మొసాద్ కంటే డేంజర్.. రోమాలు నిక్కబొడుచుకునే వీడియో
Breaking News
జన నాయగన్.. ఎట్టకేలకు రిలీజ్ డేట్ ఫిక్స్..!
Published on Thu, 07/09/2026 - 15:38
దళపతి విజయ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న చిత్రం జన నాయగన్. సంక్రాంతి రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం సెన్సార్ సమస్యలతో ఇప్పటి వరకు రిలీజ్ కాలేదు. విజయ్ సీఎం అయ్యాక కూడా ఈ మూవీ విడుదలకు నోచుకోలేదు. జన నాయగన్ రిలీజ్ డేట్‌పై మేకర్స్ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.
అయితే తాజాగా ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ జన నాయగన్ విడుదల తేదీని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈనెల 24న థియేటర్లలో సందడి చేయనుందని పోస్టర్స్ రిలీజ్ చేస్తున్నారు. కెనడాలో జన నాయగన్ రిలీజ్ చేస్తున్నట్లు యార్క్ సినిమాస్ ప్రత్యేక పోస్టర్‌ను షేర్ చేసింది. ఎట్టకేలకు ఆరు నెలల తర్వాతనైనా జన నాయగన్ థియేటర్లలో సందడి చేయనుంది.
పాలిటిక్స్‌లో ఎంట్రీకి ముందు ఇదే నా చివరి సినిమా అని విజయ్ ప్రకటించాడు. ఈ మూవీకి హెచ్ వినోద్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో పూజా హెగ్డే, మమితా బైజు హీరోయిన్లుగా నటించారు.
🔥 Finally! Our Own Thalapathy Vijay is ready to set the big screen on fire with #JanaNayagan💥
🇨🇦 Canada Release by York Cinemas
🎬 Igniting screens from July 24.
Get ready for the ultimate theatrical celebration.
Stay tuned for tickets 🎫#thalapathyvijay #yorkcinemas pic.twitter.com/CcyiZAZqUp— York Cinemas (@yorkcinemas) July 8, 2026
Tags : 1