Breaking News

256 గంటలు, 131 మంది శ్రమ : ఆమీర్‌-గౌరీ అరుదైన వెడ్డింగ్‌ రింగ్‌

Published on Thu, 07/09/2026 - 12:01

బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ జూలై 5న తన బాంద్రా నివాసంలో గౌరీ స్ప్రాట్‌ను వివాహం చేసుకున్నారు. అయితే అప్పటినుంచి ఈ వేడుకకు సంబంధించిన విశేషాలు నెట్టింట హాట్‌ టాపిక్‌గా నిలుస్తున్నాయి. ఆమీర్‌ మొదటి, రెండో భార్య, పిల్లలు,ఇతర కుటుంబ సభ్యులతో పాటు,కొద్దిమంది స్నేహితుల సమక్షంలో ఆమీర్‌-గౌరి వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. ఈ ఈవెంట్‌లో ఆమీర్‌, గౌరి మ్యాచింగ్‌ సాంప్రదాయ దుస్తుల్లో అందంగా మెరిసారు. అలాగే ఆమీర్‌ ఒక కాలికి మాత్రమే పెట్టుకున్న మువ్వలు, గౌరీ స్ప్రాట్ పాస్టెల్ రంగు లెహంగా, లేయర్డ్ నెక్లెస్‌లు పఠానీ హారం ధరించి అందర్నీ ఆకట్టుకున్నారు. చాలా అరుదైన వీరి వెడ్డింగ్‌ రింగ్‌పై ఆసక్తి నెలకొంది. అలాగే దీనికి సంబంధించిన విషయాలు వైరలవుతున్నాయి.

కొత్త పెళ్లికూతురు గౌరీ రూబీ (కెంపు) వెడ్డింగ్ రింగ్  స్పెషల్‌ ఎట్రాక్షన్‌. దీన్ని లగ్జరీ జ్యువెలరీ బ్రాండ్ 'QWEEN' దీనిని డిజైన్ చేసింది. ఇందులో మడగాస్కర్ నుండి సేకరించిన అత్యంత అరుదైన 'సహజ క్యాబోచన్-కట్ రూబీ' (cabochon-cut ruby) ని ఉపయోగించారు. ఇది మిలియన్‌లో ఒకటి మాత్రమే దొరికేంత అరుదైనది. ఈ రూబీ చుట్టూ దాదాపు 40 సహజమైన వజ్రాలను (diamonds) పొదిగారు.ఈ రత్నాన్ని వెతకడానికే మూడు నెలలకు పైగా సమయం పట్టింది. 'QWEEN' సంస్థ కో-ఫౌండర్ అమిత్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. 131 మంది నైపుణ్యం గల చేతి వృత్తికళాకారులు  256 గంటల కంటే ఎక్కువ సమయం  సరిగ్గా చెప్పాలంటే 10 రోజుల16 గంటలు (దాదాపుగా పదిన్నర రోజులకు పైగా)శ్రమించి, ఈ రింగ్‌ను డిజైన్ చేశారు.

ఇదీ చదవండి: ఆమీర్‌ భార్య గౌరి బ్రైడల్‌ లుక్‌ : 'పఠానీ హార్' విశేషాలు తెలుసా?

 ఏంటీ ప్రత్యేకత  
ఈ రూబీ చుట్టూ దాదాపు 40 సహజమైన వజ్రాలను (diamonds) పొదిగారు.  సాధారణ రింగ్స్ లాగా కాకుండా, ఈ రూబీని ఒక క్రోన్ లాంటి నిర్మాణంలో అమర్చారు. దీని  కటింగ్‌ కూడా 'క్యాబోచన్ కట్' (మృదువైన, గుండ్రని ముగింపు) ఇవ్వడం వల్ల ఈ రత్నం మరింత ప్రకాశవంతంగా కనిపిస్తుంది. చారిత్రక రాజకుటుంబాల నగలను గుర్తుచేసేలా 'మిల్‌గ్రెయిన్ బీడింగ్' (milgrain beading) శైలిలో దీనిని రూపొందించారు. భవిష్యత్తు తరాలకు అందించే ఒక అపురూపమైన ఆస్తిగా ఉండేలా ఈ రింగ్‌ను తీర్చిదిద్దారు. మరోవైపు ఈ ఏడాది ఆరంభంలోనేచిరకాల ప్రియురాలు గౌరీ స్ప్రాట్ వేలికి బ్రెజిల్ దేశానికి చెందిన అరుదైన ‘ఆక్వామెరైన్’ (Aquamarine) రింగ్  ఆమీర్‌  ప్రత్యేకంగా చేయించి మరి ఇచ్చారట.

ఇదీ చదవండి: రెడ్‌ బెనారసీ డ్రెస్‌లో పార్టీ లుక్‌.. తొలిసారి ఇలా అన్షులా!

Videos

గొడ్డలి పార్టీ మాదే... ఒప్పుకున్నా టీడీపీ లీడర్

NSE IPOకి త్వరలోనే గ్రీన్ సిగ్నల్ LISTING ఎప్పుడంటే?

ఈ నెల 15న భీమవరంలో జగన్ పర్యటన

పరిటాల కుటుంబం MS రాజును వాడుకుంది, హత్యలు, మానభంగాలు చేసే పార్టీ మీది

మృత్యుంజయుడు కారె చిన్నాను ఫోన్ లో పరామర్శించిన జగన్

పోక్సో కేసులో బండి భగీరథ్ కు బెయిల్

బాబు చిర్రు.. బుర్రు మహిళపై అనుచిత ప్రవర్తన వీడియో లీక్

Alగా అంబటి రాంబాబు అని పెట్టండి ఏపీ పోలీస్ తీరుకు స్ట్రాంగ్ కౌంటర్

ఏపీ ప్రజల ఫుల్ సపోర్ట్ Ys జగన్ మావిగన్ పైనే ఉంది

దమ్ముంటే రా తేల్చుకుందాం రఘురామకు జడ శ్రవణ్ సవాల్

Photos

+5

తిరుమల శ్రీవారి సేవలో యాంకర్ శ్రీముఖి (ఫొటోలు)

+5

కుమారుడు, భార్యతో టీమిండియా స్టార్‌ ట్రిప్‌ (ఫొటోలు)

+5

వైజాగ్‌లో సందడి చేసిన 'రాజాసాబ్' బ్యూటీ (ఫొటోలు)

+5

ట్రెండింగ్ బ్యూటీ శ్వాసిక చీరలో అలా (ఫొటోలు)

+5

మూడు జనరేషన్లతో హీరోయిన్ మెమరబుల్ ట్రిప్ (ఫొటోలు)

+5

రోజురోజుకీ సన్నబడిపోతున్న కాజల్ (ఫొటోలు)

+5

‘లెనిన్’ మూవీ ప్రీ రిలీజ్ ప్రెస్‌మీట్‌లో భాగ్య‌శ్రీ బోర్సే .. (ఫొటోలు)

+5

సీక్రెట్ గా డైరెక్టర్ ను రెండో పెళ్లి చేసుకున్న కలర్స్ స్వాతి ట్రెండింగ్ లో (ఫొటోలు)

+5

'లెనిన్' సినిమా ప్రీ రిలీజ్‌ ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

వేడుకగా నిర్మాత బోనీ కపూర్ కూతురి రిసెప్షన్ (ఫొటోలు)