సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి పిటిషన్ పై విచారణ
Breaking News
ఒక్క స్పీచ్.. చిరంజీవిపై ట్రోలింగ్
Published on Wed, 06/24/2026 - 14:03
ఇప్పుడంతా సోషల్ మీడియా జమానా. ఒకప్పటిలా కాదు ఏం మాట్లాడినా ఆచితూచి మాట్లాడాలి. లేదంటే విమర్శలు, ట్రోలింగ్ లాంటివి చాలానే తట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే 'పెద్ది' మెగా బ్లాక్ బస్టర్ ఈవెంట్ పేరిట మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఇందులో చిరంజీవి చేసిన ఓ కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు కారణమవుతోంది.
(ఇదీ చదవండి: కమ్ బ్యాక్ అంటే ఇది.. ఓడిన చోటే సమంత గెలిచింది)
'పెద్ది' చరణ్ నటన గురించి పొగిడిన చిరంజీవి.. ఈ సినిమాతో చరణ్ పరిపూర్ణ నటుడు అనిపించుకున్నాడని, నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫెర్ఫార్మెన్స్ అంటున్నారని చెప్పుకొచ్చారు. అందరూ చరణ్‌కి నేషనల్ అవార్డ్ వస్తుంది అంటున్నారు. అవార్డ్ రాకపోయినా పర్లేదు. అవార్డ్ రావడానికి ఎన్నో దారులు ఉంటాయి. కానీ ప్రజలందరూ నేషనల్ అవార్డ్ విన్నింగ్ పెర్ఫార్మెన్స్ అంటుంటే చాలా ఆనందంగా అనిపించింది అని చిరంజీవి అన్నారు.
అయితే 'అవార్డ్ రావడానికి ఎన్నో దారులు' అనే మాట ఇప్పుడు కాంట్రవర్సీకి కారణమైంది. ఎందుకంటే 'పుష్ప' సినిమాకుగానూ అల్లు అర్జున్.. ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డ్ అందుకున్నాడు. అయితే చిరంజీవి.. బన్నీని ఉద్దేశించి ఈ కామెంట్స్ చేశారని పలువురు నెటిజన్లు విమర్శిస్తున్నారు. మరికొందరు మాత్రం ఆర్ట్ ఫిలిమ్స్, కమర్షియల్ హంగులు లేని ప్రయోగాత్మక చిత్రాలు చేస్తే అవార్డు అవకాశాలు పెరుగుతాయని, అంతే తప్ప కొనుక్కుంటేనో లాబీయింగ్ చేస్తేనో వస్తాయని కాదనే ఉద్దేశంలోనే చిరు అన్నారని చెబుతున్నారు.
మరి చిరంజీవి ఏ ఉద్దేశంతో అన్నారో ఏమో గానీ సోషల్ మీడియాలో మాత్రం ఈయనపై విమర్శలే ఎక్కువగా వస్తున్నాయి. ఏదేమైనా చిరు స్పీచ్ మాత్రం పెద్ద దుమారమే లేపేలా ఉంది.
(ఇదీ చదవండి: 'పెద్ది' సక్సెస్ ఈవెంట్.. జాన్వీతో పాటు వాళ్లెక్కడ?)
Tags : 1