రావణ్ సంచలన వీడియో పవన్ వెన్నులో వణుకు
Breaking News
బోనీ కపూర్ కూతురి పెళ్లి.. పంజాబీ సంప్రదాయంలో వేడుకలు
Published on Mon, 07/06/2026 - 16:50
ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ కూతురు త్వరలోనే పెళ్లి పీటలెక్కనుంది. ఆయన మొదటి భార్య కూతురైన అన్షులా కపూర్ పెళ్లి వేడుకలు ఇటీవలే మొదలయ్యాయి. గతేడాది ప్రియుడు రోహన్ థక్కర్తో నిశ్చితార్థం చేసుకున్న అన్షులా ఈ ఏడాది పెళ్లి బంధంలోకి అడుగుపెట్టనుంది.
పెళ్లి వేడుకల్లో భాగంగా పంజాబీ సంప్రదాయంలో చుడా వేడుక నిర్వహించారు. ఈ వేడుకలో అన్షులా కపూర్ బ్రదర్ అర్జున్ కపూర్ ఫుల్ ఎమోషనల్ అయ్యాడు. తన సిస్టర్ను హత్తుకుని భావోద్వేగానికి గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పంచుకుంది అన్షులా కపూర్. అతను ఇంత నిబద్ధతతో ఉండటం తాను ఎప్పుడూ చూడలేదని అన్షులా సరదాగా వ్యాఖ్యానించింది. ఈ వేడుకలో ఖుషీ కపూర్, ఓరీతో పాటు కుటుంబ సభ్యులు స్నేహితులు పాల్గొన్నారు. పంజాబీ సంప్రదాయం ప్రకారం ఈ వేడుక సమయంలో కలీరా ఎవరి తలపైనైనా పడితే.. నెక్ట్స్ ఆ వ్యక్తి వివాహం చేసుకోబోతున్నారని నమ్ముతారు.
కాగా.. అన్షులా కపూర్, రోహన్ థక్కర్ల నిశ్చితార్థం జూలై 2025లో జరిగింది. 2022లో ఆన్లైన్ డేటింగ్ ప్లాట్ఫామ్ ద్వారా మొదటిసారి కలుసుకున్నామని అన్షులా వెల్లడించింది. కాగా.. నిర్మాత బోనీ కపూర్ మొదటి భార్య పేరు మోనా శౌరీ కపూర్. ఈవిడ కూడా నిర్మాతే! వీరిద్దరూ 1983లో పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు అర్జున్ కపూర్, అన్షులా కపూర్ సంతానం. 1996లో బోనీ.. భార్య మోనాకు విడాకులిచ్చాడు. అదే ఏడాది హీరోయిన్ శ్రీదేవిని పెళ్లి చేసుకున్నాడు. వీరికి జాన్వీ కపూర్, ఖుషి కపూర్ సంతానం. కాగా మోనా శౌరీ.. 2012లో కన్నుమూయగా, శ్రీదేవి 2018లో మరణించింది. జాన్వీ, ఖుషి సవతి తల్లి కూతుర్లయినప్పటికీ అర్జున్, అన్షులా.. వారితో అన్యోన్యంగా ఉంటారు. ఒకే కుటుంబంలా కలిసిమెలిసి ఉంటారు.
Tags : 1