5000 మంది చొరబాటుదారులకు చుక్కలు.. సరిహద్దుల్లో భారత ఆర్మీ విశ్వరూపం!
Breaking News
చిన్న వయసులోనే కన్నుమూసిన ప్రముఖ బాలనటి
Published on Thu, 06/18/2026 - 17:20
హాలీవుడ్ ప్రముఖ నటి డేవీ ఛేజ్ చనిపోయింది. 35 ఏళ్ల వయసుకే ఈమె నూరేళ్లు నిండిపోయాయి. లాస్ ఏంజెల్స్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ డేవీ మృతి చెందినట్లు ఈమె మేనేజర్ జాన్ ర్యాన్ మీడియాకు వెల్లడించారు. మెనింజైటిస్ కారణంగా వచ్చిన సెప్సిస్‌తో ఈమె చనిపోయినట్లు పేర్కొన్నారు. మరణానికి ముందు పోషకాహార లోపంతో ఆస్పత్రిలో చేరినట్లు ఈయన పేర్కొన్నారు.
(ఇదీ చదవండి: ప్రెగ్నెన్సీ ప్రకటించిన టాలీవుడ్ హీరోయిన్)
డేవీ ఛేజ్.. నాలుగేళ్లకే యాక్టర్‌గా మారింది. ఏడేళ్ల వయసులోనే హాలీవుడ్‌లో తొలి అవకాశం దక్కించుకుంది. అమెరికన్ సిట్‌కామ్ 'సబ్రినా ది టీనేజ్ విచ్' షోతో టీవీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. అనంతరం డోనీ డార్కో, ఎస్ డార్కో చిత్రాల్లో నటించింది. అయితే 2002లో రిలీజైన హారర్ మూవీ 'ద రింగ్' మూవీలో సమారా మోర్గాన్ అనే పాత్రతో భయపెట్టింది. టీవీ నుంచి బయటకొస్తూ భయపెట్టే ఆ పాత్ర చాలామంది ప్రేక్షకులకు గుర్తుండే ఉంటుంది.
2002లో రిలీజైన యానిమేషన్ మూవీ 'లిలో & స్టిచ్'లో లిలో పాత్రకు డబ్బింగ్ చెప్పి డేవీ గుర్తింపు అందుకుంది. పలు అవార్డులు కూడా ఈమెని వరించాయి. తర్వాత కాలంలో చార్మ్డ్, ఈఆర్, టచ్డ్ బై యాన్ ఏంజెల్ తదితర వెబ్ సిరీస్‌ల్లో అతిథి పాత్రలు చేసింది. బిగ్ లవ్ సిరీస్‌లో రొండా వోల్మర్ పాత్రలో 32 ఎపిసోడ్‌ల పాటు కనిపించింది. 2015 తర్వాత నటనకు పూర్తిగా దూరమైన డేవీ ఛేజ్.. ఇప్పుడు 35 ఏళ్ల వయసులో ఇలా అనారోగ్య సమస్యల బారిన పడి చనిపోవడం చాలామందిని షాక్‌కి గురిచేసింది.
(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న సీరియల్ హీరోహీరోయిన్)
Tags : 1