోటోలు)

+5

అన్షులా కపూర్ వెడ్డింగ్ పార్టీ.. బాలీవుడ్ తారల సందడి (ఫోటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (జూలై 12 - 19)

+5

లెజెండరీ సింగర్ జానకి భౌతికకాయానికి సినీ, రాజకీయ ప్రముఖులు నివాళి (ఫోటోలు)

+5

యూత్’ ఫేం మీనాక్షి దినేష్ స్టన్నింగ్‌ లుక్స్‌ (ఫోటోలు)

+5

శ్రీనివాస మంగాపురం ప్ర‌మోష‌న్స్‌.. ఫోటోలు షేర్ చేసిన రాషా తడాని..

+5

‘లెనిన్‌’సక్సెస్‌ మీట్‌లో స్పెషల్‌ అట్రాక్షన్‌గా భాగ్యశ్రీ బోర్సే (ఫోటోలు)

+5

కుటుంబ సమేతంగా శివన్న 64వ బర్త్‌డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

అఖిల్‌ ‘లెనిన్‌’ సక్సెస్‌మీట్‌(ఫోటోలు)

+5

ప్రముఖ గాయని ఎస్.జానకి అరుదైన ఫోటోలు