Breaking News

జీడీపీ వృద్ధికి సవాళ్లు..!

Published on Tue, 06/23/2026 - 07:56

ముంబై: అమెరికా–ఇరాన్‌ మధ్య ఒప్పందం విఫలమైనా, నైరుతి రుతుపవనాలు బలహీన పనితీరు చూపించినా భారత ఆర్థిక వ్యవస్థ... వృద్ధి పరంగా సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆర్‌బీఐ తాజా బులెటిన్‌ పేర్కొంది. పశ్చిమాసియాకు సంబంధించి మధ్యంతర శాంతి ఒప్పందం అమల్లో ఉన్నప్పటికీ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, వాణిజ్య అవరోధాలు కొనసాగుతున్నట్టు ప్రస్తావించింది.

అమెరికా–ఇరాన్‌ శాంతి ఒప్పందం కొంత ఉపశమనం కలిగించినప్పటికీ.. పపంచ ఆర్థిక వ్యవస్థ బలహీనంగానే ఉన్నట్టు తెలిపింది. ‘‘ఈ ఒప్పందం విచ్ఛిన్నం అయితే తిరిగి ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు పెరిగిపోతాయి. కీలకమైన ఇంధన సరఫరాల్లో సమస్యలు, పెట్టుబడుల వ్యయాలు నిదానించడం, ఆహార భద్రత ఆందోళనలు, ఆర్థిక స్థిరత్వం దెబ్బతిని, వృద్ధి తగ్గిపోతుంది’’అని ఆందోళన వ్యక్తం చేసింది. అంతర్జాతీయంగా సవాళ్లు ఉన్నప్పటికీ 2025–26లో చివరి త్రైమాసికంలో భారత్‌ జీడీపీ 7.8 శాతం వృద్ధిని నమోదు చేసిందంటూ.. ప్రైవేటు వినియోగం, స్థిర పెట్టుబడులు ఇందుకు మద్దతునిచ్చినట్టు వివరించింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలల్లోనూ (ఏప్రిల్, మే) ఆర్థిక కార్యకలాపాలు స్థిరంగానే కొనసాగుతున్నాయని ముఖ్యమైన సూచికలు తెలియజేస్తున్నట్టు పేర్కొంది. రిటైల్‌ ద్రవ్యోల్బణం మే నెలలో పెరిగినప్పటికీ, అది నియంత్రిత శ్రేణిలోనే ఉండడాన్ని గుర్తు చేసింది. విదేశీ వాణిజ్యం, చెల్లింపుల స్థితులు బలంగానే ఉన్నాయని వెల్లడించింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ), తగినంత విదేశీ మారకం నిల్వలు మద్దతుగా నిలిచినట్టు పేర్కొంది.  

ఎదుర్కొనే స్థితిలో.. 
ఇతర దేశాలతో పోల్చి చూస్తే.. బలమైన ఆర్థిక మూలాలతో భారత్‌ ఆర్థిక వ్యవస్థ సంక్షోభ పరిస్థితులను తట్టుకుని నిలవగలదని ఆర్‌బీఐ బులెటిన్‌ పేర్కొంది. ఎల్‌పీజీ ధరలు పెంచినందున అది రెస్టారెంట్ల సేవలపై ప్రభావం చూపించి, ద్రవ్యోల్బణం పెరిగేందుకు దారితీస్తుందని అంచనా వేసింది. జూన్‌ 18 నాటికి ఉన్న డేటా ప్రకారం ఆహార ధరల్లో పెరుగుదల కొనసాగుతున్నట్టు తెలిపింది. బియ్యం, గోధుమలు, ప్రధాన పప్పుల ధరలు పెరిగినట్టు వెల్లడించింది. అలాగే, ఆలుగడ్డ, ఉల్లిగడ్డ, టమాటా, నూనెల ధరలు పెరగడాన్ని ప్రస్తావించింది. అంతర్జాతీయంగా ఇంధన సరఫరాల్లో సమస్యలతో భారత క్రూడ్‌ బాస్కెట్‌ ధరలు గరిష్టాల్లోనే ఉన్నట్టు పేర్కొంది.

Videos

Perni Nani: తొక్కి పెట్టి నార తీస్తావా? ఆటలో అరటిపండు గాడివి..!

ఇద్దరి బాలీవుడ్ భామలతో ఇంగ్లండ్ క్రికెటర్ ప్రేమాయణం!

ఢిల్లీలో ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం

CI నాగరాజు కాలర్ ఎగరేసుకొని...! సాయి కృష్ణ కేసులో కూటమి కుట్ర

డబ్బు కోసమే రైల్వే ఎంప్లాయ్ ట్రాప్..! వైరల్ అవుతున్న ఆడియో

విజయ్ Vs ఉదయ్ తమిళనాడు అసెంబ్లీలో రచ్చ రచ్చ

అమృత్ 2.0 పనుల్లో చంద్రబాబు నిలువు దోపిడీ

మంత్రి నారాయణకు కాకాణి గోవర్థన్ రెడ్డి సవాల్

బంగారం కొనేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి

సుధీర్ ఎవడు? ఇచ్చిపడేసిన రష్మీ

Photos

+5

ప్రజలతో మమేకమైన వైఎస్ జగన్‌ (ఫొటోలు)

+5

మా ఇంటి బంగారం టీమ్‌కు మెగాస్టార్ ప్రశంసలు (ఫొటోలు)

+5

ఢిల్లీలో ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

గ్రాండ్‌గా బోనీ కపూర్ కూతురి పెళ్లి వేడుకలు ప్రారంభం (ఫొటోలు)

+5

చీరలో తెలుగందం రీతూవర్మ (ఫొటోలు)

+5

లేటు వయసులోనూ మరింత అందంగా హీరోయిన్ (ఫొటోలు)

+5

నాగదుర్గ.. యూట్యూబ్ సాంగ్స్ నుంచి హీరోయిన్ ఛాన్స్‌ల వరకు (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : అర్ధనారీశ్వరం..అద్భుతం (ఫొటోలు)

+5

వైష్ణవిని పెళ్లి చేసుకున్న 'బిగ్‌బాస్' షణ్ముఖ్ జస్వంత్ (ఫొటోలు)

+5

విశాఖపట్నం : వల నిండింది.. పంట పండింది (ఫొటోలు)