Breaking News

అతిగా పాలు తాగడం ఎముకలకు హానికరమా? వైద్యులు ఏమంటున్నారంటే..

Published on Tue, 06/23/2026 - 16:52

పాలు ఆరోగ్యానికి మంచిదని, దానిలో కాల్షియం సమృద్ధిగా ఉంటుందని విన్నాం. అయితే అతిగా తాగితే అవే పాలు హానికరమై ఎముకలు పెళుసుగా మారిపోయి విరిగిపోతాయనే అపోహ కూడా ప్రబలంగా ఉంది. ముఖ్యంగా మాంసం, పాల ఉత్పత్తులు ఎక్కువగా తీసుకుంటే ఈ సమస్య మరింత ఎక్కువ అంటూ సోషల్‌ మీడియా పోస్టులు తెగ వైరల్‌ అయ్యాయి. కానీ ఇందులో ఏమంత వాస్తవం లేదని తేల్చి చెబుతున్నారు వైద్యులు. చాలామంది పాల ఉత్పత్తులు అధికంగా తీసుకుంటే ఆస్టియోపొరోసిస్‌ వస్తుందని చెబుతుంటారు.. ఇది కూడా ఎంతమాత్రం నిజం కాదని అంటున్నారు ఆర్ధోపెడిక్‌ సర్జన్లు. అసలు ఈ అపోహ ఎందుకు వచ్చింది?, నిజంగానే పాలు అధికంగా తీసుకోకూడదా అంటే..?

మాంసం, పాల ఉత్పత్తులు అధికంగా తీసుకుంటే శరీరంలో ఆమ్లత్వం పెరిగి దానిని తటస్థీకరించడానికి ఎముకల నుంచి కాల్షియం గ్రహించాల్సి వస్తుందని, తత్ఫలితంగా ఎముకల సంబంధిత సమస్యలు అధికమవుతాయని పలువురు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది నిజం కాదని పరిశోధనల్లో ఇలా జరుగుతుందని నిర్థారితం కాలేదని అన్నారు. 

ఆహారంలోని ప్రోటీన్‌ ముఖ్యం, సరైన మోతాదులో కాల్షియం తీసుకుం​​టే ఎముకలను దృఢంగా మార్చడమే కాకుండా ఎముకలు విరగకుండా కాపాడతాయని చెబుతున్నారు. పాలు అధికంగా తీసుకుంటే ఆస్టియోపొరోసిస్‌ వస్తుందనే వాదనకు శాస్త్రియ ఆధారాలు లేవని తేల్చి చెప్పారు. అలాగే ఆమ్లీకరణం సమస్య వస్తుందనేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని అన్నారు. 

ఆస్టియోపొరోసిస్‌ అంటే..
ఎముకల ఖనిజ సాంద్రత తగ్గడం వల్ల ఎముకలు బలహీనపడి, సులభంగా విరిగిపోయే పరిస్థితి. ఇది అనేక జన్యు, జీవ, జీవనశైలి కారకల వల్ల ఈ సమస్య వస్తుందని వైద్యులు చెబుతున్నారు. అలాగే వృద్ధాప్యం, హార్మోన్ల స్థితిలో మార్పులు, విటమిన్ డి లోపం, శారీరక శ్రమ లేకపోవడం, ధూమపానం, సరైన పోషకాహారం లేకపోవడం తదితర కారణాల వల్ల ఈ వ్యాధి వస్తుందని అన్నారు. 

అయితే పాలల్లో కాల్షియం, ప్రోటీన్లు, ఫాస్ఫరస్ (బలవర్ధకమైన) విటమిన్ డి ఉంటాయి. ఇవి శరీరంలో ఎముకల నిర్మాణంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని అన్నారు. కానీ అతిగా తీసుకుంటే అసమతుల్యత ఏర్పడి పోషకాహార లేమికి దారితీస్తుందే తప్ప..ఆస్టియోపొరోసిస్‌ ప్రమాదాన్ని పెంచదన్నారు. ఎప్పుడైతే పాలను ఎక్కువగా తీసుకుంటామో ఫలితంగా ముఖ్యమైన పోషకాలు శరీరానికి అందకుండా పోతాయన్నారు. 

అలాగే అజీర్ణం, పాలు పడకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయన్నారు. ఎముకల బలం ‍కోసం బేషుగ్గా పాలు తీసుకోవచ్చని అన్నారు. కానీ మితంగా తీసుకుంటే మంచి ప్రయోజనాలు పొందగలమని చెప్పారు. పైగా ఆస్టియోపొరోసిస్‌ను నివారిస్తుందన్నారు. చాలామటుకు సమతుల్యతకు పెద్దపీట వేస్తూ..అన్ని రకాల పోషకాలు అందేలా తీసుకుంటే మంచి ప్రయోజనాలు పొందగలమని అంటున్నారు. 

(చదవండి: రాయల్ ఆస్కట్ కార్యక్రమంలో డ్రెస్‌కు బదులుగా చీర..! బ్రిటన్‌ పౌరురాలేనే ఐనా..)
 

#

Tags : 1

Videos

సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి పిటిషన్ పై విచారణ

బట్టల్లేకుండా రక్తపుమడుగులో గాయత్రి ఆరోజు అర్ధరాత్రి HOTEL లో..!

60 ఏళ్లుగా సాధ్యం కాని రికార్డు బ్రేక్

బిగ్ షాక్ ఇచ్చిన త్రిష - విజయ్ షేక్ అవుతున్న తమిళనాడు

ఆ తల్లి బూడిద అడిగితే... ఏ కులం అంటు..!

JC ప్రభాకర్ రెడ్డికి బిగ్ షాక్ తాడిపత్రిలో YSRCP భారీ నిరసన

క్రాంతి కుమార్ ఇంటికి ఏపీ హైకోర్టు న్యాయవాదుల బృందం

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్

కమిషనరేట్ నుంచి కృష్ణలంక పీఎస్ దాకా.. అందరికీ ఈ కేసుతో లింకులు

CI నాగరాజు అరెస్ట్ అంతా డ్రామానా? రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు అన్ని మాయం

Photos

+5

నాగదుర్గ 'ఇడుపు కాయితం' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ముంబైలో అట్టహాసంగా ' స్టైల్ ఐకాన్స్ సమ్మిట్ అవార్డ్స్ 2026' వేడుక (ఫొటోలు)

+5

షూటింగ్‌లకు బ్రేక్.. నేపాల్‌ప్రకృతి ఒడిలో మీనాక్షి చౌదరి (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో నాని (ఫొటోలు)

+5

39 సెకన్ల తేడాతో.. వెనెజువెలాలో మహా విధ్వంసం! (ఫొటోలు)

+5

హైదరాబాద్ : మాయజేసినట్టే.. వాన కొట్టే.. (ఫొటోలు)

+5

‘సూపర్‌ సుబ్బు’ సిరీస్‌ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సమంత ‘మా ఇంటి బంగారం’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

పులివెందులలో రెండో రోజు వైఎస్‌ జగన్‌ పర్యటన (ఫొటోలు)

+5

ముద్దుల కూతురితో బిగ్‌బాస్ శివజ్యోతి (ఫొటోలు)