రూ.40 లక్షలు ఇప్పిస్తా, రాజీ చేసుకోండి అంటూ జనసేన నేతలు బెదిరించారు
Breaking News
ప్రెగ్నెన్సీ ప్రకటించిన టాలీవుడ్ హీరోయిన్
Published on Wed, 06/17/2026 - 20:17
పెళ్లిళ్ల సీజన్ మళ్లీ మొదలైపోయింది. ఈ ఏడాది ఇప్పటికే రష్మికతో పాటు పలువురు నటీనటులు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టగా.. మరికొందరు హీరోయిన్లు ప్రెగ్నెన్సీ లాంటి శుభవార్తలు కూడా చెప్పేస్తున్నారు. టాలీవుడ్ హీరోయిన్ ఇప్పుడు ఆ లిస్టులోకి చేరిపోయింది. బేబీ బంప్‌తో భర్తతో కలిసి చేసిన వీడియోని సోషల్ మీడియాలో పంచుకుంది.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా)
గుజరాత్‌కి చెందిన పూజా ఝావేరి.. 2015లో 'భమ్ భోళేనాథ్' అనే తెలుగు సినిమాతోనే హీరోయిన్‌గా పరిచయమైంది. తర్వాత విజయ్ దేవరకొండతో కలిసి 'ద్వారక', సుమంత్ అశ్విన్ 'రైట్ రైట్', రవితేజ 'టచ్ చేసి చూడు',47 డేస్, బంగారు బుల్లోడు, మాయగాడు, మిక్స్ అప్ తదితర టాలీవుడ్ చిత్రాలు చేసింది.
2024లో ఎన్నారైని పెళ్లి చేసుకుంది. అప్పటినుంచి న్యూయార్క్‌లోనే ఉంటోంది. ఈ క్రమంలోనే కొన్నిరోజుల క్రితం ప్రెగ్నెన్సీ ప్రకటించిన పూజా ఝావేరి.. భర్తతో కలిసి బీచ్ ఒడ్డున బేబీ బంప్‌తో తీసుకున్న వీడియోని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.
(ఇదీ చదవండి: ముఖ్యమంత్రిగా విజయ్.. ముందే ఊహించిన సమంత)
Tags : 1