రూ.40 లక్షలు ఇప్పిస్తా, రాజీ చేసుకోండి అంటూ జనసేన నేతలు బెదిరించారు
Breaking News
హఠ యోగా అంటే..? అమెరికన్లు ఇష్టపడటానికి కారణ ఇదేనా..
Published on Thu, 06/18/2026 - 13:37
ఇవాళ ఉరుకుల పరుగుల కాలంలో యోగా మళ్లీ అందరి జీవితంలో భాగమయ్యేలా క్రేజ్ సంతరించుకుంటుంది. ఆధునికంగా జిమ్, ఏరోబిక్ వంటి ఎన్నో రకాల వర్కౌట్లు ఉన్నా ప్రముఖులు, సెలబ్రిటీల వరకు అంతా యోగాకే ప్రాముఖ్యత ఇవ్వడం విశేషం. అదీగాక మరి కొద్దిరోజుల్లోనే(జూన్ 21)న యోగా దినోత్సవం పురస్కరించుకుని అమెరికన్లు అంతగా మెచ్చే హఠయోగా గురించి సవివరంగా తెలుసుకుందామా.!.
గూగుల్స్ ట్రెండ్స్ డేటా ప్రకారం అమెరికన్లు ఎంత ఇష్టపడే సాధాన హఠ యోగా. ఇది శారీరక భంగిమలు, మైండ్‌ఫుల్‌నెస్‌తో చేసే శ్వాస పద్ధతులను మిళితం చేసే సాంప్రదాయ యోగా. ఇది శరీరం, మనస్సు మధ్య బలమైన బంధాన్ని సృష్టించడంపై దష్టిసారించడం వల్లే ప్రజలు అంతగా ఆకర్షితులవ్వుతారని చెబుతున్నారు ప్రముఖ యోగా నిపుణులు.
హఠ యోగా అంటే..
హఠ యోగా అత్యంత పురాతనమైన..చాలామంది ఆచరించే యోగా రూపాలలో ఒకటి. సాంప్రదాయకంగా, ఇది ఆసనాలు, శ్వాసవ్యాయామాలు, ధ్యానంతో మిళితమయ్యే యోగా ప్రక్రియ. నెమ్మదైన కదలికలతో ఆసనాల్లో ఎక్కువసేపు ఉండాల్సి ఉంటుంది. ఈ పేరులోని 'హా', 'ఠ'లను సూర్యచంద్రులకు ప్రతీకలుగా చెబుతారు యోగా నిపుణులు. అందువల్ల ఇది శరీరం-మనస్సు మధ్య ఘర్షణను శాంతపరిచేలా సమతుల్యత తీసుకురావడాన్ని లక్ష్యంగా చేసుకుంటుందట.
అమెరికన్లు ఇష్టపడటానికి రీజన్..
ప్రారంభకులు సలుభంగా చేయగలిగేలా ఉండటం తోపాటు అధిక తీవ్రత గల ఫిట్‌నెస్ తరగతులకు భిన్నంగా నెమ్మదైన కదలిక, శ్వాసపై ఫోకస్ తదితరాల వల్ల ఈజీగా చేయగలమనే నమ్మకంతో ఇష్టపడుతున్నారనేది వాదన. కొందరు కఠినమైన వ్యాయమాల కంటే ఇది శారీరకంగా, మానసికంగా స్ట్రాంగ్‌గా, హెల్దీగా ఉండేలా చేస్తుందని ప్రగాఢంగా విశ్వసించడం మరొక కారణం. అదీగాక ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరూ ఒత్తిడి, నిరాస నిస్ప్రుహలను ఎదుర్కొనడం అధికమవ్వడం వల్లే ఈ హఠ యోగాకి ఆదరణ పెరిగిందని అంటున్నారు యోగా నిపుణులు.
కలిగే ఉపయోగాలు..
ఏకాగ్రతను పెంచుతుంది.
దీనిలోని శ్వాన వ్యాయామాలు భావోద్వేగ పరిస్థితులను హ్యాండిల్ చేసే శక్తిని అందించి ప్రశాంతతను చేకూరుస్తాయి.
ఒత్తిడితోకూడని పనివేళలు, డిజిటల్ పరధ్యానంకు చెక్‌పెట్టే గొప్ప సాధన
వర్తమానంలో ఉండగలిగే శక్తిని అందిస్తుంది.
ఇది శరీరానికి వ్యాయమానికి మించింది కూడా.
ధ్యానానిక పునాదిగా మారుతుంది.
ఈ కారణాల వల్లే అమెరికన్లు హఠయోగకి ప్రాధాన్యత ఇస్తున్నారని చెబుతున్నారు యోగా నిపుణులు. అక్కడ ఇది ఒక ఫిట్‌నెస్ ట్రెండ్‌కి మించిందని చెబుతుండటం విశేషం.
యోగా గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఈ కింది లింక్‌పై క్లిక్ చేయండి
Tags : 1