Breaking News

జస్ట్ పదేళ్లు.. రష్మిక లైఫే మారిపోయింది

Published on Tue, 06/30/2026 - 08:57

కృషి, శ్రమ, పట్టుదల విజయానికి మూలాలు. ఆ తర్వాత అదృష్టం తోడవ్వాలి. ఇవన్నీ పుష్కలంగా ఉన్న అతికొద్దిమంది హీరోయిన్లలో రష్మిక పేరు కచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే సరిగ్గా పదేళ్ల క్రితం 'కిరిక్ పార్టీ' అనే కన్నడ మూవీతో నటిగా పరిచయమైంది. అలాంటి ఈమె.. పాన్ ఇండియా హీరోయిన్ అవుతానని కలలో కూడా ఊహించి ఉండదు. కానీ అవ్వడంతో పాటు మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన లేటెస్ట్ సెన్సేషన్ 'అబ్సెషన్')

హీరోయిన్‌గా తొలి సినిమాతో గుర్తింపు వచ్చిన కొన్నాళ్లకు 'ఛలో' అంటూ రష్మిక తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రం మంచి పేరుతో పాటు అద్భుతమైన అవకాశాల్ని తెచ్చిపెట్టింది. అనంతరం తెలుగులోనే 'గీతగోవిందం' మూవీ ఈమె లైఫ్, కెరీర్ రెండింటిని మార్చేసిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇందులో హీరోగా నటించిన విజయ్ దేవరకొండ ఇప్పుడు ఈమె భర్త అయ్యాడు. ఇది బ్లాక్‌బస్టర్ సక్సెస్ కావడంతో మహేశ్ బాబు, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోల సరసన అవకాశాలు వచ్చాయి.తెలుగులో మంచి సక్సెస్ కారణంగా బాలీవుడ్‌లోనూ రష్మికకు వరస ఛాన్సుల వచ్చాయి. యానిమల్, ఛావా చిత్రాలు ఈమెని పాన్ ఇండియా స్థాయిలో ఓ రేంజికి తీసుకెళ్లిపోయాయి.

ఈ ఏడాది ప్రారంభంలో విజయ్ దేవరకొండని పెళ్లి చేసుకున్న రష్మిక.. ఓవైపు సినిమాలు చేస్తూ మరోవైపు ఫిట్‌నెస్ కాపాడుకుంటూ ఫుల్ బిజీగా ఉంది. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే ఉంటుంది. రీసెంట్ టైంలో ఈమె చేసిన 'కాక్‌టెయిల్ 2' థియేటర్లలోకి వచ్చింది. ఈ ఏడాదిలోనే భర్తతో చేసిన రణబాలి, లీడ్ రోల్ చేసిన ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీ 'మైసా' రిలీజ్ కానున్నాయి. ఇదంతా చూస్తుంటే పదేళ్లలో రష్మిక జీవితం ఎంతలా మారిపోయిందో కదా!

(ఇదీ చదవండి: సీఎం విజయ్‌లా రాజకీయాల్లోకి సూర్య.. ఇది క్లారిటీ)

Videos

నిప్పుల కొలిమిగా యూరప్... పిట్టలా రాలిపోతున్న జనాలు!

2029లో మీరు రాజారెడ్డి మనవడిని చూస్తారు..! ఒక్కొక్కడికీ ఊచకోతే..!

జులైలో వానలు! విశాఖ IMD గుడ్ న్యూస్

YS జగన్ ను కలిసిన సింగపూర్ కాన్సులేట్ జనరల్

కేతన్ హత్య కేసులో బయటపడుతున్న కీలక ఆధారాలు.. మరో సంచలన ట్విస్ట్!

మినిమం కామన్ సెన్స్ లేదా... ఏమ్మా హోమ్ మినిస్టర్, ఏం చేస్తున్నావ్..!

High Tension: చంద్రబాబు ఇంటిని ముట్టడి బారు గేట్లు లాగిపడేసిన రైతులు

సాయికృష్ణ కేసులో RMP డాక్టర్ చెప్పిన నమ్మలేని నిజాలు

ఫేస్ యాప్ దుర్వినియోగం? ఉపాధి హామీలో టీడీపీ అక్రమాలు

రికార్డులు బద్దలు కొట్టిన సమంత.. అనుష్కను దాటేసింది!

Photos

+5

అక్కినేని అఖిల్‌ ‘లెనిన్‌’ మూవీ HD స్టిల్స్‌

+5

‘హ్యాంగ్‌మ్యాన్’ మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

‘ఆల్ఫా’ మూవీ ప్రమోషన్‌లో సందడి చేసిన అలియా భట్ (ఫొటోలు)

+5

గ్లామరస్‌గా సింగ్ గీతం బ్యూటీ నివేదా పేతురాజ్.. (ఫోటోలు)

+5

రొట్టెల పండగ : స్వర్ణాల తీరం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

అందాల అదితీ రావు హైదరీ (ఫొటోలు)

+5

రకుల్.. అదిరెన్ నీ సొగసులు! (ఫొటోలు)

+5

లార్డ్స్ మైదానంలో సందడి చేసిన కోహ్లి-ధావన్ ఫ్యామిలీస్! (ఫోటోలు)

+5

ఫ్యామిలీతో హీరోయిన్ మధుబాల స్పెషల్ మూమెంట్స్ (ఫొటోలు)

+5

బాలీవుడ్ భామ ప్రగ్యా కపూర్ బర్త్‌ డే.. తమన్నా సందడి (ఫోటోలు)