Breaking News

ఆ ఒక్క కారణం వల్లే 'అబ్సెషన్' చూశారు

Published on Sun, 07/05/2026 - 20:45

రీసెంట్ టైంలో ప్రపంచవ్యాప్తంగా ఓ సినిమా గురించి మాట్లాడుకున్నారు. అదే 'అబ్సెషన్'. కేవలం రూ.7 కోట్ల బడ్జెట్ పెట్టి తీస్తే రూ.3000 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చాయి. జనాలు ఎగబడి చూశారు. అతిప్రేమ ఎంత అనర్థాలకు దారితీస్తుందనే విషయాన్ని కాస్త డిఫరెంట్‌గా ఇందులో ప్రెజెంట్ చేశారు. అయితే టాలీవుడ్ ప్రముఖ నిర్మాత నాగవంశీ మాత్రం ఈ మూవీ గురించి భిన్నమైన కామెంట్స్ చేశారు. అవిప్పుడు వైరల్ అవుతున్నాయి.

(ఇదీ చదవండి: అవార్డులకు ఎన్నో దారులు.. చిరు వ్యాఖ్యలపై రాజేంద్రప్రసాద్ రియాక్షన్)

'జనాలు 'అబ్సెషన్' సినిమాని దాని టెక్నికల్ వాల్యూస్ కోసమో, కెమెరా వర్క్ కోసమో చూడలేదు. కేవలం ఆడపిల్లలోని శాడిజం చూసి ఎంజాయ్ చేయడానికే చూశారు. కానీ ఆ నిజాన్ని ఒప్పుకోవడానికి ఎవరికీ మనసు రాదు. ఒప్పుకోరు కూడా' అని నాగవంశీ చెప్పుకొచ్చారు. అఖిల్ హీరోగా నటించిన 'లెనిన్' ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.

కర్రీ బార్కర్ అనే అమెరికన్ యూట్యూబర్ తీసిన 'అబ్సెషన్' మూవీలో పెద్దగా కథేం ఉండదు. వయసులో ఉన్న ఓ కుర్రాడు తన స్నేహితురాలిని వన్ సైడ్ లవ్ చేస్తుంటాడు. ఆమె తనని మాత్రమే ప్రేమించాలని ఓ రోజు బలంగా కోరుకుంటాడు. కట్ చేస్తే నిజంగానే ఆమె ఇతడిని పిచ్చిపిచ్చిగా లవ్ చేస్తుంది. తర్వాత ఏమైంది? ఎంతటి విపత్కర పరిస్థితులకు దారితీసిందనేది మిగతా స్టోరీ. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో అద్దె విధానంలో స్ట్రీమింగ్ అవుతుంది.

(ఇదీ చదవండి: సెన్సేషనల్ సినిమా 'అబ్సెషన్' తెలుగు రివ్యూ)

Videos

చంద్రగిరిలో టెన్షన్.. టెన్షన్.. టీడీపీవాళ్ళు బూతులు తిడితే కేసులు ఉండవా?

ఉపా కేసు పెట్టాల్సింది పవన్ పైనే.. లైవ్ లో వీడియో చూపిస్తూ

పవన్ కు రావణ్, జడ శ్రావణ్ అంటే ఎందుకంత భయం..

ఇంట్లో నిద్రపొతే డైవర్స్

ఆకాశానికి చిల్లు పడిందా? ముంబైలో భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ

ప్రశ్నించడమే తప్పైతే, మమ్మల్ని ఒకేసారి చంపేయండి.. కన్నీటి ఆవేదన

నన్ను మోసం చేశాడు.. పృథ్వీ షా కాబోయే భార్య షాకింగ్ కామెంట్స్..

పులిచింతల ప్రాజెక్టు వద్ద హై టెన్షన్.. కార్మికుడు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం

మా ఇంట్లో వాళ్ళని తిడితే పడాలి.. మీ ఇంట్లో వాళ్ళని తిడితే కేసులా...?

రావణ్ అరెస్ట్ 14 రోజుల రిమాండ్.. ప్రకాష్ రాజ్ ఏమన్నారు?

Photos

+5

తిరుపతిలో ఘనంగా 'లెనిన్' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో నాగార్జున కుటుంబం (ఫొటోలు)

+5

మాల్దీవులు ట్రిప్ వేసిన హీరోహీరోయిన్ జంట (ఫొటోలు)

+5

ఎన్టీఆర్ బావమరిది కొత్త సినిమా గ్రాండ్ లాంచ్ (ఫొటోలు)

+5

ఒకప్పటి హీరోయిన్ ఇప్పుడు షాకిచ్చేలా.. గుర్తుపట్టారా? (ఫొటోలు)

+5

కొండపాక శ్రీ సత్య సాయి సంజీవని ఆసుపత్రిలో విజయ్ దేవరకొండ (ఫొటోలు)

+5

బుల్లితెర భామ జ్యోతి పూర్వాజ్ బర్త్‌ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

30ల్లో ఫ్రెండ్‌షిప్ ఇలా.. ఈ హీరోయిన్ గుర్తుందా? (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (జూలై 05 - 12)

+5

హైదరాబాద్‌లో జోరు వాన (ఫొటోలు)