Breaking News

ఎప్పుడూ హిత, మిత, స్మిత, సత్య వచనాలే పలకాలి..

Published on Thu, 07/09/2026 - 07:59

నం మాట్లాడే మాటల శబ్దాలు మనపైన, ప్రకృతిపైన ప్రభావం చూపుతాయి. అవే శబ్దాలు వేద మంత్రాలకు సంబంధించినవైతే మరింత గాఢమైన ప్రభావాన్ని చూపుతాయి. అశుద్ధమైన మాటలు వినడం, చెడు దృశ్యాలు చూడటం వంటివి మనసుపై చెడు ప్రభావం చూపుతాయి. ప్రియమైన మాటలు మాట్లాడితే సకల ప్రాణులూ ఆనందిస్తాయి. ఎప్పుడూ హిత, మిత, స్మిత, సత్య వచనాలే పలకాలి. వినయ పూర్వక సత్య వచనాలు పలకడం ద్వారానే బంధువులు, స్నేహితులు దగ్గర అవుతారు. అలా మాట్లాడ గలిగే వారు సంఘంలో రాణిస్తారు.

తైత్తిరీయారణ్యకం ‘మనో వాక్కాయ కర్మాణి శుధ్యన్తామ్‌’ అని చెప్పింది. అంటే మనస్సు, మాట, పనులను (త్రికరణములు) పరిశుద్ధంగా ఉంచుకోవాలి. ఇతరుల మనసులు గాయపరుస్తూ, బాధించేలా మాట్లాడకూడదు. అలా చేయడం కూడా హింసే అన్నారు గాంధీజీ. మాట్లాడగలిగే శక్తి ఉంది కదా అని దుర్భాషలాడ రాదు. చెడు మాటలు మాట్లాడుతూ వాక్శక్తిని దుర్వినియోగం చేయరాదు. అలా మాట్లాడితే ముందు నోరు, తద్వారా, మనస్సు మైలపడతాయి. కనుక చక్కగా, జనరంజకంగా మాట్లాడటం సాధన చేయాలి. ‘మధుర భాషణమున మర్యాదప్రాప్తించు’ అన్నారు పెద్దలు. మంచి మాట ఆభరణమే కాదు, దివ్యశక్తి కూడా! దానిని మనం మితంగా, జాగ్రత్తగా వినియోగించాలి. రఘువంశపు రాజులందరూ ‘సత్యాయ మిత భాషిణాం’ అని కాళిదాస మహాకవి అన్నారు. అంటే సత్య సంరక్షణార్థం ఆ రాజులు మిత భాషిత్వాన్ని పాటించారని అర్థం.

మనిషికి నాలుక ముందు పుట్టి తర్వాత దంతాలు ఏర్పడుతాయి. కానీ నాలుక కంటే  వెనుక పుట్టిన దంతాలే ముందుగా ఎందుకు ఊడిపోతాయి అనే ప్రశ్నకు శ్రీ రామకృష్ణ పరమహంస చక్కని వివరణ ఇచ్చారు. ‘దంతాలు కఠినంగా ఉంటాయి. వాటికి వినయంతో కూడిన మెత్తదనం లేదు. నాలుక మృదువుగా అణకువతో ఉండి త్వరగా బయటకు కనపడదు. అందుకే రెండు పలు వరుసల మధ్య అది సురక్షితంగా ఉంటుంది’ అన్నారాయన. వినయంతో మిత భాషులైనవారు సురక్షితంగా ఉంటారు. కఠినాత్ములు, పరుష వాక్కు గల వారు త్వరగా రాలిపోతారని అర్థం చేసుకోవాలి.

మన మాటల వలన జనించే శబ్దం చాలా శక్తిమంతమైనది. అవి వినేవారి మనస్సు పైన, దేహం పైనా అపరిమిత ప్రభావాన్ని చూపుతుంది. దుఃఖిస్తున్న వారి పట్ల దయతో సాంత్వన వచనాలు పలికితే వారి శోకం ఉపశమిస్తుంది. ఎవరి పట్లనైనా పరుష పదాలతో కఠినంగా మాట్లాడితే అవతలి వారు కోపోద్రిక్తులై పరిస్థితి విషమిస్తుంది. అందువల్ల వీలైనంత మేరకు మధురంగా... హితంగా.. మితంగా మాట్లాడటమే మంచిదని పెద్దలు చెప్పారు.

మాట్లాడ గలిగే శక్తి ఉంది కదా అని దుర్భాషలాడ రాదు. చెడు మాటలు మాట్లాడుతూ వాక్శక్తిని దుర్వినియోగం చేయరాదు. అలా మాట్లాడితే ముందు నోరు, తద్వారా, మనస్సు మైలపడతాయి. కనుక చక్కగా, జనరంజకంగా మాట్లాడటం సాధన చేయాలి.
– డాక్టర్‌ పాణ్యం వసుంధర

  • నిర్వహణ డి.వి.ఆర్‌

Videos

గొడ్డలి పార్టీ మాదే... ఒప్పుకున్నా టీడీపీ లీడర్

NSE IPOకి త్వరలోనే గ్రీన్ సిగ్నల్ LISTING ఎప్పుడంటే?

ఈ నెల 15న భీమవరంలో జగన్ పర్యటన

పరిటాల కుటుంబం MS రాజును వాడుకుంది, హత్యలు, మానభంగాలు చేసే పార్టీ మీది

మృత్యుంజయుడు కారె చిన్నాను ఫోన్ లో పరామర్శించిన జగన్

పోక్సో కేసులో బండి భగీరథ్ కు బెయిల్

బాబు చిర్రు.. బుర్రు మహిళపై అనుచిత ప్రవర్తన వీడియో లీక్

Alగా అంబటి రాంబాబు అని పెట్టండి ఏపీ పోలీస్ తీరుకు స్ట్రాంగ్ కౌంటర్

ఏపీ ప్రజల ఫుల్ సపోర్ట్ Ys జగన్ మావిగన్ పైనే ఉంది

దమ్ముంటే రా తేల్చుకుందాం రఘురామకు జడ శ్రవణ్ సవాల్

Photos

+5

తిరుమల శ్రీవారి సేవలో యాంకర్ శ్రీముఖి (ఫొటోలు)

+5

కుమారుడు, భార్యతో టీమిండియా స్టార్‌ ట్రిప్‌ (ఫొటోలు)

+5

వైజాగ్‌లో సందడి చేసిన 'రాజాసాబ్' బ్యూటీ (ఫొటోలు)

+5

ట్రెండింగ్ బ్యూటీ శ్వాసిక చీరలో అలా (ఫొటోలు)

+5

మూడు జనరేషన్లతో హీరోయిన్ మెమరబుల్ ట్రిప్ (ఫొటోలు)

+5

రోజురోజుకీ సన్నబడిపోతున్న కాజల్ (ఫొటోలు)

+5

‘లెనిన్’ మూవీ ప్రీ రిలీజ్ ప్రెస్‌మీట్‌లో భాగ్య‌శ్రీ బోర్సే .. (ఫొటోలు)

+5

సీక్రెట్ గా డైరెక్టర్ ను రెండో పెళ్లి చేసుకున్న కలర్స్ స్వాతి ట్రెండింగ్ లో (ఫొటోలు)

+5

'లెనిన్' సినిమా ప్రీ రిలీజ్‌ ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

వేడుకగా నిర్మాత బోనీ కపూర్ కూతురి రిసెప్షన్ (ఫొటోలు)